జేడీయూలో అసమ్మతి భగ్గు.. నితీష్ ఐక్యతా రాగానికి చిక్కు!

Publish Date:Feb 21, 2023

Advertisement

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ తగిలింది. జేడీయూ కీలక నేత ఉపేంద్ర కుష్వాహా పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతటితో ఆగకుండా రాష్ట్రీయ లోక్ జనతాదళ్ పేర వేరే పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవులకూ రాజీనామా చేసిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  నితీష్ కుమార్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జేడీయూ పార్లమెంటరీ బోర్డు చైర్ పర్సన్ సహా పార్టీలో పలు కీలక పదవులు నిర్వహిస్తున్న ఉపేంద్ర కుష్వారా పార్టీ నుంచి వైదొలగడం.. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న నితీష్ కు గట్టి ఎదురుదెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఉపేంద్ర కుష్వారా నితీష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. కేవలం నితీష్ తీరు కారణంగానే జేడీయూ బలహీనపడిందని ఆయన ఆరోపించారు. 2005లో నితీష్ ముఖ్యమంత్రి అయిన సమయంలో ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయి. అయితే సీఎం అయిన తరువాత నితీష్ పూర్తిగా మారిపోయారనీ, ఇష్టారీతిగా వ్యవహరిస్తూ పార్టీని నిర్వీర్యం చేశారని విమర్శలు గుప్పించారు.

పార్టీలో బీసీ, దళిత నాయకులను అణగదొక్కుతూ, తొలి నుంచీ పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టేసి, ఇప్పుడు ఆర్జేడీ నేతలను తన వారసులుగా ప్రకటిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి తన పదవి కాపాడుకోవడానికి పలు మార్లు మిత్రధర్మాన్ని ఉల్లంఘించిన నితీష్ కుమార్ ఇప్పుడు కేంద్రంలో అధికారపీఠంపై కన్నేసి సొంత పార్టీనే నిర్వీర్యం చేసేయత్నం చేస్తున్నారని విమర్శించారు. 63 ఏళ్ల కుహ్వాగా ఎంపీగా, ఎమ్మెల్సీసీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు.  పార్టీలో నితీష్ తరువాత ఆ స్థాయి పలుకుబడి, ఫాలోయింగ్ ఉన్న నాయకుడు.   ఒక వైపు నితీష్ కుమార్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీయేతర పార్టీల ఐక్యతకు సారథ్యం వహించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంటే.. సోంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా బలమైన గళం వినిపిస్తుండటం కచ్చితంగా ఆయనను చిక్కుల్లో పడేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు. తాజాగా ఆయన 2024 ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ చేతులు కలపి పోరాడాలంటూ   పిలుపునిచ్చారు.

యునైటెడ్ ఫ్రంట్ గా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే బీజేపీని మట్టి కరిపించి ఆ పార్టీ సంఖ్యాబలాన్ని 100కు కుదించవచ్చిన నితీష్ చెబుతున్నారు. అంతే కాకుండా విపక్షాలు ఐక్యం కాకుంటే.. మరో సారి మోడీయే ప్రధాని అవుతారంటూ ఆయన విపక్షాల ఐక్యత బీజేపీయేతర పక్షాలకు అనివార్యంగా అవసరమని కూడా చాటారు. ఈ మాటలను ఆయన  పట్నాలో జరిగిన సీపీ ఎం 11వ జనరల్ కన్వెన్షన్  చెప్పారు. అంతే కాదు విపక్షాల ఐక్య కూటమికి సారథ్యం వహించాలన్న తన ఆకాంక్షను కూడా నితీష్ ఇటీవలి కాలంలో అన్యాపదేశంగానైనా సరే పదె పదే వ్యక్తం చేస్తున్నారు. అ

టువంటి తరుణంలో జేడీయూలో నంబర్ 2గా గుర్తింపు పొందిన కుష్వారా నితీష్ పై ధిక్కార స్వరం వినిపించడం, సొంత కుంపటి పెట్టుకోవడానికి సిద్ధపడటం, అదే సమయంలో నితీష్ కుమార్ తన అధికార దాహానికి పార్టీని ఫణంగా పెడుతున్నారంటూ విమర్శించడం చూస్తుంటే.. నితీష్ ఐక్యతా యత్నాలకు ఆదిలోనే హంసపాదు తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.