ఆసియా క‌ప్ ..లంక ను గెలిపించిన  ధ‌నాధ‌న్ కుషాల్ మెండిస్

Publish Date:Sep 2, 2022

Advertisement

కుషాల్ మెండిస్ మెరుపు ఇన్నింగ్స్‌తో  ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించింది. ఈ విజయంతో శ్రీలంక సూపర్- 4 కు అర్హత సాధించింది. గురువారం (ఆగ‌ష్టు 1) ఉత్కంఠ భరితంగా జరిగిన గ్రూప్‌ చివరి లీగ్‌ పోరులో రెండు వికెట్లతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. 184 పరుగుల లక్ష్యాన్ని ఇంకా నాలుగు బంతులుండగానే 8 వికెట్లు కోల్పోయి శ్రీలంక ఛేదించింది. 

టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు..ఓపెనర్‌ మెహ్దీ హసన్‌ (38) అద్భుత ఆరంభం ఇచ్చా డు. కానీ మధ్య ఓవర్లలో శ్రీలంక బౌలర్లు క‌ట్ట‌డి చేయ‌గ‌లిగారు. అయితే  అఫీఫ్‌ హొసేన్‌ (39), చివర్లో మొసాదిక్‌ మెరుపులతో బంగ్లాదేశ్‌  20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆఫిఫ్ హొస్సేన్ 39 పరుగులు, హసన్ మిరాజ్ 38 పరుగులతో రాణించారు. షకీబుల్ హసన్ (24), మహ్మ దుల్లా (27), మొసద్దిక్ హొస్సేన్(24) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగ, చమిక కరుణరత్నే రెండేసి వికెట్లు పడగొట్టారు. మదుశంక, మహేశ్ తీక్షణ, అషిత ఫెర్నాండో ఒక్కో వికెట్ తీశారు. 

184 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు నిశాంక, కుశాల్ మెండిస్ శుభారంభాన్ని ఇచ్చా రు. మొదటి వికెట్ కు 45 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో  నిశాంక, చరిత్ అస లంక వికెట్లు కోల్పోయింది. ఆ త‌ర్వాత‌ మెండిస్ మాత్రం బంగ్లా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిం చాడు.  చ‌క్క‌టి బ్యాటిం గ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో రెచ్చిపోయాడు.  కేవలం 37 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు.  అయితే మిగిలిన బ్యాట్స్మెన్ అంతగా రాణించలేకపోవటంతో లంక కష్టాల్లో పడింది. చివర్లో దసున్ శనక 45 పరుగులతో జట్టును విజయానికి చేరువ చేశాడు. 17వ ఓవర్లో అతను ఔటయ్యాడు

మ్యాచ్ చివరి 2 ఓవర్లు అత్యంత ఉత్కంఠ భ‌రితంగా సాగాయి.  కేవ‌లం రెండు ఓవ‌ర్ల‌లో  విజయానికి 25 పరుగులు అవసరమైన వేళ లంక మ్యాచ్ గెలవడం కష్టమే అనిపించింది. అయితే 19వ ఓవర్లో ఒక వికెట్ కోల్పోయిన లంక 17 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో 8 పరుగులు చేయాల్సిరాగా తొలి బంతికి ఒక పరు గు వచ్చింది. రెండో బంతికి ఫెర్నాండో ఫోర్ కొట్టాడు. మూడో బంతికి నో బాల్ సహా 3 పరుగులు రావటం తో లంకను విజయం వరించింది. బంగ్లా బౌలర్లలో హొస్సేన్ 3 వికెట్లతో రాణించాడు. 

ఈ విజయంతో శ్రీలంక సూపర్- 4 లో అడుగుపెట్టింది. గ్రూప్- బీ నుంచి ఇప్పటికే అఫ్ఘనిస్థాన్ సూపర్- 4 కు క్వాలిఫై అయ్యింది. గ్రూప్- ఏ నుంచి భారత్ సూపర్- 4 కు చేరుకుంది. ఇంక పాకిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఎవరు క్వాలిఫై అవుతారో తెలియాల్సి ఉంది. 

బంగ్లాదేశ్‌:20 ఓవర్లలో 183/7 (అఫీఫ్‌ 39, మెహ్దీ హసన్‌ 38, కరుణరత్నే 2/32 హసరంగ 2/41); శ్రీలంక:20 ఓవర్లలో 19.2 ఓవర్లలో 184/8 (కుశాల్‌ మెండిస్‌ 60, షనక 45, ఎబాదత్‌ 3/51).

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.