తిరుపతి దారిదోపిడీ కేసు సూత్రధారి వైసీపీ కార్యకర్త!
Publish Date:Nov 11, 2022
Advertisement
క్రైమ్ కీ వైసీపీకి అవినాభావ సంబంధం ఉందా? దాదాపుగా సంచలనాత్మకమైన అన్ని క్రైమ్ లలోనూ వైసీపీ లింకులు బయటపడుతుండటమే ఈ అనుమానాలకు కారణం. మూడున్నరేళ్ల కిందట 2019 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి, అప్పటి విపక్ష నేత, .ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ స్వంత బాబాయ్ పులివెందులలో తన సొంత ఇంటిలో దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించడానికి విఫలయత్నం చేసిన వారు ఆ తరువాత నారాసుర చరిత్ర అంటూ ప్రచారం చేసి ఎన్నికలలో లబ్ధి పొందారు. కానీ ఆ తరువాత సీబీఐ వివేకా హత్య కేసు చేపట్టిన తరువాత వివేకా హత్య వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులూ అందరూ వైసీపీకి చెందిన వారేనని దర్యాప్తులో వెలుగులోకి వస్తోంది. జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల కూడా అవే అనుమానాలు వ్యక్తం చేశారు. అది పక్కన పెడితే తిరుపతిలో సంచలనం సృష్టించిన దారి దోపిడీ కేసులో వైసీపీ కార్యకర్త కృష్ణమూర్తి అరెస్టయ్యాడు. నిందితుడి నుంచి 32.5 లక్షల నగదు, రివాల్వర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురూ కూడా కుప్పానికి చెందిన వైసీపీ నాయకుడి ప్రధాన అనుచరులని కూడా పోలీసులు చెబుతున్నారు.ఇక ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. 35లక్షల రూపాయలకు 70లక్షల బ్లాక్ మనీ ఇస్తామంటూ హైదరాబాద్ కు చెందిన ఓ రియల్టర్ కు వైసీసీ కార్యకర్త కృష్ణమూర్తి ఆశ చూపారు. ఇందు కోసం దాదాపు హనీట్రాప్ చందంగా ముగ్గురు మహిళలనూ ఉపయోగించారు. ఈ ట్రాప్ లో పడిన రియల్టర్ ఈ నెల 3న 35లక్షల రూపాయలు తీసుకుని తిరుపతి చేరుకున్నాడు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వైసీపీ కార్యకర్త కృష్ణమూర్తి గ్యాంగ్ లోని ఏడుగురు వ్యక్తులు శంకర్ రెడ్డి కంట్లో కారం కొట్టి సొమ్ముతో పరారయ్యారు. ఈ మేరకు శంకర్ రెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చంద్రగిరి మండలం గాదంకి టోల్ ప్లాజా సమీపంలో కారుతో పాటు ఏడుగురు యువకులను అరెస్టు చేశారు. అయితే అప్పటికే సొమ్మను వారు చేతులు మార్చేశారు. వారి నుంచి రాబట్టిన సమాచారంతో ఈ దోపిడీ సూత్రధారి కుప్పంకు చెందిన కృష్ణమూర్తి అని గుర్తించారు. కృష్ణమూర్తిని అరెస్టు చేసి సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. కాగా వైసీపీ కార్యకర్త కృష్ణమూర్తిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్నాటకలలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ దోపిడీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు మహిళలనూ కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో అరెస్టయిన వారంతా కుప్పం కు చెందిన వైసీపీ నాయకుడి ప్రధాన అనుచరులని విశ్వసనీయంగా తెలిసింది.
http://www.teluguone.com/news/content/kuppam-robery-case-kingpin-ycp-worker-25-147004.html





