Publish Date:Jun 17, 2026
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్, వన్యప్రాణుల రక్షణ విషయంలో కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఏనుగుల దాడిని అరికట్టడానికి కుమ్కీ ఏనుగులను రంగంలోకి దించిన ఆయన.. ఇప్పుడు నల్లమల అడవుల పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ఒక ప్రతిపాదనను సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో క్షీణిస్తున్న పులుల జనాభాను పెంచడమే లక్ష్యంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంతతిని వేగంగా వృద్ధి చేయడం కోసం ఇతర రాష్ట్రాల నుండి ఆరు ఆడ పులులను ఏపీకి పంపాలని కోరారు.
ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ సమతుల్యతపై పవన్ కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా నల్లమల అడవుల్లో పులుల సంఖ్య తగ్గుముఖం పట్టడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. పర్యావరణ మార్పులు, మానవ జోక్యం, వేట వంటి వివిధ కారణాల వల్ల ఈ ప్రాంతంలో పులుల సంతతి క్రమంగా క్షీణిస్తోందనీ, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆయన లేడీ టైగర్స్ ప్రాజెక్టును ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనలో భాగంగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం 6 ఆడ పులులను పంపించాలని కోరారు. అందులో వన్యప్రాణుల సంరక్షణలో అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్ర నుండి 4 , మధ్యప్రదేశ్ నుండి 2 ఆడ పులులను ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. ఈ ఆరు ఆడ పులులను నల్లమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం ద్వారా పులుల మధ్య Breeding ప్రక్రియ వేగవంతం అవుతుందని, ఇది దీర్ఘకాలంలో పులుల సంఖ్యను పెంచడానికి దోహదపడుతుందని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఈ బ్రీడింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యంత శక్తిమంతమైన టైగర్ కన్జర్వేషన్ జోన్‌గా అవతరిస్తుందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వివరించారు.
రాబోయే రోజుల్లో ఏపీ నుంచే ఇతర రాష్ట్రాలకు పులులను పంపించే స్థాయికి రాష్ట్ర అడవులు ఎదుగుతాయని ఆయన కేంద్రమంత్రికి వివరించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వినూత్న ప్రతిపాదన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వన్యప్రాణుల సంరక్షణపై ఆయన చూపిస్తున్న శ్రద్ధ నల్లమల అడవుల రూపురేఖలను మార్చడమే కాకుండా, పర్యావరణ ప్రేమికుల్లో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kunki-elephantsand-tigresses-36-223210.html
మే 8న హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. మే 16వ తేదీన భగీరథ్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అంటే దాదాపు 45 రోజులకు పైగా అతడు చర్లపల్లి జైలులోనే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
తమ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నందుకు ప్రతీకారంగానే పాక్ సైనిక కేంద్రాలపై దాడులు చేస్తున్నామని బలూచ్ రెబల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సైన్యంపై మరిన్ని భారీ ఎత్తున దాడులు చేస్తామని స్పష్టం చేశాయి.
తంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఖాసిం సులేమానీ మతికి ప్రతీకారంగా ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఎత్తుగడలు వేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ నివేదికలు, రక్షణ రంగ తాజా విశ్లేషణల మేరకు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాల జాబితాలో భారత్ మూడవ స్థానానికి దూసుకెళ్లింది. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలవగా, అత్యాధునిక యుద్ధ పరిజ్ఞానం కలిగిన రష్యా రెండో స్థానంలో ఉంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఇప్పటివరకు మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చిన చైనాను అధిగమించి ఇండియా ఈ ఘనత సాధించింది.
స్టాక్ మార్కెట్లో సరైన ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేసి ₹2 లక్షలు ఎలా పోగొట్టుకున్నానో ఈ వెబ్ స్టోరీలో చూడండి. కొత్త ఇన్వెస్టర్లు ఫోమో FOMO, స్టాప్ లాస్ లేకపోవడం వంటి ఏ తప్పులు చేయకూడదో మరియు రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల FII 60 బిలియన్ డాలర్ల అమ్మకాల సునామీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. ముడి చమురు ధరల తగ్గుదలతో మారిన మార్కెట్ సమీకరణాలు మరియు దేశీయ ఇన్వెస్టర్ల రికార్డు కొనుగోళ్లపై పూర్తి విశ్లేషణ.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తొలిసారి అధికారికంగా కరూర్ జిల్లాలో పర్యటించనున్నారు. గతేడాది జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ పత్రాలను అందజేయడంతో పాటు, నూతన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కేవలం 4 నెలల్లోనే 140 శాతం పెరిగి, 3 రోజుల్లో 18 శాతం లాభంతో సరికొత్త రికార్డు సృష్టించిన స్మాల్‌క్యాప్ ఏరోస్పేస్ స్టాక్ ఏక్వస్ (Aequs) గురించిన పూర్తి వివరాలు, భవిష్యత్ టార్గెట్ ధరలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పాత ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాలన్నీ ఇక్కడికే మారాయి. ప్రయాణ సమయం, దూరం, టెర్మినల్ అప్‌డేట్స్ మరియు విమానయాన సంస్థలు జారీ చేసిన కీలక జాగ్రత్తల పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
స్విగ్గీ మరియు ఎటర్నల్ షేర్లు 7 శాతం వరకు భారీగా పెరిగాయి. విదేశీ పెట్టుబడుల వాటా 50 శాతం కంటే తగ్గడం మరియు క్విక్ కామర్స్ మార్జిన్ల బూస్ట్ అవకాశాలపై బ్రోకరేజ్ సంస్థల లేటెస్ట్ రేటింగ్స్, టార్గెట్ ధరల పూర్తి వివరాలు మీకోసం.
భారతదేశంలోని మహిళా సంక్షేమ పథకాలతో లబ్ధిదారుల బ్యాంకు బ్యాలెన్స్ 84% పెరిగింది. మహారాష్ట్ర లాడ్కీ బహిన్ , ఒడిశా సుభద్ర యోజన పథకాల వల్ల నెలవారీ ఖర్చులు, యూపీఐ డిజిటల్ లావాదేవీలు మరియు కుటుంబ ఆర్థిక స్థిరత్వం ఎలా పెరిగాయో EAC PM తాజా నివేదిక ఆధారంగా తెలుసుకోండి.
భారత్ vs ఇంగ్లాండ్ 4వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. సంజు శాంసన్ రీఎంట్రీ ఇస్తుండగా, తిలక్ వర్మ మరియు వైభవ్ సూర్యవంశీ అవుట్ కానున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వాతావరణ అప్‌డేట్స్, ట్రాఫిక్ జామ్స్ మరియు వర్షపాతం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.