Publish Date:Jun 17, 2026
అమెరికాలో జరిగిన విషాద ఘటనలో ఇద్దరు ఇండియన్ విద్యార్థినులు బలయ్యారు. . కాలిఫోర్నియాలోని శాంటాక్రూజ్ కౌంటీ సముద్ర తీరంలో ఈ విషాదం చోటు చేసుకుంది. అగ్రరాజ్యంలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు వీకెండ్ ట్రిప్ కోసం బీచ్ కు వెళ్లి సముద్రంలో మునిగిపోయారు.
మృతులను కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ నగరానికి చెందిన 21 ఏళ్ల హర్షిత నాయర్ 20 ఏళ్ల మహియాల్ శ్రాన్ గా గుర్తించారు. వీరిద్దరూ ఫ్రీమాంట్‌లోని వాషింగ్టన్ హైస్కూల్‌లో 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాటి నుండి మంచి స్నేహితులు. ప్రస్తుతం హర్షిత నాయర్ ప్రతిష్టాత్మక యూసీ బెర్క్లీ యూనివర్సిటీలో లీగల్ స్టడీస్ చదువుతుండగా, మహియాల్ శ్రాన్ శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో పబ్లిక్ హెల్త్ విద్యార్థినిగా ఉన్నారు. సెలవు దినాన్ని ఆనందంగా గడపడానికి వెళ్లిన ఈ ఇద్దరు బీచ్ కు వెళ్లారు.
ఈ నెల 10న పాంథర్ బీచ్ లో కీ హోల్ అనే సహజ రాతి గుహ ద్వారం వద్ద వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రయాణ అలసట వల్ల చిన్న కునుకు తీశారు. అయితే.. ఆ సమయంలో, సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. రాకాసి అలలు, తీరంలో నిద్రిస్తున్న హర్షిత, మహియాల్‌లను క్షణాల్లో సముద్ర గర్భంలోకి లాగేశాయి. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న కాల్ ఫైర్, స్టేట్ పార్క్స్ మరియు స్థానిక అగ్నిమాపక విభాగానికి చెందిన రెస్క్యూ స్విమ్మర్లు అత్యంత వేగంగా రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.
రాతి కొండలు, ఉధృతమైన అలల మధ్య సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎంతో సవాలుతో కూడుకున్నది. రెస్క్యూ సిబ్బంది ఒక యువతిని హెలికాప్టర్ ద్వారా, మరొకరిని స్టోక్స్ బాస్కెట్ సాయంతో తీవ్ర శ్రమకోర్చి ఒడ్డుకు తీసుకువచ్చారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. అయితే, దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ హర్షిత నాయర్ ఈ నెల 11న మరణించగా, ప్రాణాలతో పోరాడిన మహియాల్ శ్రాన్ ఆదివారం (జూన్ 15) కన్నుమూసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/doze-on-the-beach-36-223203.html
మే 8న హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. మే 16వ తేదీన భగీరథ్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అంటే దాదాపు 45 రోజులకు పైగా అతడు చర్లపల్లి జైలులోనే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
తమ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నందుకు ప్రతీకారంగానే పాక్ సైనిక కేంద్రాలపై దాడులు చేస్తున్నామని బలూచ్ రెబల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సైన్యంపై మరిన్ని భారీ ఎత్తున దాడులు చేస్తామని స్పష్టం చేశాయి.
తంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఖాసిం సులేమానీ మతికి ప్రతీకారంగా ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఎత్తుగడలు వేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ నివేదికలు, రక్షణ రంగ తాజా విశ్లేషణల మేరకు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాల జాబితాలో భారత్ మూడవ స్థానానికి దూసుకెళ్లింది. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలవగా, అత్యాధునిక యుద్ధ పరిజ్ఞానం కలిగిన రష్యా రెండో స్థానంలో ఉంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఇప్పటివరకు మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చిన చైనాను అధిగమించి ఇండియా ఈ ఘనత సాధించింది.
స్టాక్ మార్కెట్లో సరైన ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేసి ₹2 లక్షలు ఎలా పోగొట్టుకున్నానో ఈ వెబ్ స్టోరీలో చూడండి. కొత్త ఇన్వెస్టర్లు ఫోమో FOMO, స్టాప్ లాస్ లేకపోవడం వంటి ఏ తప్పులు చేయకూడదో మరియు రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల FII 60 బిలియన్ డాలర్ల అమ్మకాల సునామీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. ముడి చమురు ధరల తగ్గుదలతో మారిన మార్కెట్ సమీకరణాలు మరియు దేశీయ ఇన్వెస్టర్ల రికార్డు కొనుగోళ్లపై పూర్తి విశ్లేషణ.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తొలిసారి అధికారికంగా కరూర్ జిల్లాలో పర్యటించనున్నారు. గతేడాది జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ పత్రాలను అందజేయడంతో పాటు, నూతన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కేవలం 4 నెలల్లోనే 140 శాతం పెరిగి, 3 రోజుల్లో 18 శాతం లాభంతో సరికొత్త రికార్డు సృష్టించిన స్మాల్‌క్యాప్ ఏరోస్పేస్ స్టాక్ ఏక్వస్ (Aequs) గురించిన పూర్తి వివరాలు, భవిష్యత్ టార్గెట్ ధరలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పాత ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాలన్నీ ఇక్కడికే మారాయి. ప్రయాణ సమయం, దూరం, టెర్మినల్ అప్‌డేట్స్ మరియు విమానయాన సంస్థలు జారీ చేసిన కీలక జాగ్రత్తల పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
స్విగ్గీ మరియు ఎటర్నల్ షేర్లు 7 శాతం వరకు భారీగా పెరిగాయి. విదేశీ పెట్టుబడుల వాటా 50 శాతం కంటే తగ్గడం మరియు క్విక్ కామర్స్ మార్జిన్ల బూస్ట్ అవకాశాలపై బ్రోకరేజ్ సంస్థల లేటెస్ట్ రేటింగ్స్, టార్గెట్ ధరల పూర్తి వివరాలు మీకోసం.
భారతదేశంలోని మహిళా సంక్షేమ పథకాలతో లబ్ధిదారుల బ్యాంకు బ్యాలెన్స్ 84% పెరిగింది. మహారాష్ట్ర లాడ్కీ బహిన్ , ఒడిశా సుభద్ర యోజన పథకాల వల్ల నెలవారీ ఖర్చులు, యూపీఐ డిజిటల్ లావాదేవీలు మరియు కుటుంబ ఆర్థిక స్థిరత్వం ఎలా పెరిగాయో EAC PM తాజా నివేదిక ఆధారంగా తెలుసుకోండి.
భారత్ vs ఇంగ్లాండ్ 4వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. సంజు శాంసన్ రీఎంట్రీ ఇస్తుండగా, తిలక్ వర్మ మరియు వైభవ్ సూర్యవంశీ అవుట్ కానున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వాతావరణ అప్‌డేట్స్, ట్రాఫిక్ జామ్స్ మరియు వర్షపాతం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.