Publish Date:May 18, 2017
కుల్ భూషణ్ జాదవ్ కేసులో నేడు అంతర్జాతీయ న్యాయ స్థానం తీర్పు ఇవ్వనుంది. గూఢాచార్యం ఆరోపణల కింద పాక్ కుల్ భూషణ్ జాదవ్ ను అరెస్ట్ చేసి అతనికి మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈనెల 8న పిటిషన్ దాఖలు చేయగా..15న ఒకరోజు విచారణ జరిగింది. ఎటువంటి ఆధారాలు చూపకుండా పాకిస్థాన్ శిక్ష విధించిందని భారత్ వాదనలు చేసింది. దీనికి గాను గూఢచారులకు అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవంటూ పాక్ ప్రతివాదన చేసింది. ద హేగ్‌లోని పీస్ ప్యాలెస్‌లో మధ్యాహ్నం 12 గంటలకు న్యాయస్థానం అధ్యక్షుడు రోన్నే అబ్రహాం తీర్పు చదువుతారని ఐసీజే వర్గాలు తెలిపాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kulbhushan-yadav-39-74837.html
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారి చేసింది. తెలంగాణ హైకోర్టు భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ సునీత సుప్రీం గడపతొక్కారు. భాస్కర్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత పిటిషన్ దాఖలు చేశారు.
మహిళలపై పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఉద్యమించాలని విజయవాడ అబెస్ట్రికల్, గైనకాలజీ సొసైటీ(వోగ్స్ ) నిర్ణయించింది. నవంబర్ 25 నాడు మహిళలపై జరుగుతున్నహింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి(ఐరాస) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఐరాస పిలుపు మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నవంబర్ 25 మహిళల హింస నిర్మూలనాదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ వెంకట దత్త సాయితో పివీ సింధు పెళ్లి నిశ్చయమైంది.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం మహరాష్ట్రకు చేరుకున్నారు. సాయంత్రం ముంబైలో మహరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు
ములుగు జిల్లా వాజేడు ఎస్ ఐ హరీష్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సూర్యపేటకు చెందిన యువతి ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైంది
తీగ లాగితే డింక కదిలింది. అరకుకు చెందిన బాలుడి కిడ్నాప్ వెనక గంజాయి ముఠా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
మాజీ మంత్రి హరీష్ రావు కు ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో తెలంగాణ హైకోర్టు అతన్ని అరెస్ట్ చేయకూడదని పోలీసులను ఆదేశించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం బంజారాహిల్స్ పీఎస్‌లో ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్రపై కౌశిక్ రెడ్డి దురుసుగా వ్యవహరించాడు.
రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఏపీ సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్ ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా గుంటూరు జీజీహెచ్ వైద్యులను విచారించారు.
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాలలో పలు అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఈ నెల 9న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
సినీమా పిచ్చి ఓ మహిళ ఉసురు తీసింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా కోసం దిల్ షుక్ నగర్ నుంచి తన పిల్లలతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తున్నథియేటర్ కు వచ్చిన రేవతి అనే మహిళ అక్కడ జరిగిన తొక్కిసలాటలో మరణించింది.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొండితనానికీ, తనమాటే నెగ్గాలన్న మంకుపట్టుకు బ్రాండ్ అంబాసిడర్. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటారు.. కాదుకాదు.. కుందేలుకు నాలుగు కాళ్లు అని ఆయనకు వివరంగా చెప్పేందుకు ఎవరు ప్రయత్నించినా వారి అంతుచూసే వరకు వదిలిపెట్టరు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (డిసెంబర్ 5) శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.