Publish Date:Sep 20, 2024
ముంబయి నటి కాదంబరీ జత్వానీని వేధించిన కేసులో పోలీసులు తొలి అరెస్టు చేశారు. ఈ కేసులో కీలకమైన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌ను ఏపీ పోలీసులు ఈ రోజు (శుక్రవారం) డెహ్రాడూన్‌లో అరెస్టు చేశారు. ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. నటి జత్వానీని వేధించిన కేసులో సస్పెండైన కాంతి రాణా యాంటిసిపేటరీ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇదే కేసులో సస్పెండైన మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని అప్రూవర్‌గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు.
తనకు సన్నిహితుడు, ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌కి లబ్ధి చేకూర్చడం కోసం వైసీపీ నాయకులు జత్వానీని టార్గెట్ చేశారు. దానికోసం గతంలో జెత్వానీతో పరిచయం వున్న వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ చేత ఆమె మీద కేసు పెట్టించారు. ఆ కేసును ఆధారంగా చేసుకుని కాదంబరి జెత్వానీని అరెస్టు చేశారు. ఆమె తల్లిదండ్రులతో సహా జెత్వానీని రిమాండ్‌కి పంపించారు. ఈ అక్రమ వ్యవహారానికి ఆద్యుడైన కుక్కల విద్యాసాగర్‌ని పోలీసులు అరెస్టు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kukkala-vidyasagar-arrested-25-185225.html
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.