సుప్రీం లో కేటీఆర్ కు చుక్కెదురు.. క్వాష్ పిటిషన్ ఉపసంహరణ

Publish Date:Jan 15, 2025

Advertisement

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు సుప్రీంలోనూ చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో  ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్  బుధవారం (జనవరి 15) విచారణకు వచ్చింది.  

ఈ సందర్భంగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులలో జోక్యం చేసుకోబోని సుప్రీం కోర్టు విస్పష్టంగా పేర్కొంది. దీంతో సుప్రీం కోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన ను డిస్మిస్ చేసే పరిస్థితి ఉండటంతో కేటీఆర్ తరఫు న్యాయవాది పిటిషన్ విత్ డ్రా చేసుకుంటామని పేర్కొన్నారు. దీంతో సుప్రీం కోర్టు అందుకు అంగీకరించింది. పేర్కొంది.  

ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కూడా కేటీఆర్ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో తమ వాదన కూడా వినాలని కోరుతూ సుప్రీంలో కేవియెట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ సుప్రీం కోర్టులో తన క్వాష్ పిటిషన్ విత్ డ్రా చేసుకోవడంతో మళ్లీ ఆయన అరెస్టుపై చర్చ మొదలైంది. 

By
en-us Political News

  
తన అత్తింటి వాళ్ల వేధింపులు తట్టుకోలేక హైద్రాబాద్ కర్మన్ ఘాట్  చంపాపేట కు చెందిన గైనకాలజిస్ట్  డాక్టర్ ప్రణీత ఆత్మహత్యాయత్నం చేసింది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి తల్లికి పంపించింది.
విశాఖలో  సహజ సిద్దమైన ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలను నిలుపదల చేస్తూ ఎపి హైకోర్టు విధించిన గడువు మరో నాలుగు వారాలు పొడిగించింది. బుధవారం ఈ కేసు విచారణ జరిగింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు చూస్తుంటే అమెరికా అగ్రరాజ్య హోదాకు ఆశలు వదిలేసుకోకతప్పదా అనిపిస్తున్నది. ఆయన వలసదారుల కబంధ హస్తాల నుంచి అమెరికాను విముక్తి చేస్తానంటూ ఎడాపెడా జారీ చేస్తున్న ఉత్తర్వులు, ఎగ్జిక్యుటివ్ ఆర్డర్లు ప్రపంచ దేశాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో  ఎంఎల్ సి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్   విడుదల చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదే నెల 27న పోలింగ్ జరగనుంది.
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం బుధవారం (జనవరి 29) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల అంటే ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదలౌతుంది.
రేష‌న్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్నినాని అడ్డంగా దొరికిపోయినట్లే కనిపిస్తోంది. భారీ మొత్తంలో బియ్యం మాయం వెనుక పేర్ని నాని హ‌స్తం ఉన్న‌ట్లు పోలీసులు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. ఇదే విషయాన్ని పేర్నినాని కేసువిచారణ సందర్బంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు.
 గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటి వరకు  సినీతారలు, రాజకీయ నాయకులు, స్వంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసిన బిఆర్ ఎస్ ఒక అడుగు ముందుకేసి ఇద్దరు న్యాయమూర్తుల  ఫోన్ లను ట్యాపింగ్  చేసినట్లు తెలుస్తోంది
దివంగ‌త ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు దిగ్విజ‌యంగా ముందుకు న‌డిపించుకుంటూ వ‌చ్చారు. అధికారం కోల్పోయిన ప్ర‌తిసారి పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ఉత్తేజాన్నినింపుతూ.. ప‌డిలేచిన కెర‌టంలా రెట్టించిన ఉత్సాహంతో అధికారంలోకి వ‌స్తూ టీడీపీని బ‌ల‌మైన పార్టీగా నిలుపుతూ వ‌చ్చారు.
బీజేపీ హైకమాండ్ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో ఎన్డీయే కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తిరుమల తిరుపతి దేవస్థానం సోషల్ మీడియాలో తిరుమలపై తప్పుడు ప్రచారం చేసే వారిని ఉపేక్షించకూడదని నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలు మార్లు హెచ్చరించిన టీటీడీ ఇప్పుడు ఇక యాక్షన్ లోకి దిగింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను చావో రేవోగా తీసుకున్న భీజేపీ, ఆప్ ల మధ్య ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ మాటల యుద్ధం మంటలు రేపుతోంది. బీజేపీ టార్గెట్ చేస్తూ ఆప్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యపై హర్యానా బీజేపీ నేతల అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాల కోసం వచ్చి భక్తులు మృత్యువాత పడటం దురదృష్టకరమన్నారు. త్రివేణి సంగమం వైపు వెళ్ల వద్దని ఆయన భక్తులకు విజ్ణప్తి చేశారు. భక్తులు పుణ్యస్నానం కోసం గంగాఘట్ వద్దకు రావాలని పిలుపు నిచ్చారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (జనవరి 29) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా అనుమతిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.