బీఆర్ఎస్@ 25 ఇయర్స్.. తెలంగాణ భవన్ లో పార్టీ జెండా ఆవిష్కరించిన కేటీఆర్

Publish Date:Apr 27, 2026

Advertisement

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేశారు. కాగా.. తెలంగాణ భవన్‌లో పార్టీ  ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ  నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు  పోరాటం చేసి  కేసీఆర్  తెలంగాణ సాధించారన్నారు.

 ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్ అన్న ఆయన.. గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో   దుర్మార్గ, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. భారతదేశ చరిత్రలోనే పాతిక వసంతాల ప్రస్థానం పూర్తి చేసుకున్న పార్టీలు కొన్ని మాత్రమే ఉన్నాయనీ, వాటిలో ఒకటి బీఆర్ఎస్ అన్నారు. 

పోరాడి సాధించుకున్న తెలంగాణను  కాపాడుకునేందుకు బీఆర్ఎస్  పునరంకితం అవుతుందనీ, అరాచక కాంగ్రెస్ , బీజేపీ పాలన నుండి తెలంగాణను మళ్లీ పట్టాలు ఎక్కించడం కోసం పోరాడుదామనీ పిలుపునిచ్చారు.  కేసీఆర్ సైనికులుగా బలగంగా కలిసికట్టుగా కదం తొక్కుతాదామన్నారు.  తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తారని, నేతలకు దిశనిర్దేశం చేస్తారని కేటీఆర్ తెలిపారు. కవిత పార్టీ, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు మాత్రం కేటీఆర్ ఇష్టపడలేదు. 

By
en-us Political News

  
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.