Publish Date:Aug 27, 2024
తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రజలకు మేలు కన్నా కీడు ఎక్కువగా చేసింది. ఫలితంగా వోటర్లు ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా తీర్పు ఇచ్చారు. అహంకారమే ఆభరణంగా భావించే మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రస్తుతం ట్వీట్ లకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు, కనెక్టింగ్ రోడ్లపై ట్వీట్ చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(ఎస్ఆర్‌డీపీ) పనులు నెమ్మదించాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఎస్ఆర్‌డీపీ ద్వారా చొరవ తీసుకున్నామన్నారు. దీని కింద అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 42 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిందని గుర్తు చేశారు. అందులో 36 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిని 2024లో పూర్తి చేయాల్సి ఉండేనని తెలిపారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎస్ఆర్‌డీపీ పనులు పూర్తిగా నెమ్మదించాయన్నారు. గడిచిన 8 నెలలుగా సర్కార్ తరుఫున సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు జరగడం లేదని మండిపడ్డారు. ఎస్ఆర్‌డీపీ ఫేజ్-3 పనులను తిరిగి ప్రారంభించాలని కేటీఆర్ కోరారు. ఈ ఫేజ్-3 పనుల్లో మూసీ వెంబడి ఎక్స్‌ప్రెస్‌వే, కేబీఆర్ పార్క్ కింద టన్నెల్స్ నిర్మాణం, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఇతర అనేక గ్రేడ్‌సెపరేటర్లు ఉన్నాయన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-tweet-on-hyderabad-flyovers-39-183669.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.