ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయి ఎనిమిదేళ్లు గడిచిపోయింది. ఎనిమిదేళ్లుగా తెలంగాణలో ఒక్కటే పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే.. ఏపీలో మాత్రం తొలి ఐదేళ్లు చంద్రబాబు పాలిస్తే.. ఇప్పుడు మూడేళ్లుగా జగన్ ప్రభుత్వం నడుస్తుంది. విడిపోయిన రెండు రాష్ట్రాల ఆలనా పాలనలో పక్క రాష్ట్రాల నేతల ప్రభావం అంతగా లేనప్పటికీ ఉమ్మడి రాష్ట్రం నాటి భావోద్వేగాలు, సెంటిమెంట్లు ఇప్పటికీ అలాగే విలసిల్లడానికి రాజకీయం తన వంతు దోహదం చేస్తూనే ఉంది. మామూలు సమయాలలో వీటి తీవ్రత ఉనికి పెద్దగా కనిపించకపోయినా.. ఎన్నికలొస్తున్నాయంటే మాత్రం సెంటిమెంట్ మంత్రమే రాజకీయ పార్టీలకు, నాయకులకు గెలుపు మంత్రంగా ఉపయోగపడుతుంటుంది. ముఖ్యంగా ఈ సెంటిమెంట్ ను అనుకూలంగా వినియోగించుకోవడంలో తెలంగాణ మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఒక ఆకు ఎక్కువే చదివింది. తెలంగాణలో ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువే ఉన్నారు.. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడే స్థిరపడిన ఆంధ్రా ప్రజలు ఇప్పటి తెలంగాణలో కూడా చెప్పుదగ్గ స్థాయిలో ఇక్కడి రాజకీయాలను మలుపు తిప్పగలరు. దాదాపు పాతిక నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలరని కూడా ఇక్కడి రాజకీయాలలో ఓ లెక్క ఉంది.
అందుకే తెలంగాణలో అధికారం దక్కాలంటే ఇక్కడ స్థిర పడిన వారి మద్దతు కోసం రాజకీయ పార్టీలు ఓ కన్నేసి ఉంచుతాయి. ఇలా స్థిరపడిన ఆంధ్రుల ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మలచుకోవాలంటే ఏపీలో పరిస్థితులను తెలంగాణ నాయకులు అర్ధం చేసుకోవాలి.. ఆ భావోద్వేగాలకు తగ్గట్లే నడుచుకోవాలి. టీఆర్ఎస్ పార్టీకి ఈ మనోభావాలను అర్ధం చేసుకోవడం.. భావోద్వేగాలను అనుకూలంగా మార్చుకోవడం వెన్నతో పెట్టిన విద్య.. గత ఎన్నికల సమయంలో కూడా ఏపీలో పరిస్థితులకు తగ్గట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి ఆంధ్రుల మద్దతు పొందడం కోసమే.. నాడు ఏపీలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నచంద్రబాబుపై విమర్శలు చేశారు. అవినీతి, రెండు కళ్ల సిద్ధాంతంలో ఏపీ ప్రయోజనాలను దెబ్బతీశారంటూ, సెంటిమెంటును రెచ్చగొట్టడం ద్వారా ఇక్కడి ఆంధ్రుల మద్దతు పొందే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరో సారి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో కేటీఆర్ ఇక్కడ స్థిర పడిన ఆంధ్రుల్లో జగన్ పాలన పట్ల ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికే.. ఏపీలో రోడ్లు, విద్యుత్ పరిస్థితి అధ్వానంగా ఉంటే తెలంగాణలో అద్భుతంగా ఉన్నాయని అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై అక్కడా, ఇక్కడా కూడా హర్షామోదాలే వ్యక్తం అవ్వడమే ఇందుకు నిదర్శనం. ఏపీలో వైసీపీ తప్ప మరే పార్టీ వారు కానీ, జన సామాన్యం కానీ ఖండించలేదు సరికదా సమర్ధించారు. ఇక్కడ స్థిరపడిన ఆంధ్రులకు కూడా జగన్ నిర్వాకం వల్లే అక్కడి పరిస్థితులు అలా ఉన్నాయని కేటీఆర్ ను సమర్దించారే తప్ప ఏపీపై వ్యాఖ్యలేమిటని విమర్శలు చేయలేదు. గత ఎన్నికల్లో ఎలాగైతే ఏపీలో చంద్రబాబుపై వ్యతిరేకతను తెరాస ఇక్కడ ఓట్లుగా మార్చుకుందో.. అదే విధంగా ఈ సారి జగన్ పై అక్కడి వ్యతిరేకతను క్యాష్ చేసుకునే వ్యూహంతోనే కేటీఆర్ తెలంగాణతో ఏపీలో పరిస్థితులను పోలుస్తూ అభివృద్ధి చిరునామాగా తెలంగాణను తీర్చిదిద్దామని చెప్పుకున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు అక్కడా, ఇక్కడా అంటే ఏపీలోనూ, తెలంగాణలోనూ కూడా మద్దతు లభించిందంటే ఆయన వ్యూహం ఫలించినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-target-ap-setelers-votes-in-telangana-by-commenting-on-roads-and-power-in-jagan-rule-25-135512.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.