జగనన్నతో మాట్లాడి సెట్ చేస్తా.. ఏపీ అంటే కేటీఆర్ కు ఇంత చులకనా?

Publish Date:Oct 7, 2023

Advertisement

అదేంటో పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే అందరికీ చులకన అయిపొయింది. ఇప్పటికే ఏపీలో పరిస్థితులపై పలుమార్లు ఎగతాళిగా మాట్లాడిన తెలంగాణ నేతలు మరోసారి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. గతంలో ఏపీలో రోడ్లు, మౌలిక వసతులపై అయ్యో పాపం అన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇప్పుడు.. కాస్త ఏపీలో కూడా కంపెనీలు పెట్టె ఆలోచన చేయండి.. కావాలంటే ఏపీ సీఎం జగనన్నతో తానే స్వయంగా మాట్లాడి సెట్ చేస్తానని కేటీఆర్ ఐటీ కంపెనీల యాజమాన్యాన్ని కోరారు.  హనుమకొండలోని మండికొండలో ఐటీ పార్క్‌ ప్రారంభించిన కేటీఆర్ ఇక్కడ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌కు, వరంగల్‌కు పెద్ద తేడా ఉండదన్న మంత్రి కేటీఆర్‌. ఐటీ రంగంలో భవిష్యత్తు టైర్‌ 2 నగరాలదే అని చెప్పారు. అలాగే ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని కేటీఆర్ ఎన్నారైలను కోరారు. కావాలంటే జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలు, ఏపీ పరిస్థితులు, ఏపీ మంత్రుల పనితీరుపై మరోసారి రాష్ట్రంలో చర్చకు దారి తీస్తుంది.

వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎలాంటి సంస్థలు ముందుకు రావడం లేదు. వైసీపీ నేతలు ఎంత బుకాయించినా ఈ మాట మాత్రం వాస్తవం. కొత్త సంస్థలు రావడం దేవుడెరుగు నానా కారణాలతో పాత కంపెనీలను కూడా వెళ్లగొట్టేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి అమరావతి అనుకున్న రీతిలో పూర్తి అయి ఉంటే పలు రకాల నాన్ ఐటీ సంస్థలతో పాటు ప్రముఖ ఐటీ కంపెనీలు పదుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు క్యూ కట్టేవి. అధికారం చంద్రబాబు చేతిలో ఉంటే కాళ్ళకు బలపాలు కట్టుకొని అయినా కంపెనీలను పట్టుకొచ్చేవారు. కానీ, నాలుగేళ్ల జగన్ పాలనలో ఏపీ వైపు చూసే వారే లేకుండా పోయారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అభివృద్ధితో పాటు ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది. హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలను కూడా అభివృద్ధి చేసుకుంటూ ఐటీని విస్తరిస్తున్నారు. ఎన్నారైలను, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది.

ఏపీ విషయానికి వస్తే తెలంగాణకు పూర్తి విరుద్ధం. ఇక్కడ అసలు ఏ శాఖకి మంత్రి ఎవరో కూడా ప్రజలకు తెలియదు. అందునా పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ఏం చేస్తారో, అసలు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. అలాంటిది ఆయన పరిశ్రమలను ఆకర్షించేందుకు ఏం చేస్తారన్నది ఊహించడం కూడా కష్టమే. సీఎం జగన్ కూడా ఏపీలో ఉద్యోగ, ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చిందే లేదు. కనీసం కంపెనీల రాకకోసం కానీ.. పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు కానీ ఎలాంటి ప్రణాళికలు లేవు. ఈ క్రమంలోనే అసలు ఏపీ అనే ఒక రాష్ట్రం ఉందని వ్యాపార వర్గాలలో అందరూ మర్చిపోయారు. ఇటువంటి నేపథ్యంలోనే, ఏపీ రాష్ట్రంపై, సీఎం జగన్ పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కనుక తెలంగాణ పార్టీలకు సీమాంధ్ర సెటిలర్ల ఓట్లు కూడా కీలకమే. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ కొద్దిరోజులుగా సీమాంధ్ర ఓటర్లకు రకరకాలుగా గాలమేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఏపీలో కుంటుపడిన అభివృద్ధి దృష్టిలో అయ్యో పాపం అనే భావనలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. ఆంధ్రా కూడా అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతం అనేలా బీఆర్ఎస్ వైఖరి ఉందనేలా కేటీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. కేటీఆర్ ఏ కోణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఇది జగన్ ప్రభుత్వానికి మాత్రం కొరకురానిదే. పక్క రాష్ట్ర మంత్రి అయ్యో పాపం అంటూ ఏపీపై జాలి చూపించడం.. కంపెనీలు ఏర్పాటు చేయండి కావాలంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తాను మాట్లాడతానని చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఎంతటి అసమర్ధ పాలన కొనసాగుతుందో తేటతెల్లం చేస్తుంది.

By
en-us Political News

  
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.