బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం (జనవరి 6) ఏసీబీ విచారణకు తన న్యాయవాదులతో హాజరయ్యారు. ఏసీబీ కార్యాలయం వరకూ వచ్చిన ఆయన అక్కడ మాత్రం హైడ్రామా ఆడారు. ఏసీబీ కార్యాలయంలోకి ఒంటరిగా హాజరయ్యే ప్రశ్నే లేదనీ, తన న్యాయవాదులను కూడా అనుమతించాలని పట్టుబట్టారు. అందుకు సహజంగానే ఏసీబీ అధికారులు నిరాకరించారు. దీంతో ఆయన దాదాపు గంటకు పైగా ఏసీబీ కార్యాలయం వద్దనే ఉండి.. పోలీసులో వాగ్వాదానికి దగి ఆ తరువాత తాపీగా వెనుదిరిగి వెళ్లిపోయారు.
దీంతో ఆయన ఏసీబీ విచారణకు హాజరౌనట్లూ అయ్యింది. ఏసీబీ తీరుతో ఆయన వెనుదిరిగారన్న ప్రచారానికీ ఆస్కారం లభించింది. కేసీఆర్ ఇదంతా వ్యూహాత్మకంగానే చేశారని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి న్యాయవాదులు లేకపోయినా ఆయన విచారణకు హాజరైతే వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఏసీబీ అరెస్టు చేయకుండా ఆయనకు కోర్టు నుంచి రక్షణ ఉంది. ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడేంత వరకూ అరెస్టు చేయవద్దంటూ ఏసీబీకి తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఏసీబీ విచారణకు వెళ్లినా ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అయితే ఆయన మంగళవారం (జనవరి 7) ఈడీ విచారణకు సైతం హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయనకు ఈడీ అరెస్టు నుంచి ఎలాంటి మినహాయింపూ లేదు. దీంతో ఆ విచారణకు డుమ్మా కొట్టాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. ఏసీబీ విచారణకు హాజరై, ఈడీ విచారణకు గైర్హాజరైతే విమర్శలు ఎదుర్కొన వలసి వస్తుందన్న భావనలో ఉన్న ఆయన ఏసీబీ విచారణకు హాజరైనట్లే హాజరై ఏసీబీ అధికారులతో వాగ్వివాదానికి దిగి వెనుదిరిగి వచ్చేశారు. ఇదే సాకుతో ఆయన ఈడీ విచారణకు డుమ్మా కొట్టేస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇంతకీ ఏసీబీ కార్యాలయం వరకూ వెళ్లి కేటీఆర్ వెనుదిరిగి వచ్చేయడానికి కారణమేంటంటే.. ఆయనకు ఆ విచారణ మీద నమ్మకం లేదట. న్యాయవాదుల సమక్షంలోనే తనను విచారించాలనీ, లేకుంటే తాను చెప్పని మాటలు చెప్పినట్లుగా వారు రాసుకుంటారనీ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి విషయంలో పోలీసులు అదే చేశారనీ కేటీఆర్ అంటున్నారు. లగచర్ల ఘటనలో పోలీసులు పట్నం మహేందర్ రెడ్డిని అరెస్టు పట్నం మహేందర్ రెడ్డి చెప్పని విషయాలతో ఆయన కన్ఫెక్షన్ నివేదిక తయారు చేసి కోర్టుకు సమర్పించారని ఆరోపించారు. ఆ తరువాత పట్నం తానసలు కన్ఫెక్షన్ స్టేట్ మెంటే ఇవ్వలేదని చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు.
ఇప్పుడు తన విషయంలో కూడా అదే జరుగుతుందని అనుమానం ఉందనీ, అందుకే తనతో పాటు తన న్యాయవాదులను కూడా అనుమతించాలని పట్టుబట్టి కేటీఆర్ విచారణకు హాజరు కాకుండా వెనక్కు వెళ్లిపోయారు. అంతే కాకుండా తాను ఇలా విచారణకు హాజరు కాగానే..అలా ఏసీబీ తన నివాసంపై దాడులకు పాల్పడుతుందన్న సమాచారం కూడా తనకు అందిందని ఆరోపించారు. మొత్తం మీద కేటీఆర్ వ్యూహాత్మకంగా ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా క్రియేట్ చేసి విచారణను తప్పించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏసీబీ అధికారులు కేటీఆర్ కు మాత్రమే నోటీసులు ఇచ్చారు. దీంతో తన న్యాయవాదులను అనుమతించరన్న విషయం కేటీఆర్ కు స్పష్టంగా తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా కేటీఆర్ తన న్యాయవాదులను తీసుకువచ్చి వివాదాన్ని క్రియేట్ చేసి విచారణకు హాజరు కాకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇదే సాకుతో మంగళవారం (జనవరి 7) ఈడీ విచారణకూ గైర్హాజరౌతారు. మొత్తం మీద విచారణను ఎదుర్కోకుండా తప్పించుకోవడానికి కేటీఆర్ వేసిన ఎత్తుగడ ఫలించింది.
ఇలా ఉండగా కేటీఆర్ విచారణను తప్పించుకోవడానికే లాయర్లను అనుమతించాలంటూ పట్టుబట్టారనీ, అయితే కేసీఆర్ కు ఫార్ములా ఈ కార్ కేసులో విచారించేందుకు తమకు తెలంగాణ హైకోర్టు అనుమతించిందనీ, ఆ సందర్బంగా న్యాయవాదుల సమక్షంలో విచారించాలన్న కండీషన్ ఏదీ పెట్టలేదనీ ఏసీబీ చెబుతోంది. కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే రచ్చ చెశారని ఆరోపిస్తోంది. త్వరలోనే మరోసారి నోటీసులు ఇచ్చి కేటీఆర్ ను విచారణకు పిలుస్తామని ఏసీబీ స్పష్టం చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-hidrama-at-acb-office-strategic-25-190879.html
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?