ఏసీబీ విచారణకు కేటీఆర్.. హాజరు.. గైర్హాజరు.. అంతా వ్యూహాత్మకమేనా

Publish Date:Jan 6, 2025

Advertisement

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం (జనవరి 6) ఏసీబీ విచారణకు తన న్యాయవాదులతో హాజరయ్యారు. ఏసీబీ కార్యాలయం వరకూ వచ్చిన ఆయన అక్కడ మాత్రం హైడ్రామా ఆడారు. ఏసీబీ కార్యాలయంలోకి ఒంటరిగా హాజరయ్యే ప్రశ్నే లేదనీ, తన న్యాయవాదులను కూడా అనుమతించాలని పట్టుబట్టారు. అందుకు సహజంగానే ఏసీబీ అధికారులు నిరాకరించారు. దీంతో ఆయన దాదాపు గంటకు పైగా ఏసీబీ కార్యాలయం వద్దనే ఉండి.. పోలీసులో వాగ్వాదానికి దగి ఆ తరువాత తాపీగా వెనుదిరిగి వెళ్లిపోయారు.

దీంతో ఆయన ఏసీబీ విచారణకు హాజరౌనట్లూ అయ్యింది. ఏసీబీ తీరుతో ఆయన వెనుదిరిగారన్న ప్రచారానికీ ఆస్కారం లభించింది. కేసీఆర్ ఇదంతా వ్యూహాత్మకంగానే చేశారని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి న్యాయవాదులు లేకపోయినా ఆయన విచారణకు హాజరైతే వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఏసీబీ అరెస్టు చేయకుండా ఆయనకు కోర్టు నుంచి రక్షణ ఉంది. ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడేంత వరకూ అరెస్టు చేయవద్దంటూ ఏసీబీకి తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఏసీబీ విచారణకు వెళ్లినా ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అయితే ఆయన మంగళవారం (జనవరి 7) ఈడీ విచారణకు సైతం హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయనకు ఈడీ అరెస్టు నుంచి ఎలాంటి మినహాయింపూ లేదు. దీంతో ఆ విచారణకు డుమ్మా కొట్టాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. ఏసీబీ విచారణకు హాజరై, ఈడీ విచారణకు గైర్హాజరైతే విమర్శలు ఎదుర్కొన వలసి వస్తుందన్న భావనలో ఉన్న ఆయన ఏసీబీ విచారణకు హాజరైనట్లే హాజరై ఏసీబీ అధికారులతో వాగ్వివాదానికి దిగి వెనుదిరిగి వచ్చేశారు. ఇదే సాకుతో ఆయన ఈడీ విచారణకు డుమ్మా కొట్టేస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇంతకీ ఏసీబీ కార్యాలయం వరకూ వెళ్లి కేటీఆర్ వెనుదిరిగి వచ్చేయడానికి కారణమేంటంటే.. ఆయనకు ఆ విచారణ మీద నమ్మకం లేదట. న్యాయవాదుల సమక్షంలోనే తనను విచారించాలనీ, లేకుంటే తాను చెప్పని మాటలు చెప్పినట్లుగా వారు రాసుకుంటారనీ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి విషయంలో పోలీసులు అదే చేశారనీ కేటీఆర్ అంటున్నారు. లగచర్ల ఘటనలో పోలీసులు పట్నం మహేందర్ రెడ్డిని అరెస్టు పట్నం మహేందర్ రెడ్డి చెప్పని విషయాలతో ఆయన కన్ఫెక్షన్ నివేదిక తయారు చేసి కోర్టుకు సమర్పించారని ఆరోపించారు.  ఆ తరువాత పట్నం తానసలు కన్ఫెక్షన్ స్టేట్ మెంటే ఇవ్వలేదని చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు.

ఇప్పుడు తన విషయంలో కూడా అదే జరుగుతుందని అనుమానం ఉందనీ, అందుకే తనతో పాటు తన న్యాయవాదులను కూడా అనుమతించాలని పట్టుబట్టి కేటీఆర్ విచారణకు హాజరు కాకుండా వెనక్కు వెళ్లిపోయారు. అంతే కాకుండా తాను ఇలా విచారణకు హాజరు కాగానే..అలా ఏసీబీ తన నివాసంపై దాడులకు పాల్పడుతుందన్న సమాచారం కూడా తనకు అందిందని ఆరోపించారు. మొత్తం మీద కేసీఆర్ వ్యూహాత్మకంగా ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా క్రియేట్ చేసి విచారణను తప్పించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏసీబీ అధికారులు కేటీఆర్ కు మాత్రమే నోటీసులు ఇచ్చారు. దీంతో తన న్యాయవాదులను అనుమతించరన్న విషయం కేటీఆర్ కు స్పష్టంగా తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా కేటీఆర్ తన న్యాయవాదులను తీసుకువచ్చి వివాదాన్ని క్రియేట్ చేసి విచారణకు హాజరు కాకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇదే సాకుతో మంగళవారం (జనవరి 7) ఈడీ విచారణకూ గైర్హాజరౌతారు. మొత్తం మీద విచారణను ఎదుర్కోకుండా తప్పించుకోవడానికి కేటీఆర్ వేసిన ఎత్తుగడ ఫలించింది.

ఇలా ఉండగా కేటీఆర్ విచారణను తప్పించుకోవడానికే లాయర్లను అనుమతించాలంటూ పట్టుబట్టారనీ, అయితే కేటీఆర్ కు ఫార్ములా ఈ కార్ కేసులో విచారించేందుకు తమకు తెలంగాణ హైకోర్టు అనుమతించిందనీ, ఆ సందర్బంగా న్యాయవాదుల సమక్షంలో విచారించాలన్న కండీషన్ ఏదీ పెట్టలేదనీ ఏసీబీ చెబుతోంది. కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే రచ్చ చెశారని ఆరోపిస్తోంది. త్వరలోనే మరోసారి నోటీసులు ఇచ్చి కేటీఆర్ ను విచారణకు పిలుస్తామని ఏసీబీ స్పష్టం చేసింది. 

By
en-us Political News

  
విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.
వైసీపీ హయాంలో కోడిగుడ్డు మంత్రిగా వెరీగుడ్డు నేమ్ సంపాదించుకున్నగుడివాడ అమర్నాథ్ అప్పట్లో చెప్పిన గుడ్డు కథనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జగన్ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా వెలగబెట్టిన గుడివాడ అమర్నాథ్.
 తెలంగాణలో బిజెపి కార్యాలయంపై కాంగ్రేస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ మంగళవారం బిజెపి శ్రేణులు గాంధీభవన్ వైపు దూసుకొచ్చాయి. ఈ శ్రేణులను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీ చార్జి చేశారు
మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో బెయిలు కోసం నందిగం సురేష్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు మంగళవారం (జనవరి 7) కొట్టివేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ గడువు  ఈ నెల 23తో ముగియనుంది. మొత్తం 70  మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీ వరుసగా రెండు పర్యాయాలు ఆప్ అధికారంలో వచ్చింది.
ఒక వైపు ఏసీబీ, మరో వైపు ఈడీ, ఇంకో వైపు తెలంగాణ సర్కార్ ఇలా కేటీఆర్ పై ముప్పేట దాడి చేస్తూ ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కనీసం అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆయన విజ్ణప్తినీ తిరస్కరించింది.
ప్రధాని నరేంద్రమోడీ రేపు అంటే బుధవారం విశాఖపట్నం రానున్నారు.  పూడి మడకవద్ద ఎన్ టిపిసి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్  హైడ్రోజన్ హబ్ కు ఎనిమిదో తేదీ సాయంత్రం శంకు  స్థాపన చేయనున్నట్టు ప్రధాని కార్యాలయం ప్రకటనలో తెలిపింది
బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ గురువారం అంటే జనవరి 9న అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫార్మూలా ఈ కార్ కేసులో ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడమే కాకుండా, అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడం కూడా కుదరదని స్పష్టం చేయడంతో ఆయనకు ఉన్న అన్ని దారులూ మూసుకుపోయాయి.
ఫార్ములా ఈ రేస్ కేసులో  మాజీ  మంత్రి  కెటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో  నందినగర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి కెటీఆర్ అరెస్ట్ తప్పదంటూ ప్రచారం ఊపందుకుంది.
తిరుమలలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం సులభ తరం చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. ఈ నెల 10 నుంచి 19 వరకూ భక్తులకు వైకుంఠద్వార దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందు కోసం ఈ నెల 9 నుంచి తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయడానికి ఏర్పాట్లు చేసింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసులో నిండా మునిగారా అంటే న్యాయ నిపుణులు ఔననే అంటున్నారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను కోర్టు మంగళవారం (జవవరి 7) కొట్టి వేసింది.
ముంబై నటి జత్వానీపై వేధింపుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను విచారించిన కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
హ్యూమన్‌ మెటానిమో వైరస్‌.. హెచ్ఎంపీవీ వ్యాప్తి వేగం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచాన్ని చుట్టేయడం ఖాయమన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మొన్నటి వరకూ ఎవరూ చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ ఉద్ధృతిపై వార్తలు వస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే సోమవారం (జనవరి 6) ఒక్క రోజే భారత్ లో ఆరు కేసులు వెలుగు చూడటంతో అందరిలో ఆందోళన మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.