రాహుల్ అడుగుజాడల్లో మంత్రి కేటీఆర్?

Publish Date:Oct 8, 2022

Advertisement

అడుసు తొక్కనేల,  కాలు కడగనేల అన్నది అందరికి తెలిసిన పాత సామెత.  అయితే, రాజకీయాల్లో ఉన్నవారు, ముఖ్యంగా, తెలంగాణ మంత్రి  కల్వకుట్ల తారక రామారావు (కేటీఆర్) వంటి యంగ్ పోలిటిషియన్స్ తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానంతో తమ అజ్ఞానాన్ని బయటపెట్టు కుంటారు. నిజానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను తరచు విమర్శించే రాహుల్ గాంధీ నుంచి ఈ విషయంలో కొత్తగా రాహుల్ గాంధీతో పోటీకి దిగుతున్నకేటీఆర్ వరకు చాలా మందికి, ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో తెలియక పోవచ్చును.

అందుకే ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ, బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ అనే భ్రమల్లో బీజేపీతో పాటుగా ఆరఎస్ఎస్ ను అదే గాటన కట్టి అసందర్భ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, మహత్మా గాంధీ హత్య ఆర్ఎస్ఎస్ చేసిందని చేసిన ఆరోపణలకు కోర్టు విచారణను ఎదుర్కున్నారు. చివరకు, ఎన్నికల ప్రచార వేడిలో చేసిన విమర్శగా పేర్కొంటూ కోర్టు క్షమాపణ కోరి బయట పడ్డారు. అయినా  ఆయన  దోరణి మారలేదనుకోండి అది వేరే విషయం. 

అయితే ఇప్పుడు కొత్తగా  రాహుల్ గాంధీకి దీటుగా జాతీయ నేతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న కేటేఆర్ ఆరఎస్ఎస్ విషయంలో రాహుల్ గాంధీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఆర్ఎస్ఎస్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. నిజానికి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే కాదు, సంఘ్ వ్యవస్థ, కార్య పద్దతులు, విధి విధానాలు, ఇంకా చాలా సంగతులు  బయటి వారికి అంత  సులభంగా అర్థం కావని అంటారు. అందుకే  ఏడుగురు గుడ్డివారు ఏనుగును చేతులతో తడిమి, వారు తాకిన ఏనుగు శరీర అవయావాల ఆధారంగా ఏనుగును, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వర్ణించిన విధంగా ఆర్ఎస్ఎస్ ను విమర్శించే వారి విమర్శలుంటాయని అంటారు.ఇప్పుడు కేటీఆర్  ఆర్ఎస్ఎ అధినేత మోహన్ భగవత్ గురించి చేసిన  వ్యాఖ్యలు, విమర్శలు కూడా అదే కోవకు చెందుతాయనిపిస్తోందని, ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్నవారు అంటున్నారు. 

అదలా ఉంటటే రాహుల్ గాంధీ చరిత్రను మాత్రమే విస్మరిస్తే, కేటీఆర్ నడుస్తున్న చరిత్రను కూడా విస్మరిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదు. కానీ జాతీయవాద రాజకీయాలను సమర్ధిస్తుంది. ప్రత్యక్ష రాజకీయ కార్యకలాపాలలో ఆర్ఎస్ఎస్ అధినేత కాదు సామాన్య  స్వయం సేవకులు (కార్యకర్తలు) కూడా పాల్గొనరు. ఇది  ఆర్ఎసఎస్ గురించి కనీస అవగాహన ఉన్న ఎవరికైనా తెలిసిన విషయమే. కానీ, మంత్రి కేటీఆర్ కు మాత్రం ఆ మాత్రం అవగాహన కూడా లేనట్లుంది లేదా జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధితో పోటీ పడాలంటే ఆర్ఎస్ఎస్ గురించి ఆ మాత్రంగా అయినా అసత్యాలు ప్రచారం చేయాలని అనుకున్నారో ఏమో కానీ, అందుకే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఎవరని ప్రశ్నించారు. ఆయన, కౌన్సిలర్
గా కూడా గెలవలేదని  గేలి చేశారు, కౌన్సిలర్ గా గెలిచి ఆ తర్వాతనే ఆయన దేశం గురించి మాట్లాడాలని, కేటీఆర్ ఆర్ఎస్ఎస్ అధినేతను దుయ్యబట్టారు. 

అయితే నిజంగానే మోహన భగవత ఎవరో తెలియకుండానే కేటీఆర్ ఆయనపై విరుంచు పడ్డారా? ఆయనకున్న శక్తి ఏమిటో తెలియకుండానే కేటీఆర్ ఆయన్ని టార్గెట్ చేశారా? నిజమే మోహన్ భగవత్ కౌన్సిలర్ గా గెలవడం కాదు పోటీకూడా చేయలేదు. ఆయనే కాదు  వందేళ్ళు పూర్తి చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్ చరిత్రలో సంఘ అధినేతలు, బాధ్యులు  ఎవరూ ఎన్నికలలో పోటీ చేయలేదు.

సంఘ అధినేతలే కాదు, జీవితాలను సంఘ కార్యానికి అంకితం చేసిన వేలాది, లక్షలాది మంది ప్రచారకులు, విభిన్న సామాజిక కార్యక్షేత్రాలలో పనిచేస్తున్న పూర్తి సమయ కార్యకర్తలు ఎవరూ రాజకీయ పదవులను ఆశించలేదు. పోటీ పడలేదు. కానీ, కేవలం రెండు పార్లమెంట్ స్థానాల నుంచి ప్రస్తుత 303 స్థానలకు బీజేపీ చేరిందంటే, ఆ విజయం వెనక ఉన్నది సంఘ్ శక్తి. ఈ విషయం తెలియకుండా ఆర్ఎస్ఎస్ అధినేతని కౌన్సిలర్ గాకూడా గెలవలేదని గేలి చేయడం  అయితే అది వారి అజ్ఞానం అవుతుంది. కాదంటే, అమాయకత్వం అనిపించుకుంటుంది. సంఘ్ రాజకీయ పార్టీ కాదు,  సంఘ్ శక్తి కేంద్రం. విభిన్న క్షేత్రాలలో వెలుగులు నింపే శక్తి కేంద్రం అంటారు.

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.