సిరిసిల్లలో కేటీఆర్ ఎదురీత?

Publish Date:Nov 22, 2023

Advertisement

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ కు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో  ఎదురుగాలి వీస్తోందా? ప్రజావ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇందుకు తార్కానంగా ఆయన మంగళవారం నియోజకవర్గ పార్టీ క్యాడర్ తో మాట్లాడిన వీడియోకాల్ ను ఉదహరిస్తున్నారు. ఆ వీడియోలో కేటీఆర్ ప్రజా వ్యతిరేకత ఉందని అంగీకరించడం,  ప్రజలకు ఎన్ని పనులు చేసినా, ఎంత మంచి చేసినా ఎక్కడో కొంత అసంతృప్తి ఉంటుందని, ప్రజలకు తనకు మధ్య డైరెక్టన్ కనెక్షన్ తెగిపోయిందనే అభిప్రాయాలు కూడా జనం నుంచి నియోజకవర్గంలో వినిపిస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సొంత పార్టీ కేడర్‌లోనే చాలా మందికి తనతో యాక్సెస్ లేదనే అసంతృప్తి ఉన్నదని, ఏ సమస్య ఉన్నా తనతో చెప్పుకోవాలని కోరుకుంటున్నారని, కానీ ఇంతకాలం ఎమ్మెల్యేగా క్యాడర్ కు దగ్గర కాలేదనీ, కానీ మరో సారి అవకాశం ఇస్తే  తప్పకుండా నెలలో రెండు రోజుల పాటు సిరిసిల్లలోనే ఉంటానని,   నేరుగా అందుబాటులో ఉంటానని శ్రేణులకు హామీ ఇచ్చారు.

ఇంత చేశాం, అంత చేశాం, హైదరాబాద్ కు ప్రపంచం నలుమూలల నుంచీ పెట్టుబడి దారులు వలస వచ్చేలా చేశాం. తెలంగాణ అభివృద్ధికి బాటలు వేశాం. దేశానికి రాష్గ్రాన్ని ధాన్యాగారంగా మార్చేశాం అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఎన్నికల ముందు కేడర్ తో ఇలా బేలగా మాట్లాడమే ఆయన సిరిసిల్లలో ఎదురీదుతున్నారనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక్కడ నుంచి  ప్రచారం చాలా కీలకమని, ప్రతి ఇంటినీ టచ్ చేసి వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చి వారికి భరోసా కల్పించాలని కేడర్ కు పిలుపునిచ్చారు. 

కొత్త రేషను కార్డులు, పింఛన్లు.. వంటి సమస్యల పరిష్కారంపై ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలనీ కేడర్ కు కేటీఆర్ సూచించారు. సరిగ్గా ఎన్నికల వేళ  ప్రజల నమ్మకాన్ని కోల్పోయామన్న అనుమానం రావడమే ఓటమి భయాన్ని సూచిస్తున్నదని అంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో అధికార పార్టీలో ఈ సారి విజయంపై పూర్తి స్థాయి విశ్వాసం కనబడటం లేదని ఆ పార్టీ ప్రచార సరళే తేటతెల్లం చేస్తోందని అంటున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.