చంద్రబాబుపై కేటీఆర్ పొగడ్తల వర్షం: ఖండించలేక, సమర్థించలేక జగన్ సతమతం.!
Publish Date:Oct 30, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా స్థానిక ఎన్నికల వేళ.. జగన్ కు ఆయన మిత్రుడు బిగ్ షాక్ ఇచ్చారు. జగన్ రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలనను, కరవును ఎదుర్కొనే విషయంలో చూపుతున్న నిర్లక్ష్యాన్ని, పాలనా వైఫల్యాలనూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఎండగడుతున్న వేళ..పొరుగు రాష్ట్రంలోని ఆయన మిత్రుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు చంద్రబాబునాయుడి పాలనా దక్షతను, విధానాలను ప్రశంసించారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేంటంటే.. వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచి దోస్తులు. వారిరువురి మధ్యా రాజకీయ, వ్యక్తిగత మైత్రీ బంధం అందరికీ తెలిసిందు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కు తెలంగాణలో రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి అక్కడి ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించడం రాజకీయ అవసరం. అందుకోసం పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలనతో పోలుస్తూ రేవంత్ వైఫల్యాలను ఎండగట్టడం ఆ పార్టీకి అనివార్యం. ఆ రాజకీయ అనివార్యత కారణంగానే కేటీఆర్ చంద్రబాబును ఆకాశానికెత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. అందు కోసం ఆయన జగన్ తో మైత్రిని పట్టించుకోలేదు. లెక్క చేయలేదు. చంద్రబాబును ప్రశంసించిన ఎవరిపైనైనా పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ముద్ర వేసి అనుచిత వ్యాఖ్యలతో, విమర్శలతో విరుచుకుపడే వైసీపీ ఇప్పుడు మౌనం వహించడంగమనార్హం. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ తో సంబంధాలు దెబ్బతింటుందనే భయం, అలాగని మౌనం వహిస్తే.. చంద్రబాబు సమర్థతను అంగీకరించినట్లౌతుందన్న ఆందోళనతో వైసీపీ సతమతమౌతున్నట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక సందర్భంలో సినీ నటుడు రజనీకాంత్ అమరావతిని, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించినప్పుడు ఆయనపై వైసీపీ సోషల్ మీడియాలోనూ, బహిరంగంగానూ విమర్శల దాడికి దిగింది. కానీ పాపం, తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ముందుచూపును, కరవు సమర్థవంతమైన నిర్వహణను ప్రస్తుతిస్తే.. మింగలేక కక్కలేక అన్నట్లు మౌనం వహించింది.
[KTR Big Shock To Jagan, Praises CBN, Telangana, Andhra Pradesh Politics, Political Necesacities, Telugu One]
http://www.teluguone.com/news/content/ktr-big-shock-to-jagan-25-235828.html




