సూపర్‌స్టార్‌ కృష్ణ బర్త్‌డే స్పెషల్

Publish Date:May 31, 2013

Advertisement

 

 

 

 

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని అద్యాయాలు ఎప్పటికీ చెరిగిపోవు అలాంటి ఓ సువర్ణద్యాయమే సూపర్‌స్టార్‌ కెరీర్‌.. తెలుగు సినిమాను ప్రయోగాల బాట నడిపించడమే కాదు.. ఎన్నో అత్యున్నత సాంకేతిక విలువలను తెలుగు తెరకు పరిచయం చేసిన సాహసి అతను.. తొలి కౌబాయ్‌, తొలి బాండ్‌, తొలి 70MM, తొలి సినిమా స్కొప్‌, లాంటి ఎన్నో విషయాలను తెలుగు తెరకు పరిచయం చేశాడు.. ఆయన తెలుగు తెరకు తెగువ నేర్పిన సూపర్‌స్టార్‌ కృష్ణ.. 70వ యేట అడుగిడుతున్న సూపర్‌స్టార్‌ కృష్ణగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ జేస్తూ ఆ నటశేఖరుని కెరీర్‌పై ఓ లుక్‌

 

 

సూపర్ స్టార్ కృష్ణ 1943 వ సంవత్సరం, 'మే' 31 వ తేదీన గుంటూరు జిల్లా, బుర్రిపాలెంలో జన్మించారు. చిన్నప్పటినుంచే నటన మీద ఆసక్తి పెంచుకున్న కృష్ణ చదువుకునే రోజుల్లోనే ఎన్నో నాటకాల్లో నటించారు..ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నారు.. ఆ అనుభవంతోనే 1965లో తొలిసారిగా తేనేమనసులు సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. తెలుగులో తొలిపూర్తి స్థాయి కలర్‌ సినిమా కూడా ఇదే..

 

అయితే తొలి రోజుల్లోనే ప్రయోగాలకు సై అన్నాడు.. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే గూఢచారి 116 లాంటి స్పై సినిమా చేసి తొలి సారి బాండ్‌ క్యారెక్టర్‌ను తెలుగు తెరకు పరిచయం చేశాడు.. ఈ సినిమాతో మాస్ అండ్‌ యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కృష్ణ..


 

ఇక ఆతరువాత కృష్ణ తరువాత కృష్ణ చేసిన మరో ప్రయోగం కౌబాయ్‌.. తెలుగు నేటివిటికి అసలు సంబందం లేని కౌబాయ్‌ పాత్రతో కూడా సంచలనం సృష్టించాడు కృష్ణ. 1970లో మొసగాళ్లకు మొసగాడు సినిమాతో తెలుగు తెర మీద కౌభాయ్‌ క్యారెక్టర్‌లకు స్వాగతం పలికాడు.. తరువాత ఈ సినిమాతో ఇంగ్లీష్‌లోకి కూడా డబ్‌ అయి హాలీవుడ్‌లో కూడా రిలీజ్‌ అయింది..

 

ఇక కృష్ణ కెరీర్‌లోనే ఓ మైల్‌స్టోన్‌.. అల్లూరి సీతారామరాజు.. ఎన్నో ఎళ్లుగా ఎన్టీఆర్‌ చేయాలనుకుంటూ ఆగిపోతున్న అల్లూరి క్యారెక్టర్లో నటించిన కృష్ణ ఈ సినిమాతో అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో రికార్డులను తిరగరాశాడు.. వీర రసాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటీకీ ప్రేక్షకుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే వుంటాయి. సొంత బ్యానర్ పై భారీ వ్యయ ప్రయాసలకి ఓర్చి ఆయన నిర్మించిన ఈ సినిమా, సంచలనానికి సరైన అర్ధం చెప్పింది ... కృష్ణ పేరు ప్రతిష్టలని ఎవరెస్టు శిఖరమంత ఎత్తులో నిలిపింది.

      

కృష్ణ కేవలం సాహసానికే కాదు డెడికేషన్‌కు కూడా పెట్టింది పేరు అందుకే ఆయన ఒక టైంలో ఒకే సంవత్సరం 17 సినిమాలు విడుదల చేసి సంచలనం సృష్టించాడు.. అంతేకాదు ఆ 17 సినిమాల్లో 9 సినిమాలు 100 రోజులు ఆడటం మరో విశేషం..

      

ఈనాడు లో పవర్ ఫుల్ కేరక్టర్ ని పోషించారు. కార్మిక - శ్రామిక పక్షాన నిలిచి అవినీతి రాజకీయాలపై సమర శంఖాన్ని పూరించే శక్తిగా కృష్ణ కనిపిస్తారు. ఈ సినిమాతో జనం మెచ్చిన నటుడుగా నీరాజనాలు అందుకున్న కృష్ణ, ఏకలవ్య ... అడవి సింహాలు ... ముందడుగు ...  శక్తి ... పచ్చని కాపురం ... పల్నాటి సింహం వంటి చిత్రాలతో ఘన విజయాల్ని అందుకున్నారు.

      

70, 80లలోనే కాదు 90వదశకంలో కూడా అద్భుతమైన చిత్రాల్లో నటించారు కృష్ణ.. నెంబర్‌ వన్‌, అమ్మదొంగా లాంటి సినిమా తో చిరంజీవి బాలకృష్ణ లాంటి స్టార్‌ హీరోలకు కూడా గట్టి పోటినిచ్చారు.. హీరోగా ... నిర్మాతగా ... దర్శకుడిగా కృష్ణ సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. పద్మాలయ బ్యానర్ పై బాలీవుడ్ చిత్రాలని సైతం నిర్మించిన ఘనత ఆయన సొంతం.

 

నష్టపోయిన నిర్మాతలకు పారితోషికం గురించి పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ డేట్స్ ఇచ్చి ఆదుకునేవారాయన. తను నటించే సినిమా భవిష్యత్ గురించి, అది ఆడుతుందా? ఆడదా? కూడా ఆయన నిర్మొహమాటంగా చెప్పేవారు. దాదాపు 350 చిత్రాల్లో నటించిన కృష్ణ నటుడిగా మత్రమే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికి కొన్ని సినిమాల్లో గెస్ట్ లోస్ వేస్తూ అటు తన అభిమానులను ఇటు సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ.

      

ఇలా కళామతల్లి ముద్దుబిడ్డగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సూపర్‌స్టార్‌ కృష్ణ.. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరకుంటూ తెలుగువన్.కామ్ మరోసారి ఆ నటశేఖరునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది.

By
en-us Political News

  
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది. 
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల క్రతువు ముగిసింది. ఈ నెల 9వ తేదీన మొదలైన పోలింగ్, ఆదివారం జరిగిన నాల్గవ విడత పోలింగ్ తో ముగిసింది. ఇంచుమించుగా సంవత్సరంపాటు సాగిన పంచయతీ వివాదం చివరాఖరుకు ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్లుగా మొత్తం 10,890 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగాయి.   ఈ ఎన్నికలలో ఎవరు గెలిచారు,ఎవరు ఓడిపోయారు అనే విషయాన్నిపక్కన పెడితే  కొవిడ్ భయాన్ని, ఇతరత్రా  ఎదురైన సమస్యలను పక్కన పెట్టి, గ్రామీణ ఓటర్లు, ప్రజాస్వామ్య స్పూర్తిని పుష్కలంగా కురిపించారు. నాలుగు దశల్లో పోలింగ్ జరిగితే, ప్రతి దశలోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్’లో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే 80.14 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రోడ్లన్నీ రద్దీ. గుంపులు గుంపులుగా జనం. ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, గుళ్లు, పండగలూ ఇలా జనజీవనం మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. కరోనా లేదు. గిరోనా లేదు. ఇండియన్ల ముందు చైనీస్ వైరస్ తోకముడిచిందంటూ గొప్పలు. మాస్కులు పెట్టుకోవడం తగ్గించేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.