కొత్తిమీర…. ఖర్చు తక్కువ…. ఆరోగ్యం ఎక్కువ ...

Publish Date:Jan 11, 2021

Advertisement


ధనియాల మొక్కలే ఈ కొత్తిమీర.

మంచి సువావన కలిగి ఉంటుంది.

వంటకాలలో విరివిగా వాడతారు.

కొత్తిమీరతో పచ్చడి కూడా చేస్తారు.

దీని శాస్త్రీయ నామము " Coriandrum sativum ". ఆహార పదార్దాల మీద అలంకరించుకోవడానికని భావిస్తే పొరపాటే. మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు,కాయగూరల వంటకాలలో విరివిగా వేసి తీసుకోవచ్చు. కొత్తిమిర నిండా విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి . అంతేకాదు సమృద్ధి గా ఐరన్ కుడా లభిస్తుంది .కొత్తిమిర రక్తహీనతను తగ్గిస్తుంది. పొగతాగడం,కేమోతెరఫి వల్ల కలిగే నష్టము తగ్గించడానికి పోరాడుతుంది.. కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది.రక్తనాళాలలో ఆటంకాలను తొలగిస్తుంది.

 


దీనిని కేవలం వంటింటి పదార్థంగా మాత్రమే కాకుండా కొత్తిమీరను ఔషధంగా కూడా వాడవచ్చు. కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ సుగంధ తత్వాలూ, ఔషధ తత్వాలూ అనేకం ఉంటాయి. ఈమధ్య జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర ఫుడ్ పాయిజనింగ్‌లో అత్యంత ప్రయోజనకారిగా పనిచేస్తుందని తేలింది. తాజాగా సేకరించిన కొత్తిమీరలో డుడిసినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆహారాన్ని విషతుల్యం చేసే సాల్మనెల్లా బ్యాక్టీరియాని నిర్వీర్యపరుస్తుందని గమనించారు. కొసమెరుపేమిటంటే, సాధారణంగా ఫుడ్ పాయినింగ్‌లో జెంటామైసిన్ వాడుతుంటారు. అయితే దీనికన్నా కొత్తిమీర ప్రభావవంతంగా, సురక్షితంగా పనిచేసినట్లు రుజువయ్యింది.


ఇటీవల జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర కార్మినేటివ్‌గా (గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది. అలాగే రిఫ్రిరెంట్‌గా (శరీరాన్ని చల్లపరిచేదిగా), డైయూరిటిక్‌గా (మూత్రాన్ని జారిచేసినదిగా), ఏఫ్రోడైజియాక్‌గా (లైంగిక శక్తిని పెంచేదిగా), యాంటీ స్పాస్‌మోడిక్‌గా (అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా), హైపోగ్లైసీమిక్‌గా (రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేదిగా) పనిచేస్తుందని తేలింది.


కొత్తిమీర ఆకుల స్వరసాన్ని ఔషధంగా వాడుకోదలిస్తే 10మి.లీ. (రెండు టీస్పూన్లు) మోతాదులో వాడాలి.కొత్తిమీర ఆమాశయాన్ని శక్తివంతం చేయటమే కాకుండా దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదరంలో చేరిన గ్యాస్‌ని తగ్గించటంతోపాటు మూత్రాన్ని చేయటం, జ్వరాన్ని తగ్గించటం చేస్తుంది. అలాగే శృంగారానురక్తిని పెంచటం, శ్వాసనాళికల్లో సంచితమైన కఫాన్ని కరిగించి వెలుపలకు వచ్చేలాచేయటం వంటి పనులను కూడా చేస్తుంది. ఉదర కండరాలు పట్టేసి నొప్పిని కలిగిస్తున్నప్పుడు ఉపశమనాన్ని కలిగిస్తుంది.

 

కొత్తిమీర రసం విటమిన్-ఎ, బి1, బి2, సి, ఐరన్ లోపాల్లో హితకరంగా ఉంటుంది. గృహ చికిత్సలు అజీర్ణం, వికారం, శరీరంలో మంటలు తాజా కొత్తిమీర రసం అజీర్ణం, వికారం, ఆర్శమొలలు, బంక విరేచనాలు, హెపటైటిస్, అల్సరేటివ్ కోలైటిస్(పెద్ద పేగులో వ్రణం తయారుకావటం) వంటి వ్యాధుల్లో హితకరంగా పనిచేస్తుంది. జీర్ణక్రియా సమస్యల్లో కొత్తిమీర రసాన్ని(10-20 మి.లీ) 1 గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకోవాలి. నోటి పూత, నోటి దుర్వాసన, చిగుళ్లవాపు, చిగుళ్లనుంచి రక్తం కారటం. కొత్తిమీర ఆకులను నమిలి మింగుతుంటే నోటికి సంబంధించిన సమస్యల్లో ఉపయుక్తంగా ఉంటుంది. దంతాలు దెబ్బతినకుండా ఉంటాయి. కొత్తిమీర రసానికి లవంగ మొగ్గల పొడి కలిపి వాడితే మరింత హితకరంగా ఉంటుంది. 


మొటిమలు, మంగు మచ్చలు చర్మంమీద నల్లని మచ్చలు, పొడి చర్మం, పెద్దసైజు మొటిమలు వంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు చెంచాడు కొత్తిమీర రసానికి చిటికెడు పసుపు చేర్చి కలిపి బాహ్యంగా ప్రయోగించాలి. దీని ప్రయోగానికి ముందు ముఖాన్ని బాగా శుభ్రపరుచుకోవటం అవసరం. దీనిని ప్రతిరోజూ రాత్రి నిద్రకుముందు ప్రయోగిస్తే కొద్దిరోజుల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది. ముక్కునుంచి రక్తం కారటం, ముక్కులో కొయ్యగండలు పెరగటం (పాలిప్స్) 20గ్రాముల కొత్తిమీర ఆకులకు చిటికెడు పచ్చకర్పూరం పలుకులు కలిపి ముద్దగా నూరి రసం పిండి రెండుముక్కు రంధ్రాలలోనూ రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి. అలాగే కొద్దిగా రసాన్ని తలకు కూడా రాసుకోవాలి. దీంతో ముక్కునుంచి జరిగి రక్తస్రావం ఆగుతుంది.

 


ముక్కులో పాలిప్స్ పెరిగిన సందర్భాల్లోకూడా ఇది హితకరంగా ఉంటుంది. నొప్పి, వాపు 20 మిల్లీలీటర్ల కొత్తిమీర రసానికి 10 మిల్లీలీటర్ల వెనిగర్‌ని కలిపి రాసుకుంటే నొప్పి, వాపులనుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్శమొలలు కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి ఎర్రగా వేయించిన ఎర్రమట్టికి కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే మొలలు ఎండిపోయి నొప్పి, దురదలనుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంనుంచి రక్తస్రావమవటం తాజాగా కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి, రసం పిండి, పంచదార కలుపుకొని తాగితే బహిష్టుస్రావం ఎక్కువగా కావటం, ఆర్శమొలలనుంచి రక్తం కారటం వంటి సమస్యలు తగ్గుతాయి. విటమిన్ల లోపం కొత్తిమీరను చట్నీగా చేసుకొని తినాలి. లేదా ప్రతిరోజూ రాత్రి నిద్రకు ముందు తాజాగా తీసిన కొత్తిమీర రసానికి చెంచాడు తేనె కలుపుకొని తాగుతుండాలి. దీనిని క్రమంతప్పకుండా తీసుకుంటే విటమిన్-ఏ, విటమిన్-బి1, విటమిన్-బి6, విటమిన్-సి, లోహం వంటి పదార్థాల లోపం ఏర్పడకుండా ఉంటుంది. ఈ ఆహార చికిత్స క్షయవ్యాధి, ఉబ్బసం, ఎలర్జీలు, మెదడు బలహీనత, కళ్ల బలహీనత వంటి సమస్యల్లో బాగా పనిచేస్తుంది.


అమ్మవారు (స్మాల్‌పాక్స్) కొత్తిమీర రసాన్ని తాజాగా తీసి, చెంచాడు రసానికి ఒకటి రెండు అరటి ‘గింజలు’ పొడిని కలిపి రోజుకు ఒకసారి చొప్పున వారంపాటు తీసుకుంటే స్మాల్‌పాక్స్ వంటి పిడకమయ వ్యాధుల్లో నివారణగా సహాయపడుతుంది. స్మాల్‌పాక్స్ వ్యాధి తీవ్రావస్థలో ఉన్నప్పుడు కొత్తిమీర రసాన్ని పరిశుభ్రమైన పద్ధతులతో తీసి, రెండు కళ్లలోనూ చుక్కలుగా వేసుకుంటే కళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. తలనొప్పి, మైగ్రెయిన్ కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి కణతలకు, నుదుటికి పూసుకుంటే తలనొప్పి, ఒంటి కణత నొప్పి వంటివి తగ్గుతాయి. 


కళ్లమంటలు, కళ్లకలక కొత్తిమీర ఆకులను తాజాగా తెచ్చి, బాగా కడిగి, ముద్దగా నూరి, రసం పిండి, చనుబాలతో కలిపి కళ్లల్లో బిందువులుగా వేసుకుంటే కళ్లమంటలు, కనురెప్పలు అంటుకుపోవటం, కళ్లుమెరమెరలాడటం, కళ్లకలక వంటి సమస్యలు తగ్గుతాయి. నొప్పితో కూడిన వాపులు కొత్తిమీర ఆకులను, బాదం పలుకులతో ముద్దగా నూరి వాపు, నొప్పి ఉన్నచోట పట్టుగా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. దద్దుర్లు కొత్తిమీర ఆకుల రసానికి తగినంత తేనెనూ బాదాం నూనెనూ కలిపి దద్దురు తయారైనచోట పైకి రాసుకోవాలి. అలాగే పంచదార కలిపి లోపలకు తీసుకోవాలి. విష పురుగులు కుడితే కొత్తిమీర ఆకులను ముద్దగా నూరి బాదం పలుకులనూ, పెసర పిండినీ కలిపి స్థానికంగా ప్రయోగిస్తే విషపురుగులు కరిచినచోట తయారైన నొప్పి, 
వాపులు తగ్గుతాయి. 


కొత్తిమీర ఆకుల రసానికి కొద్దిగా పంచదార కలిపి తీసుకుంటే మంటలు తగ్గుతాయి. స్మాల్‌పాక్స్ (బృహన్మసూరిక) తాజా కొత్తిమీర రసం స్మాల్‌పాక్స్‌లో నివారణగా పనికి వస్తుంది. దీనిని ఒక చెంచాడు మోతాదులో అరటి పండుతో కలిపి ఏడు రోజులపాటు తీసుకోవాలి. స్మాల్‌పాక్స్‌లో నేత్రాలు దెబ్బతినకుండా కొత్తిమీర రసాన్ని కళ్లలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. ధనియాల మొక్కను మనం కొత్తిమీరగా పిలుస్తాము. దీనికి ధనియాల గుణాలన్నీ ఉంటాయి. సాధారణంగా కొత్తిమీరను సువాసనకోసం వంటల్లో వాడుతుంటారు. లేత మొక్కని మొత్తంగా రోటి చట్నీలకోసం వాడుతుంటారు. కొత్తిమీర ఆకులను సూప్స్,  కూరల వంటి వాటికి చేర్చుతుంటారు.

 

పెదవులు నల్లగా ఉన్నవారు రోజూ రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసం పెదవులపై రాయండి. కొన్ని రోజులకి పెదాలు లేత రంగును సంతరించుకొంటాయి... ఏదైనా కూర వండేటపుడు కాకుండా చివరలో అంటే దించివేసే ముందు వేస్తేనే కూరకు మంచి సువాసన వస్తుంది. కొత్తిమీర త్వరగా వాడిపోకుండా ఉండాలంటే ఓ గ్లాసులో నీరు పోసి వాటి వేర్లు మునిగేటట్లు ఉంచండి. మీ ఇంటి వెనుక కాస్త స్థలం ఉందా?  ఉంటే కాసిన్ని ధనియాలు చల్లి నీరు చిలకరించండి కొత్తిమీర వస్తుంది. ఒకవేళ స్థలం లేకపోయినా పూలకొండీలలో చల్లినా చాలు.

By
en-us Political News

  
వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
టమోటా భారతీయ వంటల్లో తప్పనిసరిగా.. ఎక్కువగా వాడే కూరగాయ.
డ్రై ఫ్రూట్స్ అందరికీ ఇష్టమైనవి. ఖరీదు ఎక్కువని కొందరు వీటిని దూరం పెడతారు కానీ పండుగలు, శుభకార్యాలప్పుడు వంటల్లో డ్రై ప్రూట్స్ తప్పక ఉండాల్సిందే.
బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే  పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి.
భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక.
మనిషి శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం. సరైన ఆహారం తిన్నా, సరైన వేళకు తిన్నా అది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది.
జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది.
మామిడి పండ్ల సీజన్ మొదలైంది.
రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదన్నది చాలా పాపులర్ అయిన మాట.
వేసవికాలం కోసం చాలామంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు.
ఇప్పట్లో సంపూర్ణ ఆరోగ్యం కలిగిన మనుషులు దాదాపు కనుమరుగయ్యారనే చెప్పాలి.
వేసవికాలం  వచ్చిందంటే మండే ఎండల వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు.
రోజంతా పాజిటివ్‌గా,  యాక్టివ్‌గా ఉండటానికి మంచి ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.