Publish Date:Mar 24, 2023
వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి శుక్రవారం (మార్చి 24) తెలుగుదేశం గూటికి చేరనున్నారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో గిరిధర్ రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిపిన గిరిధర్ రెడ్డి.. నెల్లూరు నుంచి 300 కార్లతో భారీ ర్యాలీగా అమరావతి చేరుకోనున్నారు. గిరిధర్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలు కూడా తెలుగుదేశంలో చేరనున్నారు. గిరిధర్‌రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు.
ఆయన సోదరుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతూ రెబల్‌గా మారారు. ఆ నేపథ్యంలోనే వైసీపీను వీడాలని గిరిధర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ముందు ముందు గిరిధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తెలుగుదేశం గూటికి చేరుతారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. గురువారం (మార్చి 23) జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నిర్ణయాన్ని కాదని ఆత్మప్రభోదానుసారం ఓటు వేసిన సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kotam-reddy-giridhar-reddy-to-join-tdp-25-152861.html
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.