కొండపల్లిపై వైసీపీకి షాక్.. చైర్మెన్ ఎన్నికకు హైకోర్టు ఆదేశాలు
Publish Date:Nov 23, 2021
Advertisement
కొండపల్లి మున్సిపాలిటీలో తమకు మెజార్టీ లేకపోవడంతో చైర్మెన్ ఎన్నిక జరగకుండా అడ్డుకుంటున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను బుధవారం నిర్వహించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారమే ఎన్నిక నిర్వహించాలని రిటర్నింగ్ ఆఫీసర్ ను ఆదేశించింది. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి స్పష్టం చేసింది. ఎన్నికైన అభ్యర్థులను రక్షణ కల్పించాలని సీపీని ఆదేశించింది. ఎన్నిక నిర్వహించి ఫలితం ప్రకటించవద్దని, పూర్తి వివరాలను హైకోర్టుకు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు గురువారానికి వాయిదా వేసింది. కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ సీట్లు సాధించింది. మున్సిపాలిటీల్లో 29 వార్డులు ఉండగా వైసీపీ 14, టీడీపీ 14 చోట్ల గెలుపొందాయి. 14వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అయితే ఇండిపెండెంట్ గా గెలిచిన శ్రీలక్ష్మి టీడీపీలో చేరారు. దీంతో కొండపల్లిలో టీడీపీకి మెజార్టీ వచ్చింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఎక్స్ అఫిషియే మెంబర్ గా కొండపల్లి నమోదు చేయించుకున్నారు. దీంతో టీడీపీ బలం 16కు చేరింది. వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఓటు ఉన్నా.. వాళ్ల బలం 15 15 దగ్గరే ఆగిపోయింది. దీంతో టీడీపీకి చైర్మెన్ పీఠం దక్కకుండా వైసీపీ కుట్రలు చేస్తోంది. సోమావరం చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా.. నానా రభస స్పష్టించి అడ్డుకుంది. మంగళవారం కూడా చైర్మెన్ ఎన్నిక జరగకుండా విధ్వంసం స్పష్టించింది.
http://www.teluguone.com/news/content/kondapalli-chairman-election-on-wednesday-ap-high-court-orders-to-ap-sec-39-126960.html





