మంత్రి కొండా సురేఖపై వేటు పడేనా..? అధిష్ఠానం వద్దకు చేరిన పంచాయితీ..!
Publish Date:Aug 27, 2026
Advertisement
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..! తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ ప్రస్తుతం హస్తం పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, కాంగ్రెస్ నేతల ప్రకటనలు పార్టీలో అంతర్గత విభేదాలను తీవ్రస్థాయికి చేర్చాయి. ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా కొండా కుటుంబ సభ్యుల తీరు ఉందన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అత్యవసరంగా బెంగళూరు పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన భట్టి విక్రమార్క, రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా నివేదికను ఆయనకు సమర్పించినట్లు సమాచారం. బెంగళూరు భేటీ అనంతరం ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు వేదికగా మంత్రులు, సీనియర్ నేతల మధ్య వరుస భేటీలు జరగడంతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ వివాదంపై పార్టీ క్రమశిక్షణా కమిటీ నివేదికను సిద్ధం చేసి అధిష్ఠానానికి పంపినట్లు సమాచారం. అందుతున్న వార్తల ప్రకారం, అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంటే మంత్రివర్గంలో మార్పులు లేదా స్వచ్ఛంద రాజీనామా అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం మొదలైంది. మరోవైపు కొండా మురళీధరావు కీలక వ్యాఖ్యలు చేయడం, తమ వైఖరిని స్పష్టం చేయడంతో ఈ ఎపిసోడ్ మరింత కాకరేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాల లోపే తుది నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న కొండా సురేఖ వ్యవహారంలో ఏఐసీసీ పెద్దల నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే హైకమాండ్ అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 2 తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్.. సెప్టెంబర్ 2న ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయన ఢిల్లీకి వచ్చిన తర్వాతే కొండా సురేఖ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్ రాక అనంతరం క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చ జరగనుంది. ఈ వ్యవహారంలో రాయబారం చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు భట్టి ఆసక్తి చూపలేదని సమాచారం. మరోవైపు.. క్రమశిక్షణ కమిటీ నిర్ణయమే తుది నిర్ణయమని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేసీ వేణుగోపాల్ రాక తర్వాత కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. Konda Surekha, Bhatti Vikramarka, Telangana Congress Politics, Mallikarjun Kharge, AICC, Telugu News, Telugu one, KC Venugopal
http://www.teluguone.com/news/content/konda-surekha-25-229996.html




