మంత్రి కొండా సురేఖపై వేటు పడేనా..? అధిష్ఠానం వద్దకు చేరిన పంచాయితీ..!

Publish Date:Aug 27, 2026

Advertisement

 

ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ ప్రస్తుతం హస్తం పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, కాంగ్రెస్ నేతల ప్రకటనలు పార్టీలో అంతర్గత విభేదాలను తీవ్రస్థాయికి చేర్చాయి. ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా కొండా కుటుంబ సభ్యుల తీరు ఉందన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అత్యవసరంగా బెంగళూరు పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన భట్టి విక్రమార్క, రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా నివేదికను ఆయనకు సమర్పించినట్లు సమాచారం.

బెంగళూరు భేటీ అనంతరం ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు వేదికగా మంత్రులు, సీనియర్ నేతల మధ్య వరుస భేటీలు జరగడంతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.

ఇప్పటికే ఈ వివాదంపై పార్టీ క్రమశిక్షణా కమిటీ నివేదికను సిద్ధం చేసి అధిష్ఠానానికి పంపినట్లు సమాచారం. అందుతున్న వార్తల ప్రకారం, అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంటే మంత్రివర్గంలో మార్పులు లేదా స్వచ్ఛంద రాజీనామా అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం మొదలైంది.

మరోవైపు కొండా మురళీధరావు కీలక వ్యాఖ్యలు చేయడం, తమ వైఖరిని స్పష్టం చేయడంతో ఈ ఎపిసోడ్ మరింత కాకరేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాల లోపే తుది నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న కొండా సురేఖ వ్యవహారంలో ఏఐసీసీ పెద్దల నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే హైకమాండ్ అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

మరోవైపు సెప్టెంబర్ 2 తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత కేసీ వేణుగోపాల్‌.. సెప్టెంబర్ 2న ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయన ఢిల్లీకి వచ్చిన తర్వాతే కొండా సురేఖ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కేసీ వేణుగోపాల్‌ రాక అనంతరం క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చ జరగనుంది. ఈ వ్యవహారంలో రాయబారం చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు భట్టి ఆసక్తి చూపలేదని సమాచారం.

మరోవైపు.. క్రమశిక్షణ కమిటీ నిర్ణయమే తుది నిర్ణయమని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేసీ వేణుగోపాల్‌ రాక తర్వాత కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

 

Konda Surekha, Bhatti Vikramarka, Telangana Congress Politics, Mallikarjun Kharge, AICC, Telugu News, Telugu one, KC Venugopal
 

By
en-us Political News

  
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.