అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జగన్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేస్తున్నది అధర్మయుద్ధమని ఆయన పార్టీ నేతలే తెలిసో తెలియకో అంగీకరించేస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికలలో కూడా జగన్ అధర్మయుద్ధం చేసే తన పార్టీని గెలిపించారనీ చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇతిహాసాలను, పురాణాలనూ తీసుకువచ్చి వాటితో పోలుస్తూ జగన్ ను సమర్ధించుకోవడానికి వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు నవ్వుల పాలౌతున్నాయి. తాజాగా ఉంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు రాసిన ఓ వ్యాసం ఆయనకు పురాణాల గురించి ఇసుమంతైనా తెలియదని చాటింది.
అంతే కాకుండా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ది మహాభారతంలో దుర్యోధనుడి లాంటి వ్యక్తిత్వం అని కొమ్మినేని శ్రీనివాసరావు తన వ్యాస్తం ద్వారా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇంత సూటిగా జగన్ ను కౌరవ అగ్రజుడిగా పేర్కొంటూ కొమ్మినేని శ్రీనివాసరావు రాసిన వ్యాసాన్ని జగన్ సొంత మీడియా తన ఆన్ లైన్ ఎడిషన్ లో ప్రముఖంగా ప్రచురించుకుంది.
వైఎస్ విజయమ్మ వాస్తవాలు చూడలేని స్థితిలో ఉన్నారా? అనే శీర్షికన కొమ్మనేని శ్రీనివాసరావు వ్యాసంలో దివంగత వైఎస్ దృతరాష్ట్రుడు, విజయమ్మ గాంధారి, జగన్ దుర్యోధనుడు. ఔను ఆయన వ్యాసం సారాంశం క్లుప్తంగా, స్థూలంగా ఇదే. ఇంతకీ కొమ్మినేని జగన్ ను సమర్ధిస్తున్నట్లా? విమర్శి స్తున్నట్లా?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kommineni-srinivasarao-says-vijayamma-gandhari-39-187728.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్‌బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.