జ‌గ్గారెడ్డి దెబ్బ‌తో దారికొచ్చిన కోమ‌టిరెడ్డి.. రేవంతా మ‌జాకా..

Publish Date:Mar 22, 2022

Advertisement

అవును, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు కోమటి రెడ్డి వెంకట రెడ్డి చెప్పింది నిజం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలనేవి భార్యభర్తల  మధ్య తగువు లాంటివే, నిజమే. అలాగే భార్యాభర్తల తగవుల్లానే వాటంతట అవే సర్దుకుంటాయి,అంతే గానీ, అంత త్వరగా విడాకుల వరకు వెళ్ళవు. కోమటి రెడ్డి సోదరుల విషయమే తీసుకుంటే, రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన వెంటనే, అసమ్మతి గళం వినిపించిన మొదటి నాయకుడు, కోమటి రెడ్డి వెంకట రెడ్డి. చివరి వరకు రేవంత్ రెడ్డితో పోటీపడి, చివరకు ఓటమి అంగీకరింకరించక తప్పని పరిస్థితిలో ఆయన ఇక గాంధీ భవన్ గడప తొక్కేది లేదని, ఆరోజునే  శపధం చేశారు. రేవంత్ రెడ్డి మీదనే కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు, మాణిక్ ఠాగూర్’పైన కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయినా, ఆ తర్వాత గాంధీ భవన్ గడప తొక్కారు, రేవంత్ రెడ్డితో కరచాలనం చేసుకున్నారు, కబుర్లు చెప్పుకున్నారు, ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ తగువులాడుకున్నారు, మళ్ళీ ఈ రోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి అపూర్వ సోదరుల్లా మీడియా  ముందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగానే కొంటి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు, భార్యాభర్తల తగువుల వంటివని చెప్పారు. అంతే కాకుండా, తాను చివరి వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. 

నిజానికి కొద్ది రోజుల క్రితమే కోమటి రెడ్డి సోదరులు, బీజీపీలో చేరడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి పార్లమెంట్’లో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. జస్ట్ ఒక అరగంటలోనే తనకు ప్రధాని అప్పాయింట్మెంట్ ఇవ్వడం అధ్బుతం, అమోఘం అంటూ మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే, ఆయన సోదరుడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి, నేరుగా సీఎల్పీలీడర్ భట్టి విక్రమార్క మీద  భగ్గుమన్నారు. రేవంత్ రెడ్డి పైనా ఫైరయ్యారు. రేవంత్ రెడ్డి విషయంలో  పార్టీ అధిష్టానం తప్పుడు నిర్ణయం తీసుకుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్’ను ఓడించేందుకు అవసరం అయితే దమ్మున్న పార్టీలో చేరతానని చెప్పారు. 

అయితే ఇంతలోనే, కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఇలా ... మాటమార్చడం వెనక కారణం ఏమై ఉంటుంది?అంటే, అందుకు కోమటి రెడ్డి చెప్పిన భార్యాభర్తల పోలిక ఒక స్ట్రాంగ్ రీజనే అయినా, అసమ్మతి స్వరాన్ని పెంచిన సంగారెడ్డి ఎమ్మెల్ల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రెక్కలు కత్తిరింఛి ఆయన నిర్వహిస్తున్న పార్టీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడంతో, కోమటి రెడ్డి ఒకడుగు వెనక్కి వేశారని అనుకోవచ్చని అంటున్నారు. అందుకే, కోమటి రెడ్డి తాను ప్రధానిని కలిసినంత మాత్రాన పార్టీ మారతానని ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు. సీఎం కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకే ప్రధానిని కలిశానని, భవిష్యత్తులోనూ ప్రధానిని కలుస్తానని ఆయన స్పష్టం చేశారు. 

అదలా ఉంటే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అవినీతిపై పూర్తి వివరాలతో ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. అంతే కాదు, బొగ్గు గనులలో జరిగిన కుంభకోణంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 134 మంది ఐఏఎస్‌లు ఖాళీగా ఉన్నారని, సీఎస్ దగ్గర 6-8 శాఖలు ఎందుకని ప్రశ్నించారు. ఏవైనా హై ఎండ్ బిల్డింగ్ ఫైల్స్ ఆమోదించాలంటే సీఎస్‌కు రూ.5 - రూ.10 కోట్లు ముట్టచెపితేనే పని అవుతోందని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. సీఎస్ సోమేష్ కుమార్‌ను ఢిల్లీకి తీసుకెళ్లాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి చేసిన ఫిర్యాదులో ఉన్నాయన్నారు. మొత్తానికి కోమటి రెడ్డి, ప్రధాని మోడీ మొదలు, ముఖ్యమంత్రి కేసీఆర్’ వరకు ( ఈ మధ్యనే ఒక కార్యక్రమంలో కోమటి రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్’ పొగడ్తలతో ముంచెత్తారు. ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు) వరకు, ఇటు పార్టీలో ప్రత్యర్ధుల వరకు అందరితోనూ శత్రుమిత్ర సంబంధాలను బాలన్స్ చేసుకుంటూ, సమయానుకూలంగా ఒపీనియన్స్’ మార్చుకుంటూ, స్మార్ట్ పోలిటిషియన్’గా నిరూపించుకుంటున్నారు.

By
en-us Political News

  
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ 62 పిటిషన్లు వేసింది.!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.