బీజేపీలోకి కోమటిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌!.. రేవంత్‌రెడ్డికి షాక్‌!!

Publish Date:Mar 18, 2022

Advertisement

ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముందస్తు ఎన్నికలకు పోవడం ఖాయం. ఇందులో మరో అభిప్రాయానికి ఆస్కారమే లేదు. రాష్ట్రంలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా, ఇదే మట్లాడుకుంటున్నారు. అదే సమయంలో, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి,  జంప్ జిలానీల గోడ దూకుళ్ళు కూడా జోరందుకునే సంకేతాలు స్పష్ట మవుతున్నాయి. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, తెరాస అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనే అధికార తెరాస అభుర్ధులను ఓడగొట్టేందుకు తమ అనుచరులను స్వతంత్ర అభ్యర్దులుగా బరిలో దించిన జూపల్లి, ఇక ఇప్పడు తెరాసకు గుడ్ ‘బై చెప్పేందుకు సిద్దమయ్యారు.అయితే ఆయన బీజేపీలోకి వెళ్తారా లేక కాంగ్రేస్ గూటికి చేరతారా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు. నిజానికి, ఒక దశలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలను బేరీజు వేసుకుని బీజేపీలో చేరేందుకు జూపల్లి సిద్దమయ్యారు. అయితే,  తాజాగా  కొల్లాపూర్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభకు వచ్చిన స్పందన చూసిన తర్వాత ఆయన పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. 

అదలా ఉంటే నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ  కీలక నేతలు కోమటి రెడ్డి సోదరులు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.నిజానికి గతంలోనూ కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి, బీజేపీలో చేరుతున్నామని బహిరంగంగా ప్రకటించారు. కానీ, ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సోదరులు ఇద్దరూ బీజేపీని తెగ పొగిడేస్తున్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన ఎంపీ, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, మోడీ ఆహా .. ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అడిగిన అరగంటకే అప్పాయింట్మెంట్ ఇచ్చారని, అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని  సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగానే, కోమటి రెడ్డి సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులో సీఎం కేసీఆర్‌ వేల కోట్ల  రూపాయల అవినీతికి పాల్పడ్డారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. విచారణ సంస్థలతో ముఖ్యమంత్రి  అవినీతిని వెలికితీయాలని కోరారు. 

మరోవంక అసెంబ్లీలో తెరాస మంత్రులు తన మీద మూకుమ్మడి దాడి చేసిన సందర్భంలో సీఎల్పీ నెట్ భట్టి విక్రమార్క తనకు అండగా నిలలేదని అగ్రహంగ ఉన్న, రాజగోపాల రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని, ఆగ్రహం వ్యక పరిచారు.అదే సమయంలో, కేసీఆర్’ను ఓడించే పార్టీలోకి వెళ్తానని బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించారు. రెడ్ను రోజులక్రితం చౌటుప్పల్’లో విలేకరులతో మాట్లాడుతూ,కేసీఆర్’ను ఓడించడమే తమ లక్ష్యమని అందుకోసం అవసరం అయితే పార్టీ మారేందుకు కూడా సిద్దమని అన్నారు.అలాగే రెండేళ్లుగా తాను పార్టీ మారే విషయమై ఎన్నో కథనాలు వస్తున్నాయని గుర్తుచేసిన ఆయన  కాంగ్రెస్‌ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలతో పార్టీకి నష్టం వాటిల్లుతోందని అందుకే, పార్టీ మారే ఆలోచన చేస్తున్నానని చెప్పారు. పార్టీ మార్పుపై త్వరలో స్పష్టత ఇస్తానని వెల్లడించారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నేతలే లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. దీంతో కోమటి రెడ్డి సోదరులు కమలంవైపు చుస్తున్నారని మరోమారు స్పష్టమైందని అంటున్నారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డికి అడిగిందే తడవుగా, ప్రధాని మోడీ అప్పాయింట్మెంట్ ఇవ్వడంతో, అటు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే నని, ఇక ముహూర్తం ఖరారు కావడమే మిగిలిందని అంటున్నారు.
 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.