కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన తమ్ముడు రాజగోపాలరెడ్డి దారిలోనే నడుస్తున్నారా? లేదా నడవడానికి నిర్ణయించుకున్నారా? ఢిల్లీలో ఆయన రేవంత్ పై విమర్శల వర్షం కురిపించడం చూస్తుంటే ఔననే అనుకోవలసి వస్తోంది. కోమటి రెడ్డి సోదరులు తొలి నుంచీ రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ పదవిని ఆశించి భంగపడ్డ వెంకటరెడ్డి ఆ బాధను పంటి బిగువున భరిస్తూ వస్తున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇప్పుడు కూడా కోమటి రెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడాన్ని, కమలం గూటికి చేరడాన్ని సమర్ధిస్తూనే మాట్లాడారు.
తన తమ్ముడు తనకు ఇష్టం అయిన పార్టీలోకి వెళుతున్నారు, అది ఆయన వ్యక్తిగతం అంటూ సమర్ధించారు. అయితే తన సోదరుడిపై రేవంత్ రెడ్డి విమర్శించడాన్ని మాత్రం తప్పుపడుతున్నారు. రాజగోపాలరెడ్డిని ఆనకొండ అనడానికి రేవంత్ కు ఏం హక్కు ఉందని అంటున్నారు. హస్తినలో మీడియాతో మాట్లాడిన వెంకటరెడ్డి తన ఫోకస్ మొత్తం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించడంపైనే పెట్టారు.
కాంగ్రెస్ లో లేకుండా ఉండి ఉంటే మీరు బ్రాందీ షాపుల్లో సీతా మూతలు ఏరుకోవడానికి కూడా పని కొచ్చే వారు కాదంటూ రేవంత్ తన సోదరుడితో పాటు తననూ టార్గెట్ చేసే విమర్శించారని కోమటి రెడ్డి అన్నారు. తనకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయబోనని.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని కానీ తనను రెచ్చగొడితే మాత్రం ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంతో తనకు సంబంధం లేదన్న ఆయన పనిగట్టుకుని రేవంత్ పై విమర్శలు గుప్పించడంతోనే కోమటిరెడ్డి కూడా పార్టీని వీడతారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ వీడడానికి ముందు రేవంత్‌నే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కోమటిరెడ్డి కూడా అదే బాటలో వెడుతున్నారా అన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/komati-reddy-venkatreddy-targets-revanth-what-is-the-indication-39-141187.html
Publish Date:Sep 10, 2026
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
Publish Date:Sep 10, 2026
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.