మూడు పార్టీలకే చెమటలు పట్టిస్తున్న కోమటి రెడ్డి

Publish Date:Aug 1, 2022

Advertisement

కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి.. ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి దూకేయడానికి సిద్ధపడ్డారని అందరికీ అర్థమైంది. అయితే ఆయన ఎప్పుడు చేరుతారన్న విషయం మాత్రం తెలుగు టీవీ సీరియల్ గా  సా...గుతోంది. ఈ క్రమంలో ఆయన తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలకూ చెమటలు పట్టిస్తున్నారన్నది మాత్రం వాస్తవం. మునుగోడు అసెంబ్లీ నియోజవకర్గానికి ఉప ఎన్నిక ఖాయం అన్న వార్త ఖరారు కావాలంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటమి రెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేయాలి. ఇదిగో ఇప్పుడు, అదిగో అప్పుడూ అంటూ ఆయన రాజీనామా ముహూర్తం మాత్రం ఎప్పుడు ఖరారౌతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.  

అయితే ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, బీజేపీలకు మాత్రం చెమటలు పట్టిస్తున్నారు. ఎలాగంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామాతో జరగబోయే ఉప ఎన్నికలో విజయంపై ధీమాగా లేదు. అందుకోసం ఎలాగైనా కోటమి రెడ్డి రాజగోపాల రెడ్డిని బుజ్జగించేందుకు శతధా ప్రయత్నం చేస్తోంది.  మరొ వైపు రెండు వరుస ఉప ఎన్నికలలో పరాజయం తరువాత అధికార టీఆర్ఎస్ మరో ఉప ఎన్నికలో పరాజయాన్ని స్వీకరించడానికి రెడీగా లేదు. అందుకే మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా ఉంటే బాగుండునని భావిస్తోంది. ఒక వేళ చేసేసి ఉప ఎన్నికను అనివార్యం చేస్తారేమోనని ఆందోళన పడుతోంది. ఒక విధంగా కోమటి రెడ్డి రాజీనామా వల్ల ఉప ఎన్నికలు వస్తాయన్న భయంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు చెమటలు పట్టడాన్ని అర్ధం చేసుకోవచ్చు.

ఉప ఎన్నిక కావాలని కోరుకుంటున్న బీజేపీకీ కోమటిరెడ్డి తీరు, వైఖరి చెమటలు పట్టిస్తున్నాయి. ఎరక్కపోయి ఆయనను నమ్ముకున్నామని పార్టీ రాష్ట్ర నాయకత్వమే కాదు, అధిష్టానమూ బెంగటిల్లుతోంది. ఎందుకంటే.. రాజీనామా పేరుతో కోమటిరెడ్డి బీజేపీతో చెడుగుడు ఆడేస్తున్నారు. ఇంత కాలం రాష్ట్రంలో బీజేపీ అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు గట్టి సవాల్ విసురుతూ బలోపేతం కావడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంతే కాదు.. తన వల్లే, తన సవాల్ వల్లే కేసీఆర్ ఖంగారు పడుతున్నారనీ, తాను రంగంలో ఉంటే టీఆర్ఎస్ జీరోయే అన్న లెవల్ లో మాట్లడుతున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీతో చెడుగుడు ఆడుకుంటున్నారు. తనను సీఎం స్థాయి అభ్యర్థిగాఫోకస్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు.  కేసీఆర్‌తో బీజేపీ పక్షాన తనే యుద్ధం ప్రకటిస్తున్నానని చెప్పుకుంటున్నారు. తాను బీజేపీలో చేరడం ద్వారా  ఆ పార్టీ కేసీఆర్‌పై చేస్తున్న  యుద్ధానికి నాయకత్వం వహిస్తున్నానన్న రేంజ్ లో ఆయన మాటలు ఉన్నాయి. దీంతో కమలం పార్టీలో కలకలం ప్రారంభమయింది.  అంతే కాదు.. రాజీనామా చేసి బీజేపీలో చేరాల్సిందిగాబీజేపీ అగ్రనాయకత్వం తనను  ఆహ్వానించాలని కండీషన్ పెట్టినట్లు ఆయన ప్రకటనలు, ప్రసంగాలను బట్టి ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. దీంతో ఎరక్కపోయి కోమటి రెడ్డిని కాంటాక్ట్ చేశామని ఇప్పుడు కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.