సమస్యల పరిష్కారం.. సమూల ప్రక్షాళన .. లోకేష్ అప్పుడే మొదలెట్టేశారు!

Publish Date:Jun 19, 2024

Advertisement

యువనేత లోకేష్... రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా  బాధ్యతల స్వీకారానికి ముందే కార్యాచరణ మొదలెట్టేశారు. రాష్ట్ర ప్రజల ప్రజాదర్బార్ తో ఓవైపు నిత్యం వందలాది ప్రజలు, కార్యకర్తలు, నాయకులను కలిసి వారి కష్టాలు, సమస్యలు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా విద్యావ్యవస్థలో సమూల మార్పుల కోసం  ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఉపాధ్యాయ , విద్యార్థి సంఘాలు, తల్లి దండ్రులతో భేటీ అవ్వడానికి సమాయత్తమౌతున్నారు. విద్యావ్యవస్థలో పాతుకుపోయి ఉన్న  సమస్యల పరిష్కారం కోసం నడుంబిగించేందుకు రెడీ అయిపోయారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సైతం సిద్ధం చేశారు. పేదబిడ్డలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం,  విలువలతో కూడి విద్యనందించడం తప్ప సంబంధం లేని  పనులను ఉపాధ్యాయులకు అప్పగించరాదని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలికవసతుల కల్పన, ఏళ్లతరబడి హయ్యర్ ఎడ్యుకేషన్ లో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కష్కారం, కోర్టుల్లో ఉన్న చిక్కుముడులను తొలగించి ఫ్యాకల్టీ రిక్రూట్ మెంట్ చేయడం, చిన్నారులకు  దేశంలోనే నాణ్యమైన స్కూల్ కిట్స్ అందించి, వారిని భావిభారత పౌరులుగా తీర్చిది దిశగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. అదే విధంగా ఐటీ మంత్రిగా కూడా ఆయన రాష్ట్రంలో ఐటీకి గత వైభవం తీసుకువచ్చేందుకు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.  

2017-19 నడుమ కేవలం రెండేళ్లు   రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా లోకేష్ పనిచేసిన లోకేష్   ఆయాశాఖల్లో గతంలో ఎవరూ  చేయనంద  అభివృద్ధి చేశారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా రెండున్నరేళ్లలో 25వేల కి.మీ.ల సిసి రోడ్ల నిర్మాణం చేపట్టి రికార్డు సృష్టించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిగా యువనేత లోకేష్ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలకు గాను 2018లో ఆయనకు స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. పరిపాలనలో ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందుకు గాను డిజిటల్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు  కూడా సాధించారు. గ్రామీణ పాలనలో సాంకేతికతను విజయవంతంగా ఏకీకృతం చేయడంలో లోకేష్ చేసిన కృషిని గుర్తించి పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం ఇన్నోవేషన్ అవార్డును అందజేసింది. కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డు కూడా లభించింది.  2018 సెప్టెంబర్ లో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్  ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ వార్షిక సమావేశానికి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు.  ఇప్పుడు  రాష్ట్ర మానవవనరులు, ఐటి,ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ సారధ్యంలో ఆయారంగాలు  అనూహ్య వేగంతో పురోగతి సాధిస్తాయనడంలో సందేహం లేదు. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.