కోహ్లీ వర్సెస్ హెడ్‌.. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ లో సరికొత్త వివాదం

Publish Date:May 23, 2026

Advertisement

ఐపీఎల్ 2026లో శుక్రవారం  హైదరాబాద్ సన్ రైజర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో  హై డ్రామా చోటుచేసుకుంది.  ఈ మ్యాచ్‌లో  సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే ఈ విజయం కాదు.. అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం మాత్రం కింగ్ విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వివాదమే.  మ్యాచ్ ముగిసిన తర్వాత సాంప్రదాయకంగా ఆటగాళ్లు ఒకరికొకరు కరచాలనం చేసుకునే సమయంలో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను పూర్తిగా విస్మరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  షేక్ హ్యాండ్ కోసం ట్రావిస్ హెడ్ తన చేతిని చాచినప్పటికీ..  కోహ్లీ అతడిని కనీసం పట్టించుకోకుండా పక్కకు వెళ్ళిపోయాడు. అయితే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఇషాన్ కిషన్ వంటి ఇతర ఆటగాళ్లను మాత్రం ఆత్మీయంగా పలకరించాడు.

అయితే ఇందుకు కారణం లేకపోలేదు..  మొదటి ఇన్నింగ్స్‌లో రాసిఖ్ సలామ్ దార్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ 26 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయినప్పుడు విరాట్ కోహ్లీ ఎంతో దూకుడుగా, విపరీతమైన హావభావాలతో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆర్‌సీబీ 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఉన్నప్పుడు మూడో ఓవర్‌లో వెంకటేష్ అయ్యర్ ఫోర్లు బాదుతున్న సమయంలో విరాట్ కోహ్లీ నేరుగా ట్రావిస్ హెడ్‌ వైపు తిరిగి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. హెడ్ ఈ సీజన్‌లో ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడంపై కోహ్లీ,  ఇంపాక్ట్ సబ్ సైన్ చేసి, గ్రౌండ్‌లో మాటలు చెప్పడం కాదు ధైర్యముంటే వచ్చి బౌలింగ్ వేయాలంటూ సవాల్ విసిరాడు. ఈ స్లెడ్జింగ్‌కు హెడ్ కూడా గట్టిగానే బదులిచ్చాడు, నువ్వు నేను బౌలింగ్‌కు రాకముందే అవుట్ అయిపోతావు అంటూ కౌంటర్ ఇచ్చాడు.

ఈ మాటల యుద్ధం తరువాత కోహ్లీ..   11 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి  ఔటయ్యాడు. కోహ్లీ అవుట్ అయినప్పటికీ.. మ్యాచ్ ముగిసే సమయానికి హెడ్ నిజంగానే బౌలింగ్‌కు వచ్చాడు. 19వ ఓవర్‌లో బంతిని అందుకున్న హెడ్, అద్భుతంగా ఆడుతూ 56 పరుగులు చేసిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ను అవుట్ చేసి మ్యాచ్‌ను పూర్తిగా ఎస్ఆర్హెచ్ వైపు తిప్పాడు.  మొత్తం మీద.. ఇరువురి మధ్యా వివాదం విషయం ఎలా ఉన్నా..  హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా కోహ్లీ తప్పుకోవడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని నెట్టింట వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.  

By
en-us Political News

  
పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు గుజరాత్ పై ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కదం తొక్కారు.
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
వైజాగ్ బీచ్‌లో అరుదైన వింత.. సముద్రాన్ని ముద్దాడిన ఆకాశం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వేతన సవరణ ఉత్తర్వులు చివరకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
కడప రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
నేటి ఆధునిక కాలంలో పెళ్లి అనేది నూరేళ్ల పంట అనుకుంటారు.
తనకు భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రొఫెసర్ నాగేశ్వర్‌ కలిశారు.
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.