అది లేకుంటే సీను సితారే

Publish Date:Jun 15, 2023

Advertisement

ఏదైనా తప్పు చేయాలంటే.. మనిషికి గుండె ధైర్యం ఒక్కటే ఉంటే సరిపోదు. ఓ వేళ మనం నేరం చేసినట్లు వెలుగులోకి వచ్చినా.. పోలీసులు అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టినా.. బెయిల్ ఇచ్చి బయటకు తీసుకు వచ్చే అండ దండా అయిన వారు బలంగా.. బలగంగా.. ఎవరో ఒకరు ఉండాలి. అలా కాకుంటే హత్య కేసులోనో, దాడి కేసులోనో మనం అరెస్ట్ అవుతామని ముందే తెలిస్తే... పనులన్నీ పక్కన పెట్టి.. ఆగ మేఘాల మీద ప్రత్యేక విమానంలో దేశ రాజధాని హస్తినకు వెళ్లి కేంద్రంలోని పెద్దలకు శాలువా కప్పి.. తిరుమల శ్రీవారి చిత్రపటంతోపాటు.. స్వామిలోరి కల్యాణం లడ్డు ప్రసాదంగా ఇస్తే.. ఆ దేవదేవుడి చిత్ర పటం సాక్షిగా అడిగిన కోరికలే కాదు.. మన మనస్సులోని కోరికలు సైతం వాళ్ల మనస్సుతోనే తెలుసుకొని.. మనకు, మనవారికి రక్షణగా చక్రం అడ్డు వేస్తారనేందుకు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకొంటున్న పరిణామాలే సజీవ సాక్ష్యం. 

ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. అటు ఏపీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.. నేటికి అరెస్ట్ కాలేదు. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలుమార్లు ఢిల్లీలో ఈడీ విచారణకు సైతం హాజరయ్యారు. కానీ ఆమె నేటికి అరెస్ట్ కాకపోవడం గమనార్హం.  

ఉంటే గింటే ఈ విధంగా ఉండాలి. అలా అయితేనే మీడియాలో హైప్ ఉంటుంది. అందుకు తగ్గట్లుగా ప్రచారం సైతం ఊపందుకొంటుంది. 

అయితే 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్ట్ సాక్షిగా నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై శ్రీను అనే వ్యక్తి కోడి కత్తితో దాడి చేశాడు. ఆ కేసు విచారణ ఎన్ఐఏ కోర్టులో ఈ రోజు అంటే జూన్ 15వ తేదీన జరగనుంది. ఈ సందర్బంగా కోడికత్తి శ్రీను.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. తాను 1,610 రోజులుగా బెయిల్ లేకుండా జైల్లోనే ఉన్నట్లు పేర్కొన్నాడు. అలాగే తాను ఇంకా ఎంత కాలం.. ఈ జైలు జీవితం గడపాలో తెలియడం లేదని.. విముక్తి కలిగించాలని విన్నవించుకొన్నాడు. అదేవిధంగా తనకు న్యాయం చేయాలని అనేక మార్లు కోర్టును కోరినా.. ఫలితం లేకపోయిందని.. అందుకే మీకు లేఖ రాయాల్సి వచ్చిందని సదరు లేఖలో కోడికత్తి శ్రీను పేర్కొన్నట్లు సమాచారం.

అయితే కోడికత్తి శ్రీనుకు బెయిల్ రాకపోవడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం వైయస్ జగన్.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి ఎన్ఐఏ కోర్టు... 10 కిలో మీటర్ల దూరం కూడా ఉండదని.. కానీ ఆయన ఈ కేసులో కోర్టుకు హాజరు కారనే ఆరోపణలు సైతం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కేవలం 15 నిమిషాలు.. సీఎం వైయస్ జగన్ సమయం కేటాయిస్తే.. సరిపోతోందని వాదనలు సైతం వస్తున్నాయి. అయితే వైయస్ జగన్ ఉద్దేశ పూర్వకంగానే తన న్యాయవాదులతో పిటిషన్లు వేయించి.. కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్ఐఏ అధికారుల సుస్పష్టం చేసిన విషయం విధితమే.    

వైయస్ఆర్ తనయుడు వైయస్ జగన్.. ముఖ్యమంత్రి కావడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం వస్తుందని భావించి.. ఆ క్రమంలో వైయస్ జగన్‌పై దాడి చేస్తే.. ఆయనకు ప్రజల్లో సింపతి వస్తుందని భావించి.. ఆ క్రమంలో దాడి చేసిన.. ఎరక్కపోయి దాడి చేసి జైల్లో ఇరుక్కుపోయిన శీను బాబు లాంటి వారు.. జీవిత కాలం బెయిల్ రాకుండా... జైల్లోనే ఉండిపోయినా.. ఏ మాత్రం ఆశ్చర్యపడనక్కర్లేదేనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.