కోడి.. కత్తి..జగన్

Publish Date:Aug 1, 2023

Advertisement

కోడికత్తి  కేసులో కుట్ర కోణం లేదని జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) స్పష్టం చేసింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ జగన్ ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరింది. ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదనీ.. ఇదంతా సమయం వృధా వ్యవహారమనీ ఎన్ఐఏ కుండ బద్దలు కొట్టేసింది. అయినా ఆ కేసును ఇప్పుడు విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదలీ అయ్యింది. కేసులో వాదనలు 80 శాతం పూర్తైన తరువాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీను గత ఐదేళ్లుగా బెయిలు కూడా దొరకకుండా జైళ్లో మగ్గుతున్నాడు. 
అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించక తప్పదు.. మాజీ మంత్రి, మాజీ ఎంపీ తన సొంత ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఒంటిపై గాయాలకు కుట్లు వేసి బ్యాండేజీలు కట్టి హత్య కాదు గుండెపోటు అని నమ్మించడానికి విఫలయత్నం చేశారు. ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ గత నాలుగేళ్లుగా కనీసం అరెస్టు కాకుండా హాయిగా తిరుగుతున్నారు. అరెస్టు చేస్తాం అని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు చెప్పింది. అయినా ఆయనకు ముందస్తు బెయిలు వచ్చింది. హత్యకు గురైన మాజీ మంత్రి, మాజీ ఎంపీ స్వయానా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాబాయ్. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ.. జగన్ కు సోదరుడు.    బెయిలు కోసం ఎన్ని సార్లు కోర్టును వేడుకున్నా,   బెయిల్  దక్కదు.  ఎందుకంటే ఎన్ఐఏ కేసు. ఉగ్రవాదుల కుట్రలను దర్యాప్తు చేసే జాతీయ దర్యాప్తు సంస్థ కోడి కత్తి కేసు విచారణ చేస్తున్నది.  కోడి కత్తితో దాడికి గురైన వ్యక్తి అప్పటి విపక్ష నేత, ప్రస్తుత సీఎం. దీంతో ఈ కేసు విచారణ ముందుకు సాగడం లేదు. కేసు పూర్తయితే నాడి దాడి గుట్టు రట్టౌతుందన్న భయమే ఇందుకు కారణమంటూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.  కానీ అప్పట్లో అంటే కోడికత్తితో జగన్ పై విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన దాడి వెనుక అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం కుట్ర ఉందంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు.

అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి జరిగిందన్న సాకుతో ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్నారు.  అయితే అప్పట్లో కేవలం ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చేసిన అప్పటి విపక్ష నేత మాత్రం ఆ తరువాత జరిగిన ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయినా.. తనపై కుట్ర పూరితంగా జరిగిన హత్యాయత్నం కేసు త్వరిత గతిన విచారించి కుట్రదారులకు శిక్ష పడాలని కోరుకోవడం లేదు.  కేసు దర్యాప్తు సజావుగా సాగి తీర్పు వెలువడితే.. రాజకీయంగా ఇబ్బందులు ఎదురౌతాయన్న జంకుతో  దర్యాప్తునకు సహకరించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తులో భాగంగా దాడికి పాల్పడిన జనుపల్లి శ్రీని తెలుగుదేశం సానుభూతి పరుడు కాదని ఎన్ఐఏ తేల్చేసింది.

పైపెచ్చు నిందితుడే స్వయంగా తాను వైసీపీ సానుభూతి పరుడిననీ, స్వల్పంగా గాయపడేలా దాడి చేస్తే సానుభూతి పవనాలు వీచి జగన్ పార్టీ విజయం సాధిస్తుందన్న ఉద్దేశంతోనే కోడి కత్తితో దాడి చేశాననీ దర్యాప్తులో విస్పష్టంగా చెప్పడం జరిగింది. సరే అదంతా పక్కన పెడితే బాధితుడిగా సీఎం జగన్ కోర్టుకు హాజరు కావాలని కోర్టు విస్పష్టంగా ఆదేశించింది. ఆయన కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇస్తే తప్ప నిందితుడికి బెయిలు వచ్చే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇంత క్రిస్టల్ క్లియర్ గా వివరాలు ఉన్నా ఎన్ఐఏ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందనీ, కోడి కత్తి కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపాలంటూ జగన్ ఎన్ఐఏ కోర్టును కోరారు.

ఒక వైపు ఈ కేసులో కుట్ర కోణం లేదనీ లోతైన దర్యాప్తు అవసరం లేదనీ ఎన్ఐఏ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో కేసు విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదలీ అయ్యింది. దీనిపై జనుపల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో వాదనలు దాదాపుగా పూర్తి అయిన సమయంలో కేసు వేరే ప్రాంతానికి బదిలీ చేయడం సరికాదని అన్నారు. అయితే ఈ కేసు విషయంలో న్యాయం తన క్లయింట్ వైపే ఉందనీ ఎక్కడైనా మా వాదనలు పూర్తిస్థాయిలో వినిపిస్తామనీ స్పష్టం చేశారు. అయినా ఈ కేసు కొలిక్కి రావాలంటే జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందేనన్నారు.

ఇక విపక్షాలు మాత్రం కోడి కత్తి కేసులో కుట్రకోణం కాదు అసలా కేసే ఒక కుట్ర అంటూ ఆరోపణలు చేస్తున్నాయి.  వాస్తవానికి నాడు విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత జగన్ పై ఎలాంటి దాడీ జరగలేదనీ, కేవలం సానుభూతి కోసం ఆడిన నాటకం మాత్రమేనని అంటున్నాయి.   

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.