విశాఖ జైల్లో మొద్దు ‘సీన్’?!

Publish Date:Sep 7, 2023

Advertisement

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా  2019 ఎన్నికల ముందు   అప్పటి  ప్రతిపక్షనేత   జగన్‌పై కోడికత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ.. దాదాపు నాలుగున్నరేళ్లుగా జైల్లో ఉన్న కోడికత్తి శ్రీను ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే ఓచర్చ పోలిటికల్ సర్కిల్‌‌లో సాగుతోంది.  కోడి కత్తి దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ కుమారుడిని బెయిల్‌పై విడిపించాలంటూ కొడికత్తి శ్రీను తల్లిదండ్రులు ఇప్పటికే పలుమార్లు   జగన్ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొన్నారు.  అలాగే ఈ అంశంపై సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి   వారు స్వయంగా వెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ విషయాలన్నిటిపైనా రాజకీయ పరిశీలకులు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. బాధితుడిగా కోర్టుకు హాజరు కావడానికి జగన్ ఎందుకు ఇష్టపడటం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. 

మరోవైపు.. కోడికత్తి శ్రీను కూడా మొద్దు శ్రీనులాగానే హత్యకు గురయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య చేసిన మొద్దు శ్రీను..  ఆ తర్వాత అనంతపురం జైల్లో శిక్ష అనుభవిస్తూ... అదే  జైల్లో ఉన్న ఓం ప్రకాశ్ చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి రాజకీయ వర్గాల చర్చల్లో  ప్రస్తావనకు వస్తోంది. అదే తరహాలో కోడికత్తి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జనపల్లి శ్రీను  సైతం జైల్లోనే హత్యకు గురయ్యే అవకాశాలు ఉన్నాయన్న అనుమానం ఆ చర్చల్లో బలంగా వ్యక్తమౌతోంది.

మరోవైపు బుధవారం(సెప్టెంబర్ 6)  విశాఖపట్నం కోర్టు వద్ద ఈ కేసులో నిందితుడి తరఫు న్యాయవాది అబ్దుల్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు   జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని చెప్పిన రోజు.. వైసీపీ నేతలు తప్పించి మరెవరూ  ప్రత్యక్ష సాక్షులుగా (ఐ విట్నెస్‌లు) లేరని,  అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్, సెక్యూరిటీ అధికారులు.. తాము ఈ దాడిని చూడలేదని చెప్పారన్నారు.  

ఆయితే ఆ రోజు కోడికత్తి బొత్స సత్యనారాయణ సమీప బంధువు మజ్జి శ్రీను వద్ద మాత్రమే ఉందని... ఏపీ పోలీసుల మీద నమ్మకం  లేదంటూ మందుగా కోడికత్తి సమర్పించలేదన్నారు. ఈ కేసులో కర్మ కర్త క్రియా అన్నీ మజ్జి శ్రీనివాసేనని కోడికత్తి శ్రీను తరఫు న్యాయవాది ఆరోపించారు. ఆ సమయంలో మజ్జి శ్రీను.. తన పోనును పోలీసులు అడిగితే.. ఎందుకు డిపాజిట్ చేయలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఉద్దేశపూర్వకంగానే జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనుపై కేసుపెట్టారన్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని.. వాటిని సమయం వచ్చినప్పుడు బయట పెడతానని అబ్దుల్ సలీం స్పష్టం చేశారు. 

 హరీశ్ సాల్వే వివాహానికి హాజరయ్యేందుకు లండన్ కు వెళ్లే తీరిక ఉన్న జగన్ కు.. కోడికత్తి కేసులో బాధితుడిగా విశాఖకు వచ్చే పాటి తీరిక లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. ఒక ఎస్సీ యువకుడు నాలుగున్నరేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నా? తనపైనా దాడి జరిగిందని స్వయంగా ఫిర్యాదు చేసి పట్టుబట్టి మరీ  ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్న జగన్ బాధితుడిగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకుండా ఉండటం ఎంత మాత్రం సరికాదని ఆయన పేర్కొన్నారు.  జగన్ పై కోడికత్తి దాడి జరిగినప్పుడు జనుపల్లి శ్రీనివాస్ ఫుడ్ కోర్టులో అనుమతితోనే పని చేస్తున్నాడని అయితే ఆ రోజు  ఐదుగురు వైసీపీ నేతలు పాస్‌లు లేకుండానే  విమానాశ్రయంలోకి ప్రవేశించిన విషయాన్ని కోర్టు ముందుంచామని చెప్పారు.  అలాగే కోడికత్తి దాడి జరిగిన రోజు.. పోలీస్ స్ట్రైకింగ్ ఫోర్స్ జీపుపై  దాడి చేసిన వైసీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.  

2023 ఆగస్ట్ వరకు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి దాడి కేసు విచారణ జరిగింది. ఇటీవలే  ఆ కేసును విశాఖకు బదిలీ చేశారు. ఆ క్రమంలో కోడికత్తి శీను  ఇన్నాళ్లు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి  ప్రతీ వాయిదాకు  విశాఖకు తీసుకు రావడం కష్టమన్న ఉద్దేశంతో అతడిని  విశాఖ సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్టును ఎన్ఐఏ  అభ్యర్థనను కోర్టు అంగీకరించడంతో . కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇంకోవైపు.. విశాఖ సెంట్రల్ జైల్లో ఇటీవల మత్తు పదార్థాల కలకలం సృష్టించిన విషయం విదితమే. 

కోడికత్తి కేసు ఏళ్ల తరబడి ముందుకు సాగకపోవడం ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం వైయస్ జగన్ కోర్టుకు హాజరు కాకపోవడం చూస్తుంటే.. పరిటాల రవి హత్య కేసులో జరిగిన విధంగానే  మొద్దు శ్రీను సీను విశాఖ జైల్లో రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.  

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.