కొడాలి నాని ఈజ్ బ్యాక్.. కానీ ఆ పాత ఫైర్ ఏదీ!

Publish Date:May 28, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  కొడాలి నాని మళ్లీ వార్తల్లో నిలిచారు. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు   క్రియాశీల రాజకీయాలకు,  దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల ఆయన మళ్లీ ప్రజల ముందుకు రావడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయన తాను సుదీర్ఘ కాలం రాజకీయాలకు దూరంగా ఉండటానికి కారణం వెల్లడించారు.  

తన రాజకీయ అజ్ఞాతవాసానికి   తనకు జరిగిన బైపాస్ సర్జరీయే కారణమన్నారు. సర్జరీ తరువాత  కనీసం 6 నెలలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడం వల్లనే తాను గుడివాడకు, రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు.   ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే తాను బయటకు రాలేకపోయానని, రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని  కొడాలి నాని చెప్పారు.   వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం (మే 27) మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ సందర్భంగా ఆయన  శైలి గతానికి పూర్తి భిన్నంగా కనిపించింది. సాధారణంగా కొడాలి నాని,  చంద్రబాబు,  ఆయన కుటుంబ సభ్యుల పట్ల తీవ్రమైన ద్వేషంతో  మాట్లాడతారు. చంద్రబాబు తనకు వ్యక్తిగత శత్రువు అన్నట్లుగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. చంద్రబాబుపై విమర్శలకు ఆయన అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తుంటారు. కానీ బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అటువంటిదేదీ కనిపించలేదు. ఎవరో ఒత్తిడి చేయడం వల్ల మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా అనిపించేలా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంది. 

ఏదో నామ్ కే వాస్తే విమర్శలు చేసినట్లుగా అనిపించింది తప్ప.. గతంలో ఆయన మాటల్లో ఉన్న కసి, ఆవేశం ఇసుమంతైనా కనిపించలేదు.  జగన్ లేదా వైసీపీ అగ్రనేతల ఒత్తిడి కారణంగానే ఆయన మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేసినట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.