కేబినెట్ నుంచి కొడాలి నాని అవుట్.. అందుకేనా?

Publish Date:Mar 31, 2022

Advertisement

ముఖ్యమంత్రి వైయస్ జగన్... తన మలి కేబినెట్‌ కూర్పు అంతా ఓకే అయిందని సమాచారం. అయితే ఆ కేబినెట్‌లోని మంత్రుల జాబితాలో నుంచి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు తొలగించినట్లు తెలుస్తోంది. కేబినెట్ కూర్పుపై పార్టీలోని పలువురు సీనియర్లతో సీఎం జగన్ పలుమార్లు భేటీ కావడం.. ఆ క్రమంలో కొత్తగా కొలువులు పొందుతున్న వారి వివరాలపై పూర్తిగా తర్జన భర్జనలు చేసిన తర్వాతే సీఎం జగన్ ఓకే చేశారని సమచారం. అయితే చిట్టచివరి నిమిషంలో ప్రస్తుత మంత్రి కొడాలి నాని పేరును ఆ జాబితా నుంచి తొలగించారట. అసలు అయితే.. జగన్ అధికారంలోకి రాగానే.. కొడాలి నానికి పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అ నాటి నుంచి నేటి వరకు కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టారంటే..  టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌తోపాటు ఆ పార్టీలోని కీలక నేతలపై బండ బూతులతో విరుచుకు పడతారనే టాక్ అయితే ప్రజల్లో సర్వ సాధారణమై పోయింది. ఈ రెండున్నరేళ్లలో కొడాలి నాని ప్రెస్‌మీట్ అంటే.. చంద్రబాబు అండ్ కోకు బ్యాండ్ బాజా అని మీడియా వారికే సైతం పక్కా క్లారిటీగా అర్థమైపోయింది. 

ఈ నేపథ్యంలో సీఎం జగన్.. తన కేబినెట్ నుంచి ఎవరిని బయటకు పంపినా.. కొడాలి నానికి మాత్రం కొత్త కేబినెట్‌లో  కూడా బర్త్ కన్‌ఫార్మ్ అని.. మరో రెండున్నరేళ్లు మంత్రిగా కొడాలి నాని హావా కొనసాగుతోందనే చర్చ అయితే అటు తాడేపల్లి ప్యాలెస్‌లో.. ఇటు గుడివాడ నియోజకవర్గంలో కూడా వైరల్ అయింది. ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. 

జగన్ కేబినెట్‌లో చంద్రబాబు అండ్ కోని టార్గెట్ చేయాలంటే.. అందుకు కొడాలి నానినే కరెక్ట్ పర్సన్ అన్న సంగతి ఫ్యాన్ పార్టీలోని నేతలందరికీ తెలుసు.  అలాంటిది.. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగిస్తారంటూ ప్రచారం జరగడం పట్ల ఆయన సహచర మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి నానికి సీఎం జగన్ ఎందుకు చెక్ పెడుతున్నారంటే.. ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే గుడివాడలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొడాలి నానిని మంత్రుల జాబితాలో నుంచి సీఎం జగన్ తొలగించారనే టాక్ అయితే ప్రస్తుతం హాట్ హాట్‌గా ఓ చర్చ అయితే  నడుస్తోంది.  

గుడివాడ పట్టణంలో ఇటీవల మున్సిఫల్ వైస్ చైర్మన్ ఆడపా బాబ్జీ మృతి చెందారు. అయితే ఆయన మృతికి మంత్రి కొడాలి నానినే కారణమనే టాక్ కూడా పట్టణంలో ఉంది. అంతేకాదు.. 2014 ఎన్నికల్లో కొడాలి నాని గెలుపు కోసం.. ఆడపా బాబ్జీ బావమరిది వంకా విజయ్ కోట్లు కుమ్మరించడం.. ఆ తర్వాత కొడాలి నాని .. అతడినికి నగదు చెల్లించకపోవడం.. ఆ క్రమంలో అతడు ఆత్మహత్య చేసుకోవడం..  అతడు తన ఆత్మహత్యకు ముందు కొడాలి నానినే తన ఆత్మహత్యకు కారణమంటూ సూసైడ్ నోట్ రాయడం.... ఆ తర్వాత ఈ సూసైడ్ నోట్‌ను కొడాలి నాని అండ్ కో సైడ్ చేసిందని.. ఆ తర్వాత ఆ నగదంతా అడపా బాబ్జీనే చెల్లించడం.. అనంతరం ఆడపా బాబ్జీ కూడా కొడాలి నానికి భారీ మొత్తంలో నగదు ఇవ్వడం.. అవి కూడా మంత్రి నాని చెల్లించకపోవడంతో.. బాబ్జీ తీవ్ర మనోవేదనకు గురై మరణించినట్లు పట్టణంలో ఓ టాక్ అయితే షికార్ చేస్తోంది. ఆ క్రమంలో ఆడపా బాబ్జీ మృతికి నీవే కారణమంటూ.. గుడివాడలో ఓ యువకుడు సాక్ష్యాత్తూ మంత్రి నాని కాలర్ పట్టుకోవడం.. అక్కడే ఉన్న భద్రత సిబ్బంది వెంటనే స్పందించి.. సదరు యువకుడిని మంత్రి కొడాలి నాని నుంచి దూరంగా పంపడం అంతా క్షణాల్లో జరిగిపోయిందట. అయితే ఇదే విషయాన్ని ప్రతిపక్ష టీడీపీ అయితే ప్రెస్‌మీట్ పెట్టి.. మరీ  కొడాలి నాని దీనిపై స్పందించాలంటూ డిమాండ్ కూడా చేసింది. అదీకాక.. గుడివాడ పట్టణంలోని యువతపై ఆడపా బాబ్జీకి మంచి పట్టు ఉంది. అతడి మాటే వారికి వేదం.. ఎన్నికల్లో అతడు ఏ పార్టీ వైపు పని చేయమంటే.. ఆ పార్టీకి యుద్ధ సైనికుల్లా పని చేసేందుకు ఆ యువతంతా సమాయత్తమవుతోంది. 

అలాంటి ఆడపా బాబ్జీ ఆకస్మిక మరణంతో.. యువతను గైడ్ చేసే నాయకుడే లేకుండా పోయారనే చర్చ గుడివాడలో సాగుతోంది. మరోవైపు బాబ్జీ మృతితో పట్టణ యువతలో అప్పుడే గ్రూపులు మొదలైయ్యాయనే చర్చ కూడా నడుస్తోంది. అదీకాక.. గుడివాడ పట్టణ ప్రాంతంలో యువత ఓట్లే అభ్యర్థి గెలుపును నిర్దేశిస్తాయి. ఈ నేపథ్యంలో ఆ ఓట్లు భారీగా చీలిపోయే అవకాశాలున్నాయని.. పట్టణంలోని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని.. ఆ క్రమంలో కొడాలి నాని.. పరిస్థితి ఘోరంగా మారే అవకాశం లేకపోలేదని సమాచారం. అలాంటి పరిస్థితుల్లో కొడాలి నానిని మంత్రి వర్గంలో ఉంచే కంటే.. నియోజకవర్గంలో యువత ఓట్లు చీలకుండా ఉండేలా.. రానున్న ఎన్నికల్లో పార్టీని మరింత పటిష్టంగా చేసేందుకు ప్రయత్నించాలని కొడాలి నానికి సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.