కిషన్ ఇన్.. బండి ఔట్.. బీజేపీలో ప్రక్షాళన ఇదేనా ?

Publish Date:Jul 4, 2023

Advertisement

బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం బండి సంజయ్ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర నాయకత్వంలో బీజేపీ హైకమాండ్‌ పెను  మార్పులు చేస్తుండటం ఎలాంటి ఫలితాన్నిస్తుందన్న ఉత్కంఠ వ్యక్తమౌతోంది.  

తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన తథ్యమని గత కొంత కాలంగా గట్టిగా వినిపిస్తోంది. బండి సంజయ్ స్వయంగా తాను మోడీ పర్యటన నాటికి బీజేపీ రాష్ట్ర చీఫ్ గా ఉండే అవకాశం లేదని  కార్యకర్తలతో గతంలోనే చెప్పేశారు. ఇప్పటి వరకు తెలంగాణ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ ను క్యాబినెట్ లోకి తీసుకొని.. ఇక్కడ రాష్ట్ర నాయకత్వాన్ని కిషన్ రెడ్డికి అప్పగించనున్నారని రాజకీయ వర్గాలు బలంగా చెప్తున్నాయి. అయితే  సోమవారం ( జూలై 3) కేబినెట్ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎటువంటి చర్చా జరగలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 8 నెలల ముందు బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తూ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమనే చెప్పాలి. గతంలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ బండిని మార్చే ప్రశక్తేలేదని చెప్పిన సంగతి తెలిసిందే.  మొత్తం మీద రాష్ట్ర బీజేపీలో సమూల  ప్రక్షాళన  జరిగితేనే పార్టీకి ఉనికి ఉంటుందని హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు తాజా నిర్ణయంతో తేటతెల్లమైంది.  కాగా రాష్ట్ర బీజేపీలో  భారీ మార్పుల గురించి ఇటీవల కొంత కాలంగా వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.  ఈటెల రాజేందర్ కు బీజేపీ ప్రచార సారధ్య బాధ్యతలు అప్పగించవచ్చని చెప్తున్నారు.  

కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవిని వదులుకుని పార్టీ రాష్ట్రఅధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు పెద్దగా సుముఖత చూపకుంటే.. ఆయనను  కేవలం పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలకు పరిమితం చేయకుండా బీజేపీ తన సంస్కృతిని పక్కనపెట్టేసి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే  అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మొత్తంగా తెలంగాణలో అధికారం మాదే అనే స్థాయి నుంచి పార్టీని కాపాడుకుంటే చాలన్న స్థాయికి బీజేపీ దిగజారిందని ఇటీవలి పరిణామాలను బట్టి అర్ధమౌతోంది. మరింత దిగజారకముందే పార్టీలో ధిక్కారాన్ని అణచివేసి మళ్లీ పార్టీని విజయం దిశగా నడిపించేందుకు బీజేపీ హై కమాండ్ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.  అయితే కేవలం నాయకత్వ మార్పుతోనే  బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా? అంటే పరిశీలకులు అనుమానం అనే అంటున్నారు. 

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.