కిరణ్ కాంగ్రెస్ కోసం రెబల్స్ ఎదురుచూపులు

Publish Date:Dec 31, 2013

Advertisement

 

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ మొన్ననే మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పుకొన్నారు. కనీసం 25మంది శాసనసభ్యులు మరో కొందరు మంత్రులు కూడా త్వరలోనే పార్టీలో నుండి వేరే పార్టీలలోకి జంప్ అయిపోనున్నారని బల్లగుద్దీ మరీ చెప్పారు. అయితే వారిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారా లేదా? అనే సంగతి కూడా చెప్పి పుణ్యం కట్టుకొని ఉంటే, ఆయన కొత్త పార్టీ పెడతారని ఆశగా ఎదురుచూస్తున్నవారి నోట్లో పంచదార పోసినట్లయ్యేది.

 

వారిలో చాలా మంది తమకు సరిపడని జగన్మోహన్ రెడ్డితోనో, లేక తమ రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబుతోనో సర్దుకుపోవడం కంటే, ఒకటే బ్లడ్ గ్రూప్, ఒకటే బ్లడ్ కల్చర్, ఒకటే డీ.యన్.యే. ఉన్న కిరణ్ కుమార్ రెడ్డితోనే సర్దుకుపోవడమే సులువని భావిస్తు, జనవరి23 ముహూర్తం కోసం కళ్ళు కాయలు కాసేలా, చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు పాపం.

 

చివరికి రాయపాటి, లగడపాటి, ఉండవల్లి వంటి సీనియర్ రాజకీయ నేతలు కూడా ఎంతసేపు కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే అందులో ఎక్కి ఈ ఎన్నికల వైతరిణిని దాటేద్దామని ఆశపడుతున్నారు తప్ప వారిలో ఎవరూ కూడా స్వయంగా పార్టీ పెట్టే ఆలోచన చేయడం లేదు. తమకంటే చాలా జూనియర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే, ఆయన క్రింద ఇంతమంది సీనియర్లు పనిచేసేందుకు సిద్దపడుతుండటం చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇదంతా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డితో సహా అందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకొంటున్నారనే అనుమానం కలుగుతోంది.

 

రాష్ట్ర విభజన చేస్తే సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేఖత ఎదురవుతుందని, దానివల్ల పార్టీకి తీవ్రంగా నష్టం కలుగుతుందని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకపోదు. బహుశః అందుకే రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ “పార్టీని రెండు ప్రాంతాలలో ఏవిధంగా గెలిపించుకోవాలో మాకు తెలుసు. అందుకు తగిన వ్యూహాలు మావద్ద ఉన్నాయని” ధీమా వ్యక్తం చేసారు.

 

ఇంతవరకు ఈ కాంగ్రెస్ అధిష్టాన వ్యతిరేఖ వర్గమంతా కలిసి రాష్ట్రవిభజనకు పూర్తి సహకారం అందించారు. జనవరి23తో అధిష్టానం తమకు అప్పజెప్పిన ఆ పని కూడా పూర్తి చేసిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ తిరుగుబాటుదారులందరూ కొత్త జెండా పట్టుకొని ఎన్నికలలో పోటీచేయడం, కాంగ్రెస్ వ్యతిరేఖతను ఓట్లుగా మలచుకొని ఎన్నికలలో గెలిచిన తరువాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడమే ఆ వ్యూహం అయ్యిఉండవచ్చును.

 

ఆ ప్రయత్నంలో భాగంగానే వారందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానం తమను, ప్రజలను కూడా చాలా అన్యాయం చేసిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితమయిపోతుందని అంటూ కాంగ్రెస్ ను తిట్టిపోస్తూ ప్రజల సానుభూతిని, కాంగ్రెస్ పట్ల వ్యతిరేఖతను పెంచి పోషిస్తున్నారు. అందరూ కలిసి పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నా కూడా పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ ఎవరిమీద మీద ఇంతవరకు ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం ఈ అనుమానాలను దృవీకరిస్తోంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళందరూ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు తప్ప సోనియాగాంధీని విమర్శించడం లేదు. పార్టీలో అందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని బొత్స వారిని వెనకేసుకొని వస్తున్నారు. అంటే కిరణ్-కాంగ్రెస్ లో జేరెందుకు ఆలోచిస్తున్నవారు మాత్రం నేటికీ పార్టీ క్రమశిక్షణ అధిగమించడం లేదని, వేరే పార్టీలలో టికెట్స్ ఖరారు చేసుకొన్నవారే కాంగ్రెస్ పార్టీని, అధిష్టానాన్నికించపరుస్తున్నారని అర్ధం అవుతోంది. బహుశః అందుకే జేసీ దివాకర్ రెడ్డికి షో-కాజ్ నోటీసులు జారీచేసారు. మిగిలిన వారు పార్టీకి ఎంత నష్టం కలిగిస్తున్నాదానిని అభిప్రాయ వ్యక్తీకరణ పద్దులో వ్రాసి అడ్జస్ట్ చేస్తున్నారు. బహుశః జనవరి23 తరువాత కిరణ్ కొత్త పార్టీ పెట్టగానే, అప్పుడు బొత్ససత్యనారాయణ వారందరి మీద మూకుమ్మడిగా క్రమశిక్షణ చర్యలు తీసుకొంటారేమో!

By
en-us Political News

  
అసోంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చిరపుంజిలో ప్రకృతి సోయగాలకు మైమరిచిపోయారు.
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నారై టీమ్ ఆధ్వర్యంలో పలు నగరాల్లో అంగరంగ వైభవంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు కేట్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
రాష్ట్రంలో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక వేడి రాజుకుంది. ఎన్నికల బరిలో ప్రధానంగా బీజేపీ, ఎంఐఎం ఉన్నాయి. ఈ ఎలక్షన్‌లో మజ్లిస్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వనుట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎవరికీ ఓటు వేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో మజ్లిస్‌కు పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. బలం లేకపోయినా పోటీ ఏకగ్రీవం కావడం కోసం కమలం పార్టీ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు గులాబీ పార్టీ నేతలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విప్ జారీ చేస్తామని హెచ్చరించారు. పార్టీ విప్ ధిక్కరిస్తే వేటు తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ వద్దు ఎంఐఎం వద్దని ఇరు పార్టీలకు సమదూరం పాటించాలని కేటీఆర్ ఆదేశించారు.
ఏపీలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై సిట్‌ అధికారుల విచారణ ముగిసింది. విజయవాడ సిట్ ఆఫీసులో మిథున్‌రెడ్డిని దాదాపు 8 గంటల పాటు సిట్‌ అధికారుల బృందం విచారించింది. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి సంతకాలు తీసుకుంది. వివిధ అంశాలపై ఆరా తీసిన అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరోసారి ఆయన్ను పిలిచే అవకాశముంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, మిథున్‌రెడ్డి ప్రమేయం, డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం కొనుగోళ్లపై సుదీర్ఘంగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
అనుకున్నట్టే జరిగింది... విశాఖ కార్పొరేషన్ తెలుగుదేశం కూటమి వశం అయింది. మాజీ మంత్రులు బొత్ససత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ఎత్తులు చిత్తయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో అమాయకపు బీసీ మహిళ బలయ్యారు. సొంత పార్టీ కార్పొరేటర్లే ఎదురుగా తిరగడంతో ఆ పార్టీ పరువు మరోసారి గంగలో కలిసింది.
హైదరాబాద్ హఫీజ్ పేటలో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చెందిన ఆఫీసును పోలీసులు భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేసింది. హఫీజ్‌పేట్​లోని సర్వే నెంబర్ 79లోని 39 ఎకరాల భూమిలో ఓ ప్రైవేట్ సంస్థ భారీ షెడ్ ఏర్పాటు చేసి నూతన కార్యాలయం చేపట్టడంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు శనివారం రోజున కూల్చివేతలు చేపట్టారు. దీనిపై ఎమ్మెల్యే వసంత కృష్ణ మాట్లాడుతు మాకు ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని అన్నారు.
అవును. ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జి షీట్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను ఎ1,ఎ2గా పేర్కొన్న నేపధ్యంలో గాంధీలు జైలుకు వెళతారా? అనే ప్రశ్న దేశంలో ప్రముఖగా వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 75 పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నాయకులంతా వారి ప్రాంతాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని కోరారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకోవాలన్నారు. అన్ని మతాల వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలుగా ఉన్నారన్న ఆయన.. మసీదులు, చర్చిల్లోనూ ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.
మే 7 నుంచి మే 31 వ‌ర‌కూ హైద‌రాబాద్ లో జ‌రిగే మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో చేనేత అందాల‌ను ప్ర‌ద‌ర్శించేలా ఒక ఏర్పాటు చేయ‌నుంది రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ.
ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాల విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీషు మాధ్యమంలో 5,64,064 మంది, తెలుగు మాధ్యమంలో 51,069 మంది పరీక్షలు రాశారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అతిపెద్దదైన విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర‌పాల‌క సంస్థ తెలుగుదేశం కూటమి వశం అయ్యింది. వైసీపీ చేతిలో ఉన్న ఈ మేయ‌ర్ పీఠన్ని దక్కించుకోవడానికి తెలుగుదఏశం కూటమి వ్యూహాత్మకంగా పావులు కదిపింది. విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా కూటమి వ్యూహాలు, వైసీపీ ప్రతి వ్యూహాలతో గత కొన్ని రోజులుగా విశాఖలో రాజకీయ వేడి పెరిగిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమయింది. ఈ నెల 22న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలను విడుదల చేయబోతున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఏపీ ఇంటర్ ఫలితాలు ఇప్పటికే ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే.
తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. నాగర్‌ కర్నూల్‌లో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్‌కుమార్ హెలికాప్టర్‌లో వెళ్లారు.కలెక్టరేట్ ప్రాంగణం‌లో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్నిప్రమాదం సంభవించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.