కోహ్లీ డ‌క్‌.. మ‌ళ్లీ ఓడిన భార‌త్‌

Publish Date:Sep 6, 2022

Advertisement

మంగళవారం (సెప్టెంబర్ 06) జరిగిన ఆసియా కప్ 2022 ఎడిషన్‌లో కీలకమైన సూపర్ ఫోర్ పోరులో పాకిస్థాన్‌తో జరిగిన ఓటమి తర్వాత, భారత్ శ్రీలంకతో తలపడింది. రోహిత్ శర్మ 41 బంతుల్లో 72 పరుగులు చేయడంతో పాటు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా ఆర్ అశ్విన్‌ల సహకారంతో వారు 173-8తో పోటాపోటీగా నిలిచారు, అయితే లంక ప్లేయ‌ర్లు మాత్రం పోటీ అంతటా ఆకట్టుకున్నారనే అనాలి. పరుగుల వేటలో భారత్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించారు. , దిల్షాన్ మధు శంక, కుసల్ మెండిస్, పాతుమ్ నిస్సాంక, కెప్టెన్ దసున్ షనక నాయకత్వం వహించారు. 

శ్రీ‌లంక టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకుంది. భార‌త్‌కు దుర‌దృష్టం ఆరంభంలోనే వెన్నాడింది. ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్లోనే కె.ఎల్‌. రాహుల్, త‌ర్వాత కోహ్లీ బౌల్డ్ కావ‌డం అంద‌ర్నీ ఎంతో నిరాశ‌ప‌రిచింది. మ‌ళ్లీ మంచి ఫామ్‌లోకి వ‌చ్చాడ‌నుకున్న కింగ్ కాస్తా, దుర‌దృష్ట‌వ‌శాత్తూ ప‌రుగులు చేయ‌కుండానే పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. మ‌రో వంక కెప్టెన్ శ‌ర్మ బాధ్యతాయుత ఇన్నింగ్స్ కొన‌సాగిస్తూ మంచి షాట్స్‌తో స్కోరును ముందుకు తీసికెళ్లాడు. ఐదోఓవ‌ర్లో సిక్స్ కొట్ట‌డంతో జ‌ట్టు స్కోరు 2 వికెట్ల న‌ష్టాన‌కి 44కి చ‌రింది. ఎనిమిదో ఓవ‌ర్లో 50 ప‌రుగుల‌కు చేరుకుంది. కొంత ప‌రిస్థితుల‌కు ప‌రిశీలిస్తూ ఆచీతూచీ ఆడుతూనే సిక్స్ బాద‌డంతో ప‌దో ఓవ‌ర్లో రోహిత్ శ‌ర్మ  50 ప‌రుగులు పూర్తిచేశాడు. భార‌త్ ప‌ది ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 79 ప‌రుగులు చేసింది. శ‌ర్మ సూర్య‌కుమార్ 44 బంతుల్లో 66 ప‌రుగులు చేశారు. 12వ ఓవ‌ర్ హ‌స‌రంగ ఓవ‌ర్లో రోహిత్ మ‌రో సిక్స్ కొట్ట‌డంతో భార‌త్ స్కోర్ 100కి చేరుకుంది. జ‌ట్టు స్కోర్ 110 వ‌ద్ద క‌రుణ‌ర‌త్న‌కి శ‌ర్మ దొరికాడు. రోహిత్ శ‌ర్మ 41 బంతుల్లో 71 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ చేరాడు. ఆ త‌ర్వాత సూర్య కూడా  అవుట‌వ‌డంతో భార‌త్ భారీ స్కోర్ ఆశ‌లు దెబ్బ‌తినాయి. రిష‌బ్ పంత్ మెరుపు ఆట ప్ర‌ద‌ర్శించి ఫోర్లు కొట్టి కొంత ఫ‌ర‌వాలేద‌నిపించాడు. కాగా 18వ ఓవ‌ర్లో మాత్రం భార‌త్ 17 ప‌రుగులు సాధించింది. 19వ ఓర‌వ‌ర్లో మొద‌టి బంతికే హుడా వెనుదిరిగాడు. మ‌ధుశంక చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మ‌ధుశంక 24 ప‌రుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. జ‌ట్టు స్కోరు 158 వ‌ద్ద పంత్ కూడా వెనుదిరిగాడు. అత‌ను వేగ‌వ‌గా 17 ప‌రుగులు చేయ‌గ‌లిగాడు. త‌ర్వాత వ‌చ్చిన అశ్విన్ ఒక భారీ సిక్స్ కొట్ట‌డంతో జ‌ట్టు స్కోర్ గౌర‌వ‌ప్ర‌ద‌స్థాయికి చేరిది. భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 173 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. 

174 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన లంక మొద‌టి నుంచే ధాటిగా బ్యాట్ చేసింది. భార‌త్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ మొద‌ట ఓవ‌ర్లో కేవ‌లం 1 ప‌రుగు ఇచ్చి శ‌భాష్ అనిపించుకున్నాడు. ఇదే స్థాయిలో బౌల‌ర్లు విజృలంభిస్తార‌ని అనుకున్నారు. కానీ రెండో ఓవ‌ర్ నుంచే లంకేయులు బాదుడు మొద‌లెట్టారు. అర్ష‌ద్ వేసిన రెండో ఓవ‌ర్లో 9 ప‌రుగుల చేశార‌. పాండ్య వేసిన 4 ఓవ‌ర్లో నిస్సం క భారీ సిక్స్ బాదాడు.  అలా మొద‌టి 6 ఓవ‌ర్ల‌లోనే శ్రీ‌లంక 50 ప‌రుగులు దాటేసింది. సింగ్‌,భువ‌నేశ్వ‌ర్‌, పాండ్యాలు లంక బ్యాట‌ర్ల పై ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. 7వ ఓవ‌ర్‌కి లంక 63 ప‌రుగులు చేసింది. 8వ ఓవ‌ర్లో వ‌చ్చిన‌ అనుభ‌వ‌జ్ఞుడైన స్పిన్న‌ర్ అశ్విన్ రెండో బంతికే భారీ సిక్స‌ర్ స‌మ‌ర్పించుకున్నాడు.  లంక 10వ ఓవ‌ర్‌కి నిస్సంక అర్ధ‌సెంచ‌రీ (33బంతుల్లో) పూర్తి చేశాడు. 13వ ఓవ‌ర్ల‌లో లంక 100 ప‌రుగులు దాటింది. కుశౄల్ మెంఇస్ మెరుపువేగంతో బ్యాట్ చేసి బౌల‌ర్ల‌ను ఇబ్బంది పెట్టాడు. కాగా 14వ ఓవ‌ర్లో లంక గుణ‌తిల‌క వికెట్ కోల్పోయింది. చాహ‌ల్ రెండు వికెట్లు తీసి కొంత ఆశ క‌ల్పించిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ లంక బ్యాట‌ర్లు పుంజుకుని నిల‌క‌డ‌గానే ఆడారు.

18వ ఓవ‌ర్లో పాండ్యా ఏకంగా 13 ప‌రుగులిచ్చి భార‌త్ ఆశ‌లు పూర్తిగా దెబ్బ‌తీశాడు. అంత‌కంటే ఘోరం 19వ ఓవ‌ర్‌లో భువ‌నేశ్వ‌ర్ రెండు వైడ్‌లు వేసి ప‌రిస్థితులు దిగ‌జార్చాడు. చివ‌రి ఓవ‌ర్ సింగ్ బాగానే చేశాడు. 7 ప‌రుగులు కావాల్సిన లంకకు బ్యాట‌ర్లు కాస్తంత ఖంగారుప‌డ్డారు. చిట్ట‌చివ‌రి రెండుబంతుల్లో ర‌న్ అవుట్ ఛాన్స్ భార‌త్ చేజార్చు కుని ఆట‌ను స‌మ‌ర్పించింది. 

By
en-us Political News

  
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.