కింగ్ కోహ్లీ పరుగుల యంత్రం.. విరాటుడికి రికార్డులు దాసోహం!

Publish Date:Apr 13, 2026

Advertisement

కింగ్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తరువాత దాదాపు ఆ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న గ్రేట్ క్రికెటర్. టెస్ట్, వన్డే, టి20 ఇలా మూడు ఫార్మట్లలోనూ కింగ్ కోహ్లీకి తిరుగే లేదు. అన్ని ఫార్మట్లలోనూ పరుగుల వరద పారించాడు. ప్రస్తతం అంతర్జాతీయ క్రికెట్ లో వన్డేలు మాత్రమే ఆడుతున్న విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో మాత్రం టి20లలో రికార్డుల మోత మోగిస్తున్నాడు. 

ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించారు.  ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో  ఆదివాకం (ఏప్రిల్ 12)  జరిగిన పోరులో   కోహ్లీ అరుదైన మైలురాయిని అధిగమించారు. టి20చరిత్రలోనే ముంబై ఇండియన్స్‌పై 1,000 పరుగుల మార్కును చేరుకున్న మొట్టమొదటి బ్యాటర్‌గా విరాట్ రికార్డు పుటల్లోకెక్కారు. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా తన బ్యాట్‌తో పరుగుల వరద పారించడం తనకు అలవాటేనని ఈ ఘనతతో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్   తొలుత బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్‌తో కలిసి జట్టుకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు.

 ఈ క్రమంలోనే ముంబైపై తన వ్యక్తిగత పరుగుల సంఖ్యను నాలుగు అంకెలకు చేర్చారు. ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా ముంబై లాంటి బలమైన జట్టుపై ఈ స్థాయిలో పరుగులు సాధించలేదు. ఈ మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీ  37 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇందులో ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు గతంలో జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20 మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే, విరాట్ కోహ్లీ 1030 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కోహ్లీ తర్వాత కేఎల్ రాహుల్ 977 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ 901 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. అజింక్య రహానే (888), సురేష్ రైనా (850) వంటి హేమాహేమీలు తర్వాతి స్థానాల్లో ఉన్నప్పటికీ, వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరిన ఘనత మాత్రం తొలుత కోహ్లీయే అందుకున్నాడు. ముంబై బౌలర్లను ఎదుర్కోవడంలో కోహ్లీ చూపిస్తున్న స్థిరత్వం అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.  37 ఏళ్ల వయస్సులోనూ కోహ్లీ తన ఫిట్‌నెస్, ఫామ్‌తో యువ ఆటగాళ్లకు సవాల్ విసురుతున్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటి వరకు ఆయన ఆడిన ఇన్నింగ్స్‌లు కోహ్లీ ఇంకా రిటైర్మెంట్  ఇప్పుడప్పుడే కాదని స్పష్టం చేస్తున్నాయి. గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా 1,174 పరుగులు చేసిన రికార్డు విరాట్ పేరిట ఉంది. ఒ కే జట్టుపై వెయ్యికి పైగా పరుగులు సాధించడం ఆయన కెరీర్‌లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ప్రస్తుత  కోహ్లీ ఫామ్ చూస్తుంటే, ఈ ఐపీఎల్ సీజన్‌లోనే   మరో భారీ రికార్డును అందుకోవడం ఖాయమనిపిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగుల మార్కును చేరుకోవడానికి కోహ్లీకి  కేవలం 200 పరుగుల  దూరంలో ఉన్నాడు.  ప్రస్తుత ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే  వచ్చే రెండు మూడు  మ్యాచ్‌ల్లోనే కోహ్లీ  ఘనతను   సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

 మొత్తం టీ20 కెరీర్‌లో ఇప్పటికే 13,500 పరుగులకు పైగా సాధించిన విరాట్, క్రిస్ గేల్ రికార్డుల వైపు అడుగులు వేస్తున్నారు. వరుస రికార్డులతో దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ ప్రదర్శనతో  ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.  

By
en-us Political News

  
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.