కింగ్ కోహ్లీ కటౌట్ అదిరింది !

Publish Date:Nov 5, 2022

Advertisement

రాజు ఒక్కడే ఉంటాడు.. క్రికెట్ లోనూ అంతే.. యుగానికి ఒకడు లా ఈ తరానికి కోహ్లీ యే కింగ్.. సచిన్, ధోనీ, దాదా లు వెనకంజలో పడిపోయారు. ఇప్పటి అత్యాధునిక ధనాధన్ క్రికెట్ కి వీరుడు, కింగ్ అనదగ్గ వాడు కోహ్లీయే అని క్రికెట్ లోకం లక్షనోళ్ల పొగుడుతోంది... ఆరాధిస్తోంది.  అత్యాధునిక రాజుకి, క్రికెట్ భగవాన్ కి నిలువెత్తు.. 36 అడుగుల కటౌట్ తో హైదరాబాద్ వీరాభిమానులూ వీరాభిమానం చాటుకుం టున్నారు. 

క్రికెట్ అంటే కోహ్లీ.. కోహ్లీ అంటే వీరబాదుడు.. పరుగుల వరద అంటే అతనితోనే సాధ్యం.  ఆమధ్య కొంత ఫామ్ కోల్పోయా డని నీరసపడిన క్రికెట్ అభిమానులకు మళ్లీ సరిగ్గా టీ20 ప్రపంచకప్ సమయానికి ఫామ్ లోకి తిరిగి వచ్చా సత్తా ప్రదర్శిస్తున్నాడు. టీ20 క్రికెట్ లో కోహ్లీ అత్యధికంగా 1065 పరుగులతో మొదటి స్థానంలో నిలిచాడు. ఇది ఆషా మాషీ వ్యవహారం కాదు. బుధవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 44 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచి మ్యాచ్ ని గెలిపించడంతో పాటు ఆ రికార్డును నెలకొల్పడం గమనార్హం. జట్టులో రోహిత్ శర్మ, కె ఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ వంటి హేమా హేమీలు ఉండవచ్చుగాక కోహ్లీ రూటే వేరు.. అతని రాక పరుగుల వరద. అతని జోరు పరుగుల హోరు.. ప్రేక్షకుల ఆనంద కెరటం. అదంతే గురూ.. అక్కడ అవతల ఎవరున్నా సరే.. ఇటు మనోడు బ్యాట్ తో రెచ్చిపోవడం ఖాయం అన్న ధీమా జట్టుకే కాదు.. ప్రేక్షకుల్లో ఉండడమే వారి గమనార్హం. ఇంతటి వీరాభిమానం పొందడం గతంలో సచిన్ కి ఆ తర్వాత దాదాకి ఆ తర్వాత ధోనీ కే సాధ్యమయింది. కానీ ఇప్పుడు క్రికెట్ లోకమంతా కోహ్లీ నామస్మరణతోనే గడిచిపోతోంది. అతను క్రికెట్ పిచ్చాడు.. భారీ స్కోర్ చేస్తేనే నిద్రపోతాడు.. అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. 

కుటుంబ సభ్యులకు దూరంగా జట్టు సభ్యులతో కలిసి ఉంటున్న కోహ్లీ... తన బర్త్ డే వేడుకలను కూడా జట్టు సభ్యుల మధ్యే జరుపుకున్నాడు. కోహ్లీ బర్త్ డే సందర్భంగా శనివారం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా... టీమిండియా మెంటల్ కండిషనింగ్ ఎక్స్ పర్ట్ ప్యాడీ అప్టాన్ తో కలిసి కోహ్లీ బర్త్ డే కేక్ ను కట్ చేశాడు. 

ఇదిలా ఉంటే...బర్త్ డే సందర్భంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో టాలీవుడ్ హీరో స్థాయి ఎలివేషన్ ను కోహ్లీ అందుకున్నాడు. కోహ్లీ బర్త్ డేను పురస్కరించుకుని నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిధిలో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద అతడి 50 అడుగుల ఎత్తున్న కటౌట్ వెలిసింది. క్రికెట్ లో సరికొత్త రికార్డులను లిఖిస్తూ సాగుతున్న కోహ్లీకి మరిచిపోలేని గుర్తుగా హైదరాబాదీ అభిమా నులు ఈ కటౌట్ ను ఆవిష్కరించారు.

By
en-us Political News

  
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వందేళ్లు దాటినా తగ్గని ఉత్సాహం.. 101 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యాలు ఇవే.!
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.