రేవంత్ సర్కార్ కు ఖర్గే కితాబు!

Publish Date:Jul 5, 2025

Advertisement

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  రెండు రోజుల రాష్ట్ర పర్యటన ముగిసింది. ఒక విధంగా ఉరమని ఉరుముల రాష్ట్రంలో కాలుపెట్టిన ఖర్గే, ఆయన వెంట వచ్చిన ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వచ్చిన పనితో పాటుగా పక్కపనులను చక్కపెట్టుకు వెళ్ళారని, పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. 
సరే.. పక్కపనుల సంగతి కాసేపు పక్కనపెట్టి అసలు విషయానికి వస్తే..  మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ప్రధానంగా సామాజిక న్యాయ సదస్సు పేరిట తెలంగాణ కాంగ్రెస్ కమిటీ  శుక్రవారం (జులై 4) ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రనికి వచ్చారు.అయితే సదస్సు సదస్సులా కాకుండా..  బహిరంగ సభలా జరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే..   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలప్రదర్శన సభలా జరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  విశ్లేషకులు పేర్కొనడమే కాదు.. పార్టీ నాయకులు అదే చెప్పుకుంటున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు. నిజంగా కూడా  ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సెంట్రిక్ గానే జరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానంతో పెరిగిన దురాన్ని తగ్గించుకునే ప్రయత్నంగానూ.. అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసి,తన కుర్చీని సుస్థిరం చేసుకునే ప్రయత్నంగా  ఎల్బీస్టేడియం సభను పేర్కొనవచ్చని పరిశీలకులతో పాటుగా, పార్టీ నాయకులు కూడా పేర్కొంటున్నారు. 
అందుకే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అదనంగా ఏడవ గ్యారెంటీగా.. పార్టీ అధిష్టానానికి వంద అసెంబ్లీ, 15 లోక్ సభ సీట్లను గ్యారెంటీ ఇచ్చారని అంటున్నారు. ఎల్బీ స్టేడియం సభలో ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి, కాదంటే, ఖర్గే ద్వారా పార్టీ అధినేత రాహుల్ గాంధీకీ.. మూడేళ్ల ముందే హామీ ఇస్తున్నా.. రాబోయే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లను గెలుస్తాం. ఇక్కడ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. వంద సీట్లలో ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత. తెలంగాణ నుంచి 15 మంది ఎంపీలను ఢిల్లీకి పంపుతాం. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మావంతు సహకారం అందిస్తాం  అంటూ ఇచ్చిన హామీ..  మూడేళ్ళు తనను ముఖ్యమంత్రి పదవిలో కొంసగించాలని చేసిన అభ్యర్ధనగానే  భావించవలసి ఉంటుదని పరిశీలకులు భావిన్తున్నారు.
అయితే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కుర్చీని కాపాడుకునెందుక చేసిన ప్రయత్నం సక్సెస్’ అయినట్లేనా అంటే..  తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కితాబు ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఖర్గే సంతృప్తి  చెందినట్లే ఉందని అంటు న్నారు. అంతే కాకుండా.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో తొలిసారిగా కులగణన చేయించిందని, కులగణనతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చేసిన వ్యాఖ్యాలు రేవంత్ రెడ్డి సర్కార్  కు అధ్యక్షులవారు ఇచ్చిన సర్టిఫికేట్ గానే భావించవలసి ఉంటుందంటున్నారు. అలాగే..  ఖర్గే తన ప్రసంగంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడం కూడా  ముఖ్యమత్రి రేవంత్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన కితాబుగానే  ముఖ్యమంత్రి అనుచరగణం పేర్కొంటున్నారు.

అయితే.. ఖర్గే ఇచ్చిన సర్టిఫికేట్ ముఖ్యమత్రి కుర్చీకి గ్యారెంటీ  ఇస్తుందా? అంటే అలా అనుకునే అవకాశం లేదని అంటున్నారు. ఖర్గే సంతృప్తి చెందితే సరిపోదనీ, హై కమాండ్ సంతృప్తి చెందితేనే.. ఏ ముఖ్యమంత్రి కుర్చీయినా నిలబడుతుందనీ లేదంటే ఏమి జరగాలో అదే జరుగుతుందని అంటున్నారు. అంతే కాకుండా ఇటీవల కర్ణాటకలో ముఖ్యమత్రి మార్పు విషయంగా ఖర్గే  అది పార్టీ హై కమాండ్ పరిధిలోని అంశమనీ,  హై కమాండ్ ఎలాంటి ఆలోచన చేస్తుందో ఎవరూ చెప్పలేరంటూ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నారు. స్వరాష్ట్రంలోనే  ముఖ్యమంత్రి మార్పు తన చేతిలో లేదని ఖర్గే చేతులెత్తేసిన నేపథ్యంలో.. కర్ణాటకలో అయినా, తెలంగాణాలో అయినా  హై కమాండ్ ముఖ్యమంత్రిని మార్చాలని అనుకుంటే ఖర్గే ఇచ్చిన సర్టిఫికేట్ ముఖ్యమంత్రి కుర్చీని కాపాడలేక పోవచ్చని అంటున్నారు.

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.