పేరుకు ఖర్గే.. పెత్తనం అంతా గాంధీ కుటుంబానిదే!

Publish Date:Nov 20, 2022

Advertisement

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల క్రతువు పూర్తయ్యింది. కొత్త అధ్యక్షుడు పగ్గాలు చేపట్టి నెల రోజులు దాటిపోయింది. దాదాపు పాతికేళ్ళ తర్వాత  కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఎన్నిక అన్నారు కనుక ఎన్నిక అంతే.. మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ లు ఇరువురు పోటీ చేశారు అని చెప్పుకోవడానికే. కానీ మల్లికార్జన్ కర్గే పేరు సోనియా ప్రతిపాదించిన క్షణంలోనే కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఆయనేనని ఎన్నిక అయ్యి, ఫలితం వచ్చే వరకూ ఆగకుండానే పార్టీ శ్రేణులూ, రాజకీయ వర్గాలూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశాయి. ఫలితాల్లోనూ అదే తేలింది. గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి బయటి వ్యక్త పార్టీ పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ లో ఏమైనా మార్పు కనిపించిందా అంటే ఏం లేదనే చెప్పాలి.   వాస్తవానికి సోనియా గాంధీ తొలుత పార్టీ అధ్యక్ష పదవికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను ఎంపిక చేశారు.  

అధిష్టానం అభ్యర్ధిగా ఆయన్ని బరిలో దించాలని ఆశించారు. ఆయన్ని ఒప్పించారు. కానీ ఆయన అంగీకరించినట్లే అంగీకరించి చివరిక్షణంలో చెయ్యిచ్చారు. ఆ తరువాత పలు ఆప్షన్లను పరిశీలించి చివరకు సోనియా మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేశారు.  ఎనిమిది పదుల ఖర్గేను  ఎంపిక చేశారు. ఇక అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసిన శశి థరూర్ గాంధీల నాయకత్వాన్ని సవాలు చేసిన జీ 23 సభ్యుడు. దీంతో సోనియా గాంధీ ఆశీస్సులు ఎవరికున్నాయో వేరే చెప్పనవసరం లేకుండానే తేలిపోయింది. ఆ విషయం అద్యక్ష ఎన్నికకు ముందే..  శశి థరూర్ కు విషయం అర్థమైపోయింది. అందుకే ఆయన తీరిగ్గా,అభ్యర్థులకు సమాన అవకాశాలు లేవని, అభ్యర్థుల మధ్య తారతమ్యాలు చూపుతున్నారని, అయిన వారికి ఆకుల్లో కానీ వారికీ కంచాల్లో అన్నట్లుగా పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని ఆరోపించేసి చేతులు దులుపుకున్నారు. అవును మరి నాడా దొరికిందని, గుర్రాన్ని కొంటే ఇలాగే ఉంటుందని అప్పట్లో భాష్యాలు కూడా చెప్పారు. 

 జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది  అన్నట్లుగానే అధిష్టానం అండదండలున్న మల్లిఖార్జున ఖర్గే సునాయసంగా అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. ఆయన పగ్గాలు చేపట్టి కూడా నెల రోజులు దాటిపోయింది.    శశి థరూర్ తాను అధ్యక్షుడినైతే పార్టీలో సమూల మార్పులు తెస్తానని ప్రచార సమయంలో చెప్పుకున్నారు.అయితే ఖర్గే మాత్రం  సోనియా గాంధీ, రాజమాతగా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ రారాజుగా నే కొనసాగుతారని చెప్పకనే చెప్పారు. అంటే తాను అధ్యక్షుడినైనా గాంధీ కుటుంబం పెత్తనం ఇసుమంతైనా మారదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది.  

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా నిర్ణయాలు తీసుకునే అధికారం సోనియా కుటుంబానిదే అని అప్పట్లోనే పరిశీలకులు చెప్పారు. అందులో ఇసుమంతైనా మార్పు ఉండదని కొత్త అధ్యక్షుడి నెల రోజుల హయాంలో ప్రస్ఫుటంగా తేలిపోయింది. ఇక పోతే   శశి థరూర్ ను  స్టార్ క్యాంపెయినర్స్ జాబితా నుంచి తాజాగా తొలగించడం ద్వారా గాంధీ కుటుంబాన్ని ధిక్కరించిన వారికి కాంగ్రెస్ లో స్థానం ఏమిటో మరోసారి స్పష్టంగా చూపినట్లైంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో శశి పేరు లేకపోవటం అందుకే పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.

థరూర్ ను తాము పక్కన పెట్టలేదని, శశి థరూర్ పేరు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్  జాబితాలో గతంలో ఎప్పుడూ చేర్చలేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడమే ఆశ్చర్యంగా ఉంది. తిరువనంతపురం ఎంపీ అయిన థరూర్ 2011,2016 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా  బాధ్యతలు నిర్వహించారు. 2014, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై, కోల్ కతా, చెన్నై నగరాల్లో శశి థరూర్ విస్తృతంగా ప్రచారం చేశారు.  ఇటీవలే నోయిడా లో జరిగిన బై పోల్స్ లోనూ ఆయన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో   పాల్గొన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆయన్ను స్టార్ క్యాంపెయినర్ గా గుర్తించకపోవటమంటే పొమ్మనలేక పొగబెట్టడమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఇదొక్కటే కాదు ధిక్కారాన్ని గాంధీ కుటుంబం సహించదనడానికి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే జీ-23లో ఒకరైన ఆనంద్ శర్మ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ హోదాను కోల్పోయారు. అలాగే మనీష్ తివారి, రణదీప్ సింగ్ సూర్జేవాలాకు కూడా అదే మర్యాద దక్కింది. తొలుత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బదులుగా రూపొందిన కొత్తగా వచ్చిన కమిటీలో ఆయనకు చోటు దక్కలేదు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఆయన్ను దూరం పెట్టడంతో శశి థరూర్ రాజకీయ భవితవ్యంపై మబ్బులు కమ్ముకున్నాయి. తాజా విషయాలపై స్పందించిన ఆయన తాను కేవలం మేధావినేనని భారత వ్యతిరేకిని, మోడీ వ్యతిరేకిని కానేకాననటం విశేషం. హిమాచల్, గుజరాత్ అసెంబ్లీఎన్నికల్లో ప్రచారం చేయాలని తాను వ్యక్తిగతంగా భావించినప్పటికీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో తనకు చోటు లేకుండా చేశారని, బహుశా పార్టీకి తన సేవలు అక్కర్లేదేమోనని ఆయన వ్యాఖ్యానించటం విశేషం. 

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.