ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో అపశ్రుతి: వాహనం కింద పడి యువకుడు దుర్మరణం.!

Publish Date:Sep 25, 2026

Advertisement

గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.  ఖైరతాబాద్‌  మహాగణపతి శోభాయాత్ర సాగుతుండగా ప్రమాదవశాత్తూ వాహనం కింద పడి ఓ యువకుడు మరణించాడు.  శుక్రవారం (సెప్టెంబర్ 25) ఉదయం ఖైరతాబాద్ జంక్షన్ పరిసర ప్రాంతంలో మహాగణపతి శోభాయాత్ర  సాగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

ఊరేగింపులో భాగంగా భారీ విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాన్స్‌పోర్టర్   వాహనం సమీపంలో ఓ ఇరవై ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తు  వాహనం కింద పడిపోయాడు. అక్కడున్న వారు గమనించి, స్పందిం చేలోపే ఆ యువకుడి పైనుంచి వాహనం దూసుకెళ్లడంతో  తీవ్రంగా గాయపడి మరణించాడు. సమాచారం అందుకున్న  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు ప్రారంభించారు.  


[Khairatabad tragedy, Ganesh immersion accident, Hyderabad procession, Khairatabad Ganesh procession, 20yearold youth die, Telugu One]

By
en-us Political News

  
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఘన నివాళులర్పించారు.
మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.
నిమజ్జన ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లుఅధికారుల పర్యవేక్షణలో   పక్కా ప్రణాళికతో  జరిగాయి. ఉత్సవ కమిటీ సభ్యులు ఉదయాన్నే ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి, సంప్రదాయబద్ధంగా సామూహిక ప్రార్థనలు చేపట్టారు. ఆ తర్వాత భారీ క్రేన్ల సహాయంతో   ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపైకి విగ్రహాన్ని చేర్చారు.
ఒక వివాహేతర సంబంధం ఇద్దరి జీవితాల్లో మొదలైన వివాదాన్ని.. ఏకంగా ఇరువర్గాల మధ్య గొడవగా మార్చింది.
హోరాహోరీ వేలంలో సామ ప్రణీత్ రెడ్డి .39 లక్షల రూపాయల రికార్డు ధరకు బాలాపూర్ గణేశుడి లడ్డూ  సొంతం చేసుకున్నారు.    ప్రతి ఏటా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ సాగుతున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఈ సారి మరో కొత్త రికార్డు సృష్టించింది
చివరి నిమిషంలో చేపట్టవలసిన కొన్ని సాంకేతిక వెల్డింగ్ పనులు, తదితర ముగింపు ఏర్పాట్ల కారణంగా ఉదయం యాత్ర ఆరంభం కావడంలో ఒకింత జాప్యం జరిగింది. అయితే ముందుగా నిర్ణయంచిన ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుని నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా పూర్తవుతుందని అధికారులు, నిర్వాహకులు చెబుతున్నారు.  
ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అమలు చేస్తున్న  ప్రజా సంక్షేమ పథకాలు, పరిపాలనా విధానాలకు గాను ఆర్యడన్ ముహమ్మద్ 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ పురస్కారానికి రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. 
దీనికి తోడు.. ఏయే జిల్లాల పరిధిలోని భూముల గురించి విచారణ జరుగుతుందో, ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఆయా కేసుల విచారణ సమయంలో ఈ కమిటీలో సభ్యులుగా భాగస్వాములు అవుతారు.   అసెంబ్లీలో  రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22-ఏ కింద జరిగిన చర్చల నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు జరిగింది.
తెలంగాణలో భూముల కొనుగోళ్లు, అమ్మకాల ప్రక్రియను ఎంతోకాలంగా వేధిస్తున్న 22ఏ (నిషేధిత భూముల జాబితా) సమస్యలకు శాశ్వత పరిష్కారం
రాజకీయ ఫిరాయింపులపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు.!
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట లభించింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సుప్రీంకోర్టు తీర్పుపై దానం నాగేందర్‌ స్పందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.