ఖైరతాబాద్ బరిలో కల్వకుంట్ల కవిత: కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెమటలు తథ్యం.!

Publish Date:Sep 25, 2026

Advertisement

తెలంగాణ రాజకీయ రంగంలో ప్రస్తుతం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక  హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ నియోజకవర్గంలో రాబోయే  ఉపఎన్నికలో కవిత బరిలోకి దిగనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేన పేర సొంత పార్టీ ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత.. ఏకకాలంలో ఇటు రేవంత్ సర్కార్ ను, అటు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ వైఫల్యాలనూ ఎండగడుతున్నారు. దీంతో ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో కల్వకుంట్ల కవిత దిగితే రాజకీయం రసకందాయంలో పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్ సభ్యత్వం రద్దు కావడంతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ నియోజకవర్గంలో పాగా వేయడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.  వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగనున్నారన్న వార్త పొలిటికల్ గా సంచలనంగా మారింది. హైదరాబాద్ మహానగర పరిధిలో  ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం ద్వారా కల్వకుంట్ల కవిత  రాజకీయాల్లో తన ప్రభావం చాటేందుకు రెడీ అయ్యారంటున్నారు. 

అంతే కాకుండా కేసీఆర్ కుమార్తె కవిత టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిస్తే, ఈ ఉపఎన్నిక రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న నాటకీయ పరిణామాలు, కుటుంబ రాజకీయాల నేపథ్యంలో కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.  కవిత రంగంలోకి దిగడం అంటూ జరిగితే ఖైరతాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆమె అభ్యర్థిగా రంగంలో ఉంటే.. అధికార కాంగ్రెస్ కు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూ కూడా గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, ఆయా పార్టీల విజయావకాశాలపై ప్రభావం పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

[Khairatabad Bypoll, Kavitha Kalvakuntla, Contest,  Danam Nagender disqualification, Telangana politics, Khairatabad assembly constituency, Telangana news, Telugu One]

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమాలు విద్య, విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఓ యాజమాన్యం అనుసరించిన సరికొత్త మార్గం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్, వ్యూయర్స్ సంపాదించాలనే పిచ్చి నేడు ఎంతోమంది యువతను తప్పుదారి పట్టిస్తోంది.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
స్నేహితులే కదా అని నమ్మాడు.. వాళ్లు ఫోన్ చేసి పిలిస్తే ఏదో మాట్లాడుకుందామని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కానీ అదే అతడి చివరి అడుగైంది.
భారతదేశంలో కోట్లాది మంది నిత్యం వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.