ఖైరతాబాద్ ఉపఎన్నికపై ట్విస్ట్: ఈసీఐ కీలక ప్రకటన.!

Publish Date:Oct 1, 2026

Advertisement

ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతతో నియోజకవర్గం ఖాళీ కాగా.. మరోవైపు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విషయంలో హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఖైరతాబాద్‌ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్‌ నేత పి. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ తుది పరిష్కారం అయ్యే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేయబోమని భారత ఎన్నికల సంఘం (ECI) హైకోర్టుకు తెలిపింది. విజయారెడ్డి 2024లోనే దానం నాగేందర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలిచారు. 

అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ ఫిరాయింపుపై దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్‌ 18న దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. ఆ తర్వాత ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. దానం నాగేందర్‌ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినప్పటికీ.. సెప్టెంబర్‌ 24న ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. 

దీంతో ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో 2024లో దానం నాగేందర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ తుది తీర్పు వచ్చే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఈసీఐని ఆదేశించాలని విజయారెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఎలక్షన్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక నిర్వహించబోమని ఈసీఐ హైకోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఈ పిటిషన్‌పై హైకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. కోర్టు విచారణ నేపథ్యంలో ఖైరతాబాద్‌ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడుతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై రాజకీయ ఆసక్తితో పాటు న్యాయపరమైన ఉత్కంఠ కూడా కొనసాగుతోంది.

 

 

 

[ Khairatabad by-election notification, Telangana High Court, Danam Nagender, Election Commission, Vijaya Reddy, CM Revanth reddy, BRS Party, KTR, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.