Publish Date:Feb 26, 2026
కర్నాటక రాజకీయం రసకందాయంలో పడిందా? డీకే వర్గం తిరుగుబాటుకు రెడీ అయ్యిందా? రాష్ట్రంలో అధికార మార్పిడి అంశం తుది అంకానికి చేరిందా? అన్న ప్రశ్నలకు జరుగుతున్న పరిణామాలను ఉటంకిస్తూ పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో తిరుగుబావుటా ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధిష్ఠానం ఇచ్చిన మాట మేరకు సిద్ధరామయ్య స్థానంలో తనను సీఎంను చేయాలని గత కొంత కాలంగా గట్టిగా పట్టుబడుతున్నారు.
ఈ విషయంలో అధిష్ఠానం చేస్తున్న తాత్సారం కారణంగా ఆయన వర్గీయులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తాజాగా డీకే వర్గానికి చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ హోటల్ లో గురువారం (ఫిబ్రవరి 27) సమావేశం కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, కర్నాటక కాంగ్రెస్ లో ప్రకంపనలకు కారణమైంది. ఓ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుక అని చెబుతున్నప్పటికీ.. అధికార మార్పిడి విషయంలో అధిష్ఠానంపై తిరుగుబావుటా సంకేతమనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండున్నరేళ్ల తర్వాత పదవిని డిప్యూటీ సీఎంకు అప్పగిస్తారనే ఒప్పందం ఉందని డీకే శివకుమార్ వర్గం బలంగా చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య తన బలాన్ని నిరూపించుకునేందుకు సమాయత్తమయ్యారన్న సంకేతాన్ని ఈ సమావేశం ద్వారా అధిష్ఠానానికి బలంగా ఇచ్చారని అంటున్నారు. కాగా ఈ సమావేశానికి సిద్ధరామయ్య కేబినెట్ లోని ఇద్దరు కీలక మంత్రులు కూడా హాజరు కావడంతో సిద్దరామయ్య, డీకే మధ్య ఆధిపత్య పోరు పీక్స్ కు చేరిందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
అదలా ఉంటే.. డీకే శివకుమార్ వర్గం బెంగళూరు హోటల్ లో సమావేశమైన సమయంలోనే కాకతాళీయమో, యాధృచ్ఛికమో చెప్పలేం కానీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మద్దతు పలుకుతున్న దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలో ఉన్నారు. వీరంతా ఆదివారం (మార్చి1)న స్వదేశానికి తిరిగి రానున్నారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం తన సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఆధిపత్యపోరుపై ఎప్పట్లగానే స్పందించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై తుది నిర్ణయం అధిష్ఠానానిదేనన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తరువాత రాష్ట్ర రాజకీయాలలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/key-developement-in-karnataka-politics-25-214721.html
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.