Publish Date:Jul 18, 2025
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. తాడిపత్రి పర్యటనకు తాజాగా ఆయనకు అనుమతి నిరాకరించారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు తాడిపత్రిలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడానికి సిద్దమైన కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. దాంతో నాలుగు రోజుల క్రితం పెద్దారెడ్డి తన పర్యటనను ఎప్పటిలాగే మరోసారి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నెల 18న పర్యటనకు ఓకే అన్న అధికారులు పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మనపల్లి చేరుకోగానే హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించడంతో మళ్లీ తాడిపత్రితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ క్రమంలో తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.
తాడిపత్రిలో తాజాగా వైసీపీ ‘చంద్రబాబు రీకాలింగ్’ మేనిఫెస్టో కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో తాడిపత్రికి వెళ్లేందుకు వీలు లేదని, తాడిపత్రిలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున తిమ్మంపల్లి నుంచి వెళ్లేందుకు వీలులేదని పోలీసులు స్పష్టం చేశారు. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైసీపీ నేతలు సమావేశానికి హాజరుకావొచ్చని పోలీసులు తెలిపారు. అలాగే కేతిరెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే స్వగ్రామమైన తాడిపత్రి సెగ్మెంట్లోని తిమ్మంపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఎందుకు అనుమతించరని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్లి తీరతానంటూ రోడ్డుపైనే మాజీ ఎమ్మెల్యే బైఠాయించారు. పోలీసుల తీరుపై పెద్దా రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ క్రమంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా తాడిపత్రిలోనూ అటు తిమ్మంపల్లిలోనూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు... ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టకుండా కోర్టు ఆంక్షలు విధించింది. అయితే తర్వాత హైకోర్టు ఆదేశాలతో సొంత ఇలాకాలోకి వెళ్లేందుకు పెద్దారెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తుంటే.. జేసీ వర్గీయుల తిరుగుబాటుతో పోలీసులు ఎప్పటికప్పుడు పెద్దారెడ్డికి అనుమతి నిరాకరిస్తున్నారు.
ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుని, పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. అయితే ఆ రోజు తాడిపత్రిలో మంత్రుల ప్రొగ్రాం ఉందని.. శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండటంతో వైసీపీ నేతలు తమ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 18 లేదా ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని సూచించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చేసేది ఏమి లేక పెద్దారెడ్డి అప్పుడు వెనుతిరిగారు.
తాజాగా మళ్లీ తాడిపత్రిలో ‘చంద్రబాబు రీకాలింగ్’ కార్యక్రమం చేపట్టడానికి పెద్దారెడ్డి తన స్వగ్రామం తిమ్మంపల్లి చేరుకున్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి , వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వైరం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రి రావడానికి రెడీ అయినా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం ఆయన్ని అడ్డుకోవడనికి ఎక్కడికక్కడ మొహరిస్తోంది. ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అవ్వడంతో పోలీసులు శాంతిభద్రల విఘాతం కలుగుతుందని మరోసారి పెద్దారెడ్డి పర్యటనకు చెక్ పెట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kethireddy-pedda-reddy-39-202220.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.