పుణే కేతన్ అగర్వాల్ మృతి కేసులో షాకింగ్ నిజాలు

Publish Date:Jun 24, 2026

Advertisement

 

బర్త్‌డే ప్లాన్ వెనుక దాగున్న భారీ కుట్ర..

మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పుణే ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ (26) మరణం వెనుక ఊహించని నమ్మకద్రోహం బయటపడింది. మొదట లోహగడ్ కోటపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడని భావించిన ఈ కేసు, చివరకు కాబోయే భర్తను అడ్డుతొలగించుకోవడానికి ఒక యువతి ఆడిన క్రూరమైన నాటకమని పోలీసులు తేల్చారు. నిందితురాలైన సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి ఈ ఘోరానికి ఒడిగట్టారు.

నవంబర్ నెలలో అంగరంగ వైభవంగా జరగాల్సిన వివాహానికి ఇరు కుటుంబాలు ఉదయ్‌పూర్‌లో ప్యాలెస్‌ను కూడా బుక్ చేసుకున్నాయి. కేతన్ తన కాబోయే భార్య సియా రాబోయే పుట్టినరోజు వేడుకల కోసం ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేశాడు. ఇందుకోసం మహాబలేశ్వర్‌లోని ఓ లగ్జరీ రిసార్ట్‌లో ఏకంగా 40కి పైగా గదులను కూడా రిజర్వ్ చేశాడు. అంతగా ప్రేమించిన వ్యక్తిని, సియా మాత్రం తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడన్న ఏకైక కారణంతో అత్యంత కిరాతకంగా అంతమొందించింది.

జూన్ 18వ తేదీన సియా పుట్టినరోజు ముందస్తు వేడుకల నెపంతో కేతన్‌ను లోహగడ్ కోటకు రప్పించింది. అక్కడ ఫోటోలు దిగుతున్న తరుణంలో, ఆమె తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్‌ను దాదాపు 400 అడుగుల లోతైన లోయలోకి తోసేసింది. అంతకుముందు జూన్ 14న కూడా వారు ఇదే కోటపై కేతన్‌ను నెట్టేయడానికి ప్రయత్నించగా, అతడు పొదలను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పట్లో పామును చూసి భయపడి నీపై పడ్డానని సియా నమ్మబలికి తృటిలో తప్పించుకుంది.

ఈ ఘాతుకం అనంతరం సియా ఏమీ ఎరగనట్లు నటిస్తూ.. "నన్ను నా బర్త్‌డే రోజే ఒంటరిని చేసి వెళ్ళిపోయావు" అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెట్టింది. అయితే, ఘటనా స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులకు తీవ్రమైన ఎండలో కూడా ముఖాన్ని కవర్ చేస్తూ హుడీ ధరించిన ఒక అనుమానితుడు కనిపించాడు. ఆ హుడీ ధరించిన వ్యక్తి సియా ప్రియుడు చేతన్‌గా గుర్తించడంతో ఈ మిస్టరీ వీడింది.

సియా గోయల్ పూణేకు చెందిన 22 ఏళ్ల చేతన్ బాబులాల్ చౌదరి అనే యువకుడితో గత ఒక సంవత్సర కాలంగా ప్రేమలో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేతన్‌తో పెళ్లి సియాకు ఇష్టం లేదు, కానీ ఆ విషయాన్ని నేరుగా ఇంట్లో చెప్పలేక కేతన్‌ను పూర్తిగా తన దారి నుండి తొలగించాలని ఆమె తన ప్రియుడు చేతన్‌తో కలిసి ఒక భయంకరమైన కుట్ర పన్నింది. 

కేవలం జనవరి 1 నుండి జూన్ 18 మధ్య ఈ ఆరు నెలల కాలంలోనే సియా, చేతన్ ఇద్దరూ ఏకంగా 2,004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారు, వారి మొత్తం సంభాషణల సమయం 238 గంటలుగా తేలింది. కేతన్‌ను అంతమొందించడానికి వీరు గతంలో కూడా ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. జూన్ మొదటి వారంలో కేతన్, సియా ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం బాలి వెళ్లాల్సి ఉండగా, ముంబై విమానాశ్రయంలో కేతన్ పాస్‌పోర్ట్ అదృశ్యమైంది. 

నిజానికి ఆ ట్రిప్ రద్దు కావాలని సియానే కేతన్ పాస్‌పోర్ట్‌ను దొంగిలించి దాచిపెట్టింది. అంతకుముందు మే 31న కూడా లోహగఢ్ కోటకు వెళ్ళినప్పుడు సియా అతడిని నెట్టేయడానికి ప్రయత్నించింది, కానీ కేతన్ తృటిలో తప్పించుకోగా, అక్కడ పామును చూసి కాపాడటానికి నెట్టానని అబద్ధం చెప్పి కేతన్‌ను నమ్మించింది.

ఈ ఘోర ఉదంతంపై బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. "పెళ్లి ఇష్టం లేకపోతే నేరుగా చెబితే వివాహం రద్దు చేసుకునేవాళ్లం, అంతేకాని ఇంత దారుణానికి ఒడిగట్టాలా" అంటూ కేతన్ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. ప్రస్తుతం నిందితులిద్దరినీ లోనావాలా రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. ఈ కిరాతక ప్రేమికులకు కోర్టు కఠినమైన శిక్ష విధిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.
 

By
en-us Political News

  
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.