కేతన్ హత్య కేసులో షాకింగ్ నిజాలు.. ప్రియుడి కోసం కోటి నొక్కేసింది!

Publish Date:Jun 29, 2026

Advertisement

 

పుణేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ అత్యంత దారుణ హత్యకు గురైన ఉదంతంలో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. కాబోయే భార్యే కాలయముడిగా మారి, తన ప్రియుడితో కలిసి ఆడిన కిరాతక నాటకం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

పోలీసు వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం, నిందితురాలు సియా గోయల్ పెళ్లి షాపింగ్ నెపంతో కేతన్ అగర్వాల్ నుంచి ఏకంగా కోటి రూపాయల భారీ మొత్తాన్ని వసూలు చేసింది. అయితే ఆ సొమ్మును షాపింగ్‌కు వాడకుండా, రహస్యంగా తన ప్రియుడైన చేతన్ చౌదరికి అందజేసింది. చేతన్ కెరీర్, వ్యాపారాల్లో స్థిరపడటానికి ఈ డబ్బును పెట్టుబడిగా పెట్టాలని వీరిద్దరూ ముందుగానే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఆర్థికంగా బలోపేతం కావడానికి చేతన్‌కు కనీసం మూడేళ్ల సమయం పడుతుందని భావించిన ఈ జంట, కేతన్‌ను వదిలించుకున్నాక అంతా సద్దుమణిగాక వివాహం చేసుకోవాలని ప్లాన్ చేశారు. హత్య జరిగిన తర్వాత సుమారు మూడు సంవత్సరాల పాటు సియా ఎలాంటి పెళ్లి చేసుకోకుండా సాధారణంగా గడపాలని, ఆ తర్వాతే చేతన్‌ను పెళ్లాడాలని ఇద్దరూ పక్కా స్కెచ్ వేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

జూన్ 18వ తేదీన లోహగఢ్ కోట పరిసరాల్లో జరిగిన ఈ ఘాతుకానికి ముందే వీరు సంకేతాలను కూడా సిద్ధం చేసుకున్నారు. కోటపై నడుస్తున్న సమయంలో సియా షూ లేస్ కట్టుకుంటున్నట్లు లేదా నీళ్లు తాగుతున్నట్లు కిందకు వంగిన వెంటనే, అదే అదనుగా చేతన్ వెనుక నుంచి వచ్చి కేతన్‌ను లోయలోకి నెట్టేయాలని పథకం రచించారు. కేతన్ పడిపోయే సమయంలో సియాను పట్టుకునేందుకు కూడా వీల్లేకుండా ఈ వ్యూహాన్ని అమలు చేశారు.

ఈ కిరాతక చర్యకు కేవలం 34 నిమిషాల ముందే సియా, చేతన్ చౌదరిల మధ్య రహస్య కాల్ సంభాషణ జరిగినట్లు కాల్ డేటా రికార్డుల ద్వారా పోలీసులు గుర్తించారు. అదే హత్యకు తుది సంకేతంగా భావిస్తున్నారు. అంతేకాకుండా, పోలీసుల నిఘా నేత్రాలు, హైవే టోల్ ప్లాజాల వద్ద దొరకకుండా ఉండేందుకు చేతన్ కారును పక్కనబెట్టి, పుణే నుండి లోహగఢ్ కోట వరకు స్కూటర్‌పైనే ప్రయాణించడం గమనార్హం.

ఈ దారుణ ఉదంతంపై స్థానిక ప్రజలు, వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. నమ్మిన వ్యక్తిని ఇంత దారుణంగా మోసం చేసి, ప్రాణాలు తీయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు మరిన్ని కోణాల్లో ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కోటి రూపాయల లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలను, హత్యకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఉన్నారు. త్వరలోనే వీరిపై పక్కా సాక్ష్యాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

By
en-us Political News

  
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.