బీజేపీ అజెండా అమలు దిశగా కీలక ముందడుగు

Publish Date:Apr 5, 2025

Advertisement

ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండా అమలు విషయంలో చాల పట్టుదలగా ఉంది. భాగస్వామ్య పార్టీలపై తనదైన ముద్ర వేస్తూ  మోడీ సర్కార్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండా అమలు దిశగా ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నది. అందులో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదాన్ని పొందింది.  వక్ఫ్ వ్యవస్థ లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడం వల్లే వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చామని స్వయంగా ప్రధాని మోడీయే ప్రకటించారు. లోక్ సభ, రాజ్యసభలలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించడం కీలక పరిణామమనీ,ఈ బిల్లు ఆమోదంతో సామాన్య ముస్లింలకు మేలు చేకూరుతుందనీ మోడీ నమ్మకంగా చెబుతున్నారు.  కాంగ్రెస్,ఇతర ప్రతిపక్షాలు,ముస్లిం వర్గాల నిరసనల మధ్య పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది.

లోక్ సభలో 288-232 గా,రాజ్యసభలో128-95 గా ఓట్లు వచ్చాయి. ఉభయసభల్లోనూ ఈ బిల్లుపై విసృతంగా చర్చ జరిగింది. లోక్ సభలో 14 గంటలు,రాజ్యసభలో 13గంటల పాటు చర్చ జరిగింది.  చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు  బిల్లులోని లోపాలను  బలంగా ఎత్తి చూపాయి. అనూహ్యంగా వక్ఫ్ బిల్లు ను వ్యతిరేకించే విషయంలో ఇండియా కూటమి పార్టీలన్నీ ఏకతాటిపై నిలబడ్డాయి. అందుకే సునాయాసంగా పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందుతుని అంతా భావించినా వక్ఫ్ బిల్లు ను పాస్ చేయించుకోవడానికి కేంద్రం నానా తంటాలూ పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్డీయే భాగస్వామ్య పార్టీలలోనే వక్ఫ్ బిల్లు విషయంలో అనుమానాలు ఉన్నాయి. కూటమి ధర్మంలో భాగంగా బిల్లును గట్టిగా వ్యతిరేకించకపోయినా, పట్టుబట్టి మరీ తమకు కావలసిన సవరణలు చేయించుకున్నాయి. వాటిలో ముఖ్యంగా తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపాదించిన సవరణల్లో ఒక్కటి మినహా..మిగిలిన అన్నిటినీ మోడీ సర్కార్ అంగీకరించింది. ఆ మేరకు సవరణలు చేసింది. చంద్రబాబు మద్దతు కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు అత్యంత కీలకం కనుకనే మోడీ ఈ సవరణలకు ఓకే చెప్పారన్నది నిర్వివాదాంశం.

ఇక ఇప్పుడు ఉభయసభల ఆమోదంతో వక్ బిల్లు రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారుతుంది. ముస్సల్మాన్ వక్ఫ్ చట్టం1923 రద్దై కొత్త చట్టం అమలులోకి వస్తుంది. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డు లు తమ ఆస్తుల వాస్తవ విలువను నిర్దారించుకోవడానికి కలెక్టర్ల వద్ద వాటిని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.  దేశంలో 30 వక్ఫ్ బోర్డులున్నాయి. 9.4 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న 8.7లక్షల ఆస్తులు వక్ఫ్ బోర్డులో నియంత్రణలో ఉన్నాయి. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తా కాదా అని నిర్ణయించే అధికారం ఇస్తుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ దానిని రద్దు చేయకపోతే బోర్డు నిర్ణయం అంతిమం అవుతుంది.వక్ఫ్ ట్రిబ్యునల్ అధికారం కొత్త చట్టం కలెక్టర్లకు వర్తించేలా చేస్తుంది. నిర్ణయం వచ్చేవరకూ వివాదస్పద ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తారు. ఈ బిల్లు మేరకు వక్ఫ్ కౌన్సిల్ లో22మందిలో ఇద్దరు ముస్లిమేతర వ్యక్తులు ఉండవచ్చు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు లో 11 మంది సభ్యుల్లో ఇద్దరు ముస్లిమేతరలు ఉండవచ్చు. రూ.లక్ష కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వక్ఫ్ సంస్థలు ఆడిట్ చేయించాలి. ముస్లిం మతం కనీసం ఐదేళ్లు పాటించేవారు తమ ఆస్తిని వక్ఫ్ కు ఇవ్వవచ్చు. వక్ఫ్ ప్రకటనకు ముందే మహిళలు తమ వారసత్వం పొందాలని, విడాకులు తీసుకున్న మహిళలు,వితంతువులు,అనాధలకు ప్రత్యేక నిబంధనలు ఈ బిల్లు నిర్దేసిస్తుంది. ఈ బిల్లు ముస్లింలకే లాభమని,ముస్లీమేతరులు జోక్యం చేసుకోలేరని కేంద్రమైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా చెబుతున్నారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటన లో బిజీగా ఉండగా హోంమంత్రి అమిత్ షా 12 గంటలపాటు ఉభయ సభల్లో ఉండి ప్రణాళిక ప్రకారం బిల్లు ఆమోదం జరిగేలా చూసి తన వ్యూహ చతురతను, సామర్ధ్యాన్నీ మరోసారి చాటారు.  

ఇదిలావుండగా వక్ఫ్ సవరణ బిల్లు2025పై తాజాగా కాంగ్రెస్,ఎంఐఎం సుప్రీంకోర్టు ను ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, ఎంఐఎం  ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోర్టులో పిటిషన్ వేసారు.ఈ బిల్లు  రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సవాల్ చేసారు. ముస్లింసమాజ ప్రాధమిక హక్కులు ఉల్లంఘించే లా బిల్లు ఉందని  పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా  జగన్ నేతృత్వంలోని వైసీపీ వక్ఫ్ సవరణ బిల్లు వ్యతిరేకించి సంచలనం రేపింది. రాష్ట్రంలో మైనార్టీలకు కలుపుకుని టీడీపీ,జనసేనలను దెబ్బకొట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. మొత్తంగా బీజేపీ తన అజెండా అమలు విషయంలో పడిన కీలక ముందడుగుగా వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదాన్ని భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.